Zodiac Signs: వృషభ రాశిలో కీలక గ్రహాలు.. ఆ రాశుల వారిపై దుష్ఫ్రభావం చూపే అవకాశం..! జాగ్రత్త

| Edited By: Janardhan Veluru

May 20, 2024 | 5:24 PM

ప్రస్తుతం వృషభ రాశిలో గురు, శుక్ర, రవి గ్రహాలు చేరి ఉన్నాయి. ఇందులో శుక్ర, రవి గ్రహాలు ఈ రాశిలో జూన్ 15 వరకూ కొనసాగుతాయి. గురు గ్రహం 2025 మే చివరి వరకూ ఇదే రాశిలో సంచారాన్ని కొనసాగిస్తుంది. ఒక రాశిలో మూడు, అంతకన్నా ఎక్కువ సంఖ్యలో గ్రహాలు కలిసినప్పుడు సహజంగానే ఆ రాశి మీద భారం పెరుగుతుంది. సమతూకం దెబ్బతింటుంది.

Zodiac Signs: వృషభ రాశిలో కీలక గ్రహాలు.. ఆ రాశుల వారిపై దుష్ఫ్రభావం చూపే అవకాశం..! జాగ్రత్త
Astrology 2024
Follow us on

ప్రస్తుతం వృషభ రాశిలో గురు, శుక్ర, రవి గ్రహాలు చేరి ఉన్నాయి. ఇందులో శుక్ర, రవి గ్రహాలు ఈ రాశిలో జూన్ 15 వరకూ కొనసాగుతాయి. గురు గ్రహం 2025 మే చివరి వరకూ ఇదే రాశిలో సంచారాన్ని కొనసాగిస్తుంది. ఒక రాశిలో మూడు, అంతకన్నా ఎక్కువ సంఖ్యలో గ్రహాలు కలిసినప్పుడు సహజంగానే ఆ రాశి మీద భారం పెరుగుతుంది. సమతూకం దెబ్బతింటుంది. ఈ రకంగా మూడు గ్రహాలు ఒక రాశిలో కలవడం వల్ల కొన్ని రాశులకు శుభ ఫలితాలు ఇచ్చే అవకాశమున్నప్పటికీ, కొన్ని రాశులకు మిశ్రమ ఫలితాలు లేదా దుష్ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ మూడు గ్రహాల కలయిక వల్ల మిథునం, తుల, ధనుస్సు, కుంభం, మీన రాశులు మిశ్రమ ఫలితాలను అనుభవించడం జరుగుతుంది.

  1. మిథునం: ఈ రాశికి వ్యయ స్థానంలో, అంటే 12వ స్థానంలో గురు, శుక్ర, రవులు చేరడం వల్ల ఈ రాశివారికి ఎంత సంపాదించినా, ఎంత కష్టపడ్డా ఫలితం మాత్రం తక్కువగా ఉంటుంది. శుభ కార్యాలు, దైవ కార్యాల మీద ఖర్చు ఎక్కువగా ఉంటుంది. వెనుకా ముందూ చూడకుండా ఇతరులకు ఇతోధికంగా సహాయం చేయడం వల్ల నష్టపోవడం జరుగుతుంది. ఎవరికైనా ఆర్థిక సహాయం చేసే పక్షంలో ఆ డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉండదు. ప్రభుత్వ మూలకంగా కూడా ధన నష్టం ఉంటుంది.
  2. తుల: ఈ రాశికి అష్టమంలో ఈ మూడు గ్రహాలు చేరడం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం బాగా తగ్గుతుంది. అదే సమయంలో వృత్తి, ఉద్యోగాల్లో జీవిత భాగస్వామి ప్రాభవం పెరుగుతుంది. బంధు మిత్రుల్లో అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు తగ్గే అవకాశం ఉంది. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆదాయానికి లోటుం డదు కానీ, వృథా ఖర్చులు పెరుగుతాయి. కొద్దిగా ఆస్తిపాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది.
  3. ధనుస్సు: ఈ రాశికి ఆరవ స్థానంలో రాశ్యధిపతి గురువుతో సహా మూడు గ్రహాలు కలవడం వల్ల, ఇష్టం లేని ప్రాంతాలకు బదిలీ కావడం, జీతభత్యాలు తగ్గడం, ఉద్యోగంలో ప్రాధాన్యం తగ్గడం వంటివి జరుగు తాయి. అనవసర పరిచయాలతో వీలైనంత అప్రమత్తంగా ఉండడం మంచిది. కొందరు స్నేహితులు తప్పుదోవ పట్టించే అవకాశం కూడా ఉంది. భారీగా మోసపోయే అవకాశం ఉంది. ఆదాయానికి లోటుండదు. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
  4. కుంభం: ఈ రాశికి చతుర్థ స్థానంలో మూడు గ్రహాలు చేరడం వల్ల ముఖ్యమైన వ్యవహారాల్లో, సమస్యల పరిష్కారంలో స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడానికి, సరైన ఆలోచనలు చేయడానికి అవకాశం ఉండదు. ఊహించని విధంగా గృహ, వాహన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కుటుంబ సమస్యలు కూడా ఉత్పన్నం కావచ్చు. బంధుమిత్రులతో కూడా అపార్థాలు చోటు చేసుకుం టాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. ఆస్తి కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది.
  5. మీనం: ఈ రాశికి తృతీయ స్థానంలో రాశ్యధిపతి గురువుతో సహా మూడు గ్రహాలు చేరడం వల్ల ప్రతి ప్రయత్నంలోనూ అనేక ఆటంకాలు ఎదురవుతుంటాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఒక పట్టాన ముందుకు సాగవు. ఆర్థిక పురోగతి స్తంభించిపోతుంది. అయితే, ఈ రాశివారు ఖర్చులు తగ్గించుకోవడం, పొదుపు పాటించడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ప్రయాణాల వల్ల నష్టపోయే అవకాశముంటుంది. అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు.