జాతకంలో నవ గ్రహాలు, రాశుల ప్రభావంతో వ్యక్తి జీవితంలో మంచి చెడులను, సుఖ దుఃఖాలను నిర్ణయిస్తాయి. ఛాయా గ్రహాలైన రాహు, కేతు గ్రహాలను పాప గ్రహాలుగా భావిస్తారు. కేతువు ముక్తి కారకుడు. అశ్విని, మఖ, మూలా నక్షత్రాలకు ఆధిపత్యం వహిస్తాడు. అయితే ఈ కేతు గ్రహం దేవగురువైన బృహస్పతితో కలవడం వల్ల జీవితంలో పెనుమార్పులు ఏర్పడనున్నాయి. దీంతో కొన్ని రాశులకు చెందిన వ్యక్తుల దశ ఎవరూ ఊహించని విధంగా మారిపోతుంది. కొన్ని గోచరాలు, యోగాల వలన జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. అంతేకాదు కొందరు సమాజంలో కీర్తి ప్రతిష్టలు అందుకుంటాడు. మరికొందరు ఊహించని ఉన్నత స్థానానికి ఎదుగుతాడు. అంతేకాదు కొన్ని గోచారాలు వలన కాలం కలిసి వచ్చి శుభం జరుగుతుంది. చేపట్టిన పనులు సక్సెస్ అవుతాయి. ఈ నేపధ్యంలో కేతు గురు కలయికతో ఏర్పడే కేతు గురు గోచారం శుభాలను కలుగజేస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. నవ గ్రహాల్లో బృహస్పతి స్థానం అంటే గురువు స్థానం విశిష్ట స్థానం. గురువు అనుకూలిస్తే చేపట్టిన పనులు ఎటువంటివి అయినా చాలా సులభంగా కంప్లీట్ చేస్తారు. పెళ్లి చేయలన్నా, ఇల్లు కొనాలన్నా ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించాలన్నా గురు గ్రహం అనుకూలంగా ఉండాలి. అనేక శుభఫలితాలు పొందుతారు. ఈ నేపధ్యంలో కేతు గురువు కలయిక వలన కొన్ని రాశులకు చెందిన వ్యక్తుల జాతకంలో పెను మార్పులు సంభవిస్తాయి. అదృష్టం కలిసి వస్తుంది. ఈ రోజు ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం..
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు