Kuja Dosha
జులై 12 నుంచి కుజుడు తన స్వస్థానమైన మేష రాశిని వదిలిపెట్టి వృషభ రాశిలోకి ప్రవేశించడం జరుగుతోంది. కుజుడు వృషభ రాశిలో ఆగస్టు 26 వరకూ కొనసాగడం జరుగుతుంది. వృషభ రాశి కుజుడికి శత్రు క్షేత్రం అయినందువల్ల ఈ గ్రహం విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండడమే మంచిది. కుజుడి రాశి మార్పు వల్ల మేషం, వృషభం, మిథునం, తుల, వృశ్చికం, కుంభ రాశుల వారికి కుజ దోషం, అంటే మాంగల్య దోషం ఏర్పడబోతోంది. ఏ రాశికైనా 1,2,4,7,8,12వ రాశుల్లో కుజ ప్రవేశం జరిగినప్పుడు కుజ దోషం ఏర్పడుతుంది. దీనివల్ల కుటుంబ, దాంపత్య జీవితాల్లో కలతలు ఏర్పడడం, జీవిత భాగస్వామితో ఎడబాటు కలగడం, జీవిత భాగస్వామి అనారోగ్యానికి గురి కావడం వంటివి జరిగే అవకాశం ఉంది. మాంగల్య దోష నివారణ కోసం ఎక్కువగా సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం మంచిది.
- మేషం: కుజుడు ఈ రాశికి రెండవ స్థానంలో ప్రవేశించినందువల్ల ఈ రాశివారికి కుజ దోషం ఏర్పడింది. అయితే, కుజుడు ఈ రాశికి అధిపతి అయినందువల్ల ఈ దోషం కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. వృషభ రాశి కుజుడి వల్ల ఈ రాశివారికి జీవిత భాగస్వామితో వాగ్వాదాలు తలెత్తే అవకాశం ఉంది. కుటుంబంలో ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. దంపతులు ఎడమొహం, పెడమొహంగా ఉండే అవకాశం ఉంది. అపార్థాలు తలెత్తడానికి ఆర్థిక వ్యవహారాలు, మాట తొందర కారణం కావచ్చు.
- వృషభం: ఈ రాశిలో కుజుడి ప్రవేశం వల్ల వీరికి కుజ దోషం లేదా మాంగల్య దోషం ఏర్పడుతుంది. అహం భావం, ఆధిపత్య ధోరణి, విలాసాల మీద అధిక ఖర్చులు వంటి కారణాల వల్ల భార్యాభర్తల మధ్య కీచులాటలు, మనస్పర్థలు తలెత్తే అవకాశం ఉంది. కొద్దిగా అనారోగ్యం కూడా కారణం కావచ్చు. పంతాలు, పట్టింపుల వల్ల ఇద్దరి మధ్యా ఎడబాటుకు అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో వీలై నంత అన్యోన్యంగా ఉండడానికి, ఓర్పు, సహనాలతో వ్యవహరించడానికి ప్రయత్నించడం మంచిది.
- మిథునం: ఈ రాశికి 12వ స్థానంలో కుజుడి ప్రవేశం వల్ల ఈ రాశివారికి కుజ దోషం ఏర్పడింది. దంపతుల్లో ఒకరు దూర ప్రాంతానికి బదిలీ కావడం లేదా వృత్తి, ఉద్యోగాల్లో పని భారం పెరగడం, అనారోగ్యా నికి గురి కావడం, ప్రయాణాలు చేయాల్సి రావడం వంటి కారణాల వల్ల దాంపత్య జీవితానికి దూరం కావడం, దాంపత్యంలో సుఖ సంతోషాలు లోపించడం వంటివి జరిగే సూచనలున్నాయి. వీరికి ఈ దోషం కొద్దిగా ఎక్కువగానే ఉండే అవకాశం ఉన్నందువల్ల స్కంద స్తోత్రం చదువుకోవడం మంచిది.
- తుల: ఈ రాశికి అష్టమ స్థానంలో కుజ సంచారం వల్ల ఈ రాశివారికి కుజ దోషం ఏర్పడింది. దీనివల్ల దంపతుల మధ్య బంధువుల కారణంగా మనస్పర్థలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఆర్థిక కార ణాలు కూడా పంతాలు, పట్టింపులకు, అపార్థాలు, అనుమానాలకు కారణమవుతాయి. ఇద్దరి మధ్యా కొద్దిపాటి ఎడబాటు ఏర్పడడానికి అవకాశం ఉంది. దంపతులు ఎంత సామరస్యంగా, సాను కూలంగా వ్యవహరిస్తే అంత మంచిది. ఈ రాశివారికి కుజ దోషం ఎక్కువగా ఉండే అవకాశముంది.
- వృశ్చికం: ఈ రాశికి సప్తమంలో కుజ సంచారం వల్ల ఈ రాశివారికి కుజ దోషం కలిగింది. ఈ రాశికి కుజుడు రాశ్యదిపతి అయినందువల్ల కుజ దోషం తక్కువగా ఉండే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహా రాలు, ఆస్తి వివాదాలు, బంధువుల కారణంగా దంపతుల మధ్య వివాదాలు, విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఒకరి మీద మరొకరికి అనుమానాలు తలెత్తే అవకాశం కూడా ఉంది. దంపతులు పారదర్శకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఈగో సమస్యలకు అవకాశం ఇవ్వకపోవడం మంచిది.
- కుంభం: ఈ రాశికి నాలుగవ స్థానంలో కుజ సంచారం వల్ల కుజ దోషం ఏర్పడింది. దీనివల్ల కుటుంబ జీవి తంలో సుఖ సంతోషాలు లోపిస్తాయి. దాంపత్య జీవితానికి దూరం కావడం జరుగుతుంది. సాధా రణంగా ఆధిపత్య ధోరణులు, కుటుంబ వ్యవహారాలు, బంధువుల జోక్యాల వల్ల ఇద్దరి మధ్యా ఎడ బాటు తలెత్తే అవకాశం ఉంది. దీర్ఘకాలిక పర్యటనలు, ప్రయాణాల వల్ల కూడా ఇద్దరి మధ్యా సమ స్యలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈగో సమస్యల్ని కూడా ఎంత తగ్గించుకుంటే అంత మంచిది.