AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zodiac Signs: కీలక గ్రహాల అనుకూలత.. ఆ రాశుల వారికి మనసులోని కోరికలు నెరవేరడం పక్కా..!

శని, కుజుడు, బుధుడు ఎవరి స్థానాల్లో వారు ఉండడంతో పాటు గురువు కూడా అనుకూలంగా ఉన్నందువల్ల ఆరు రాశుల వారికి మనసులోని కోరికలు, ఆశయాలు, ఆశలు నెరవేరే అవకాశం ఉంది. మరో నెల రోజుల పాటు వీరి ప్రధాన కోర్కెలను ఈ మూడు గ్రహాలు తీర్చే అవకాశం ఉంది.

Zodiac Signs: కీలక గ్రహాల అనుకూలత.. ఆ రాశుల వారికి మనసులోని కోరికలు నెరవేరడం పక్కా..!
Zodiac Signs
TV9 Telugu Digital Desk
| Edited By: Janardhan Veluru|

Updated on: Jun 12, 2024 | 3:25 PM

Share

శని, కుజుడు, బుధుడు ఎవరి స్థానాల్లో వారు ఉండడంతో పాటు గురువు కూడా అనుకూలంగా ఉన్నందువల్ల ఆరు రాశుల వారికి మనసులోని కోరికలు, ఆశయాలు, ఆశలు నెరవేరే అవకాశం ఉంది. మరో నెల రోజుల పాటు వీరి ప్రధాన కోర్కెలను ఈ మూడు గ్రహాలు తీర్చే అవకాశం ఉంది. మేషం, వృషభం, మిథునం, సింహం, తుల, మకర రాశుల వారి కలల్లో చాలా భాగం సాకారం అయ్యే సూచనలున్నాయి.

  1. మేషం: ఈ రాశిలో రాశ్యధిపతి కుజుడి సంచారం, లాభ స్థానంలో శనీశ్వరుడు, ధన స్థానంలో గురువు ఉండడం వల్ల ఈ రాశివారికి ధన సంపాదన సంబంధమైన కోరికలు నెరవేరడంతో పాటు, వృత్తి, ఉద్యోగాల్లో శాఖాధిపతి కావాలన్న కోరిక కూడా తప్పకుండా నెరవేరుతుంది. ప్రముఖులతో పరిచ యాలు ఏర్పడడం, విలాస జీవితం గడపడం, భారీగా వస్త్రాభరణాలు కొనుగోలు చేయడం వంటి ఆశయాలు, ఆశలు సాకారమయ్యే సూచనలున్నాయి. సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి.
  2. వృషభం: దశమ స్థానంలో దశమాధిపతి శనీశ్వరుడు, రాశి కేంద్రంలో గురువు, ధన స్థానంలో శుక్ర, బుధ, రవుల సంచారం వల్ల ధన సంపాదనకు సంబంధించిన కోరికలు పూర్తి స్థాయిలో నెరవేరే అవకాశం ఉంది. శృంగార సంబంధమైన కోరికలు కూడా పూర్తిగా నెరవేరే సూచనలున్నాయి. గృహ, వాహన సౌకర్యాలు ఏర్పడతాయి. సిబ్బంది మీద అధికారం చెలాయించే అవకాశం కూడా లభిస్తుంది. ఉద్యోగపరంగా, ఆర్థికపరంగా స్థిరత్వం లభిస్తుంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది.
  3. మిథునం: ఈ రాశిలో బుధ, శుక్ర, రవి గ్రహాల సంచారం, భాగ్య స్థానంలో శనీశ్వరుడు, లాభ స్థానంలో కుజుడు వీరి మనసులోని హేతుబద్ధమైన కోరికల్లో అధిక భాగాన్ని నెరవేరుస్తాయి. కుటుంబంలో అందరి కంటే ఉన్నత స్థానంలో ఉండాలని, ఇతరులకు సహాయం చేసే పరిస్థితిలో ఉండాలనే కోరికలు సఫ లం అవుతాయి. విదేశాలకు వెళ్లాలనే కోరిక కూడా నెరవేరుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో శీఘ్ర పురో గతిని సాధించడానికి కూడా అవకాశం ఉంది. సర్వత్రా ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. జనా కర్షణ వృద్ధి చెందుతుంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. జీవనశైలి మారుతుంది.
  4. సింహం: ఈ రాశివారికి లాభ స్థానంలో రాశ్యధిపతి రవితో సహా మూడు గ్రహాలు చేరడం, దశమంలో గురువు, భాగ్య స్థానంలో కుజుడు సంచారం చేస్తుండడం వల్ల విదేశాలకు వెళ్లాలన్న చిరకాల వాంఛ తప్పకుండా నెరవేరుతుంది. ఉద్యోగం కోసం గానీ, ఉద్యోగరీత్యా గానీ విదేశాలకు వెళ్లే అవ కాశం కలుగుతుంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వీరి సలహాలు, సూచన లకు ప్రాధాన్యం పెరుగుతుంది. వీరి కోరికకు తగ్గట్టు అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది.
  5. తుల: వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఇబ్బడిముబ్బడిగా రాబడి పెంచాలన్న ఈ రాశివారికి కోరిక నెరవేరే అవకాశం ఉంది. పదిమందికీ సహాయం చేయాలన్న ఆకాంక్ష కూడా ఫలించడం జరుగుతుంది. సంపన్న కుటుంబంలో వివాహం జరగాలన్న ఆశయం కూడా ఫలవంతం అవుతుంది. విలాస వంతమైన జీవనశైలి లభించాలన్న ఆకాంక్ష నెరవేరుతుంది. ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచ యాలు ఏర్పడతాయి. గృహ, వాహన యోగాలు పడతాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది.
  6. మకరం: వృత్తి, ఉద్యోగాల్లో తన ప్రతిభకు గుర్తింపు లభించాలని, అధికారం చేపట్టాలన్న చిరకాల వాంఛ నెర వేరుతుంది. నిరుద్యోగులు తమ ఆశయం మేరకు విదేశాల్లో ఉద్యోగం సంపాదించే అవకాశం ఉంది. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఇష్టమైన ప్రాంతాలకు విహార యాత్రలు చేయడం జరుగుతుంది. లాటరీలు, షేర్లు, స్పెక్యులేషన్ ద్వారా అధికాదాయం పొందే సూచనలున్నాయి. భారీగా వస్త్రాభరణాలు కొనే అవకాశం ఉంది. ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరిగే అవకాశం ఉంది.