శుభ గ్రహంగా కేతువు.. ఆ రాశుల వారిపై వరాల వర్షం కురిపించడం పక్కా..!
కేతువు ప్రస్తుతం కన్యారాశిలో సంచరిస్తోంది. కేతువు మీద రాహువుతో పాటు శుక్ర, రవి, గురు, శని గ్రహాల దృష్టి కూడా పడుతున్నందు వల్ల ఈ గ్రహం చాలావరకు శుభ గ్రహంగా మారిపోయే అవకాశం ఉంది. దీని ప్రభావంతో కొన్ని రాశుల వారికి ఆర్థిక లాభాలు, ఉద్యోగంలో పురోగతి, కుటుంబ సంతోషం లభించే అవకాశం ఉంది. కొన్ని రాశులకు విదేశీ ప్రయాణాలు, పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం కూడా ఉంది.

Ketu Impact
కేతువు ఒక మిస్టరీ గ్రహం. ఈ అంతుబట్టని పాప గ్రహం ఎప్పుడు ఎలా మంచి చేస్తుందో, ఎలా కీడు చేస్తుందో ఎవరూ చెప్పలేరు. కేతువు ఒక ఆధ్యాత్మిక గ్రహం కూడా. దీన్ని జ్యోతిషశాస్త్రం ఒక మోక్షకారక గ్రహంగా కూడా అభివర్ణిస్తుంది. ప్రస్తుతం కన్యారాశిలో మే 18 వరకు సంచరించబోతున్న ఈ కేతువు మీద రాహువుతో పాటు శుక్ర, రవి, గురు, శని గ్రహాల దృష్టి కూడా పడుతున్నందు వల్ల ఈ గ్రహం చాలావరకు శుభ గ్రహంగా మారిపోయే అవకాశం ఉంది. వృషభం, సింహం, కన్య, వృశ్చికం, మకరం, మీన రాశుల వారి జీవితాలు నల్లేరు కాయల మీద బండిలా సాగిపోవడం జరుగుతుంది.
- వృషభం: ఈ రాశికి పంచమ స్థానంలో కేతువు సంచారం వల్ల సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో మీ సమర్థతకు, నిర్వహణ సామర్థ్యానికి మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయాలు సాధిస్తారు. ప్రేమ ప్రయత్నాలు, పెళ్లి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి.
- సింహం: ఈ రాశికి ధన స్థానంలో ఉన్న కేతువు మీద అయిదు శుభ గ్రహాల దృష్టి పడినందువల్ల అనుకో కుండా ఆదాయం బాగా పెరుగుతుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా, హ్యాపీగా సాగిపోతుంది. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. ఆక స్మిక ధన ప్రాప్తి సూచనలున్నాయి. విద్యార్థులు చదువుల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్ అందుతుంది. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.
- కన్య: ఈ రాశిలో సంచారం చేస్తున్న కేతువు వల్ల వ్యక్తిగత సమస్యలు, అనారోగ్య సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆధ్యాత్మిక విషయాల మీద ఆసక్తి పెరుగుతుంది. కుటుంబసమేతంగా ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. ఆస్తి వివాదాలకు పరిష్కారం లభిస్తుంది. వైవాహిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి.
- వృశ్చికం: ఈ రాశికి లాభ స్థానంలో సంచారం చేస్తున్న కేతువు వల్ల మీకు రావలసిన డబ్బు చేతికి అందు తుంది. మొండి బాకీలు కూడా వసూలవుతాయి. ఆస్తిపాస్తుల మీద వచ్చే ఆదాయం వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఇతర ఆర్థిక లావాదేవీల వల్ల ఊహించని లాభాలు కలుగుతాయి. తోబుట్టువులతో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు వృద్ధి చెందుతాయి. ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు సానుకూలంగా సాగిపోయే అవకాశం ఉంది.
- మకరం: ఈ రాశికి భాగ్య స్థానంలో ఉన్న సుమారుగా మరో నెల రోజులు ఉండబోతున్న కేతువు వల్ల విదేశీ ప్రయాణాలకు, దూర ప్రయాణాలకు అవకాశం ఎక్కువగా ఉంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందే అవకాశం ఉంది. తండ్రి నుంచి ఆస్తి లాభాలు కలుగుతాయి. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆధ్యాత్మిక చింతన బాగా వృద్ధి చెందుతుంది.
- మీనం: ఈ రాశికి సప్తమ స్థానంలో సంచారం చేస్తున్న కేతువు మీద ఈ రాశి నుంచి నాలుగు గ్రహాలు చూస్తున్నందువల్ల పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా విజయం సాధించే అవకాశం ఉంది. ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి కావడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో సమస్యలు తగ్గి సానుకూలతలు పెరుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు కలిగే అవకాశం ఉంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండకపోవచ్చు. విదేశీయానానికి మార్గం సుగమం అవుతుంది.