Astrology: కీలక గ్రహాల అనుకూలత.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే..!

| Edited By: Janardhan Veluru

Jan 14, 2025 | 6:55 PM

Telugu Astrology: మార్చి 29 నుంచి మీన రాశిలో శనీశ్వరుడి సంచారం మొదలవుతుంది. అప్పటికే శుక్ర గ్రహం కూడా అదే రాశిలో ఉచ్ఛ స్థితిలో కొనసాగుతుంటాడు. అలాగే అత్యంత శుభ గ్రహాలైన గురు, శుక్రులకు పరివర్తన కూడా ఏర్పడింది. మే 25 వరకూ కొనసాగే ఈ శుభ పరిణామాల కారణంగా కొన్ని రాశుల వారి జీవితాల్లో పలు శుభ పరిణామాలు చోటుచేసుకునే అవకాశముంది.

Astrology: కీలక గ్రహాల అనుకూలత.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే..!
Telugu Astrology
Follow us on

మార్చి 29 నుంచి మీన రాశిలో శని సంచారం ప్రారంభం అవుతుంది. అప్పటికి శుక్రుడు కూడా అదే రాశిలో ఉచ్ఛ స్థితిలో కొనసాగుతుంటాడు. పైగా అత్యంత శుభ గ్రహాలైన గురు, శుక్రులకు పరివర్తన కూడా ఏర్పడింది. మే 25 వరకూ కొనసాగే ఈ శుభ పరిణామాల కారణంగా వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకర, కుంభ రాశుల వారి జీవితాల్లో గణనీయంగా శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. వీరి జీవితాల్లో తప్పకుండా కొత్త అధ్యాయాలు ప్రారంభం అవుతాయి. ఉద్యోగం, వృత్తి, వ్యాపారాలు, ఆదాయం, ఆర్థిక స్థితిగతులు, కుటుంబ జీవితం, ఆరోగ్యం వంటి విషయాల్లో తప్పకుండా సమూలమైన, సానుకూలమైన మార్పులు చేసుకుంటాయి.

  1. వృషభం: ఈ రాశివారికి తప్పకుండా కుబేరుడి అనుగ్రహం, లక్ష్మీ కటాక్షం కలిగే అవకాశం ఉంది. రాశి నాథుడు శుక్రుడు లాభ స్థానంలో ఉచ్ఛపడుతున్నందువల్ల ఈ రాశివారికి అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. సాధారణ స్థితిలో ఉన్న వ్యక్తి సైతం సంపన్నుడు కావ డం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అందలాలు ఎక్కే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగ, వివాహ, విదేశీ ప్రయత్నాలు సఫలమవుతాయి.
  2. కర్కాటకం: ఈ రాశికి భాగ్య, లాభ స్థానాలు శుభ గ్రహాలతో బాగా బలంగా మారుతున్నందువల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. అనేక విధాలుగా ధన యోగాలు కలుగుతాయి. విదేశీ సంపాదన అనుభ వించే యోగం కలుగుతుంది. వారసత్వ సంపద లభిస్తుంది. ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరుగు తుంది. ఆదాయ ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఇతర ఆర్థిక లావాదేవీలు అపార ధన లాభాలనిస్తాయి. అనారోగ్యాల నుంచి కూడా కోలుకునే అవకాశం ఉంది.
  3. కన్య: ఈ రాశికి సప్తమ, భాగ్య స్థానాల మధ్య శుభ సంబంధం ఏర్పడుతున్నందువల్ల వృత్తి, వ్యాపారాల్లో విశేషమైన పురోగతి, ధన లాభాలు కలుగుతాయి. ఆదాయ వృద్ధికి ఎంత ప్రయత్నిస్తే అంత లాభం కలుగుతుంది. ఉద్యోగంలో ఊహించని ఉన్నత పదవులు లభించే అవకాశం ఉంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం నిశ్చ యం కావడం, సంపన్న వ్యక్తితో ప్రేమలో పడడం గానీ జరుగుతుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.
  4. వృశ్చికం: ఈ రాశివారికి పంచమ, సప్తమ స్థానాలు బలంగా మారుతున్నందువల్ల దాదాపు కోరుకున్నదల్లా లభిస్తుంది. మనసులోని ముఖ్యమైన కోరికలు, ఆశలు చాలావరకు నెరవేరుతాయి. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఆస్తి సమస్యలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి నిశ్చయం అవుతుంది. ప్రేమ వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. షేర్లు, స్పెక్యులేషన్లు అంచనాలకు మించి లాభిస్తాయి.
  5. మకరం: ఈ రాశివారికి తృతీయ, పంచమ స్థానాలు బలపడుతున్నందువల్ల, ముఖ్యంగా రాశ్యధిపతి శనిని ఈ రాశికి అత్యంత శుభుడైన శుక్రుడు కలుస్తున్నందువల్ల ఆర్థికంగా విశేషమైన పురోగతి కలగడంతో పాటు, అనేక సమస్యలు, ఒత్తిళ్ల నుంచి విముక్తి లభిస్తుంది. తక్కువ ప్రయత్నంతో ఎక్కువ లాభాలు పొందుతారు. ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు పురోగతి చెందుతాయి. ఊహించని లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి.
  6. కుంభం: రాశ్యధిపతి శని ధన స్థానంలో ఉచ్ఛ శుక్రుడిని కలవడం, ధన స్థానాధిపతి గురువుతో చతుర్థాధి పతి గురువు పరివర్తన చెందడం వల్ల కొద్ది కాలం పాటు ఏలిన్నాటి శని ప్రభావం నుంచి విముక్తి లభిస్తుంది. ఆదాయం అంచనాలకు మించి పెరుగుతుంది. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. ఆస్తి వివా దాలు, కోర్టు కేసులు సానుకూలంగా పరిష్కారమవుతాయి. సొంత ఇంటి కల నెరవేరుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగంలో ఆశించిన పదోన్నతులు కలుగుతాయి.