Maha Yogas: వృషభ రాశిలో కీలక గ్రహాలు.. ఆ రాశుల వారికి మహా యోగాలు పక్కా..!

| Edited By: Janardhan Veluru

May 29, 2024 | 4:27 PM

స్థిర రాశి అయినటువంటి వృషభ రాశిలో మూడు శుభ గ్రహాలు గురు, శుక్ర, బుధులు, గ్రహ రాజు రవి చేరడం వల్ల కొన్ని రాశుల వారికి నెల రోజుల పాటు మహా యోగాలు పట్టబోతున్నాయి. జూన్ 1 నుంచి బుధుడు వృషభ రాశి ప్రవేశం చేసిన దగ్గర నుంచి..

Maha Yogas: వృషభ రాశిలో కీలక గ్రహాలు.. ఆ రాశుల వారికి మహా యోగాలు పక్కా..!
Zodiac Signs
Follow us on

స్థిర రాశి అయినటువంటి వృషభ రాశిలో మూడు శుభ గ్రహాలు గురు, శుక్ర, బుధులు, గ్రహ రాజు రవి చేరడం వల్ల కొన్ని రాశుల వారికి నెల రోజుల పాటు మహా యోగాలు పట్టబోతున్నాయి. జూన్ 1 నుంచి బుధుడు వృషభ రాశి ప్రవేశం చేసిన దగ్గర నుంచి మేషం, వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకర, కుంభ రాశుల వారి దశ తిరగడం ప్రారంభం అవుతుంది. వృషభ రాశిలో ఏర్పడే యోగాలు తప్పకుండా ఫలిస్తాయని జ్యోతిష శాస్త్రం చెబుతోంది.

  1. మేషం: ఈ రాశివారికి ద్వితీయ స్థానంలో నాలుగు గ్రహాలు కలవడం వల్ల మహాభాగ్య యోగం ఏర్పడు తుంది. దీనివల్ల అనేక మార్గాల్లో ఆదాయం కలిసి రావడంతో పాటు ఆకస్మిక థన లాభానికి కూడా అవకాశం ఉంది. ఉద్యోగంలో జీతభత్యాలు అనూహ్యంగా పెరగడం, వృత్తి, వ్యాపారాల్లో లాభాలు, రాబడి దాదాపు రెండింతలు కావడం వంటివి జరుగుతాయి. కొత్త పరిచయాల వల్ల కూడా ఆర్థిక లాభం కలుగుతుంది. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. ఆస్తి విలువ బాగా పెరుగుతుంది.
  2. వృషభం: ఈ రాశిలో నాలుగు శుభ గ్రహాలు కలవడం వల్ల ఈ రాశివారికి అధికార యోగం పడుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవంతో పాటు హోదా పెరిగే అవకాశం కూడా ఉంది. ప్రముఖులతో పరి చయాలు ఏర్పడి, పలుకుబడి పెరుగుతుంది. ఆరోగ్యం బాగా కుదుటపడుతుంది. వ్యక్తిగత సమ స్యలు చాలావరకు పరిష్కారం అయి, మనశ్శాంతి ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల పరంగా అంచనాలకు మించి వృద్ధి చెందుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశముంది.
  3. కర్కాటకం: ఈ రాశివారికి లాభ స్థానంలో నాలుగు గ్రహాల సంచారం వల్ల ‘వృద్ధి’ యోగం లేదా ఐశ్వర్య యోగం పట్టడం జరుగుతుంది. వ్యక్తిగత జీవితంలోనే కాకుండా, వృత్తి జీవితంలో కూడా శీఘ్ర పురోగతి ఉంటుంది. ఏ రంగానికి చెందినవారైనప్పటికీ ఆదాయపరంగా, అధికారపరంగా ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశం ఉంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాల పంట పండే సూచనలున్నాయి.
  4. కన్య: ఈ రాశివారికి భాగ్య స్థానంలో రాశ్యధిపతి బుధుడితో సహా నాలుగు గ్రహాలు చేరడం వల్ల మహా భాగ్య యోగం పట్టడం జరుగుతుంది. విదేశాలకు వెళ్లడానికి సంబంధించిన ఆటంకాలన్నీ తొలగి పోతాయి. విదేశాల్లో ఉద్యోగం సంపాదించడం, విదేశీ సొమ్మును అనుభవించడం, విదేశాల్లో స్థిరప డడం వంటివి జరుగుతాయి. పెళ్లి విషయంలో కూడా విదేశీ సంబంధమే ఖాయమయ్యే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. పిత్రార్జితం సంక్రమిస్తుంది.
  5. వృశ్చికం: ఈ రాశివారికి సప్తమంలో శుభ గ్రహాలు చేరడం వల్ల కలలో కూడా ఊహించని వివాహ యోగం పడుతుంది. సంపన్న కుటుంబం లేదా పలుకుబడి కలిగిన కుటుంబంతో సంబంధం ఖాయమై, ఊహించని విధంగా జీవితం మారిపోతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడే అవకాశం కూడా ఉంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. వృత్తి జీవితం కొత్త పుంతలు తొక్కు తుంది. ఉద్యోగ జీవితంలో అనేక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆకస్మిక ధన లాభం ఉంటుంది.
  6. మకరం: ఈ రాశివారికి పంచమ స్థానంలో నాలుగు గ్రహాలు చేరడం వల్ల విపరీత రాజయోగం పడుతుంది. ఎక్కడికి వెళ్లినా రాచమర్యాదలు జరుగుతాయి. ఉద్యోగంలో ప్రతిభా పాటవాలు మరింతగా వెలుగు లోకి వస్తాయి. అధికార యోగం పట్టే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఇబ్బడిముబ్బడిగా లాభాలు పెరుగుతాయి. వీటిల్లో కొత్త ఆలోచనలను, కీలక మార్పులను ప్రవేశపెట్టి లబ్ధి పొందు తారు. సంతాన యోగానికి కూడా బాగా అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి.
  7. కుంభం: ఈ రాశికి నాలుగవ స్థానంలో నాలుగు గ్రహాలు కలవడం వల్ల గృహ, వాహన యోగాలు పట్టే అవ కాశం ఉంది. ఉద్యోగంలో తప్పకుండా హోదా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాల కారణంగా సామాజిక హోదా కూడా పెరుగుతుంది. ఆస్తి పాస్తులు సంక్రమించే అవకాశం ఉంది. ఆస్తి విలువ పెరుగుతుంది. మాతృమూలక ధన లాభం ఉంది. ఆర్థిక ప్రయత్నాలన్నీ సత్ఫలితాలనివ్వడం ప్రారంభిస్తాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.