Shubh Yogas
సాధారణంగా చెడు ఫలితాలను ఎక్కువగా ఇచ్చే కేతువు అక్టోబర్ 10వ తేదీ వరకు శుభ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం కన్యా రాశిలో సంచారం చేస్తున్న ఈ వక్ర గ్రహంతో రవి, ఉచ్ఛ బుధుడు కలవడం, ఈ కలయికను గురు, కుజులు పూర్ణ దృష్టితో వీక్షించడం వల్ల కేతువు స్వభావం పూర్తిగా మారిపోతుంది. ధన నష్టాన్ని కలిగించే కేతువు ఇక నుంచి ధన లాభాన్ని కలిగిస్తాడు. కుటుంబ సౌఖ్యాన్ని తగ్గించే కేతువు కుటుంబ సౌఖ్యాన్ని పెంచుతాడు. వేధించడం, ఏడిపించడం, కష్టాల పాలు చేయడం వంటి లక్షణాల స్థానంలో సుఖ పెట్టడం, ఆనందపరచడం జరుగుతుంది. వృషభం, కర్కాటకం, సింహం, కన్య, వృశ్చికం, మీన రాశుల వారు ఈ కేతువు వల్ల అత్యధికంగా ప్రయోజనాలు పొందబోతున్నారు.
- వృషభం: ఈ రాశికి పంచమ స్థానంలో ఉన్న కేతువు వల్ల ఏ చిన్న ప్రయత్నం చేపట్టినా అత్యధిక లాభా లను పొందడం జరుగుతుంది. పిల్లలకు సంబంధించిన సమస్యలు, కుటుంబ సమస్యలు పూర్తిగా తొలగిపోయి, కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఉద్యోగంలో అధికారుల వేధింపులు, సహోద్యోగుల సతాయింపులు ఏవైనా ఉంటే సర్దుమణుగుతాయి. ప్రతిభకు, సమర్థతకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఆటంకాలు, అవరోధాలు తొలగిపోయి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.
- కర్కాటకం: ఈ రాశికి తృతీయంలో ఉన్న కేతువు శుభుడుగా మారుతున్నందువల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయాలు సాధిస్తారు. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. ఆదాయ ప్రయత్నాలే కాక, ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు కూడా అంచనాలకు మించిన శుభ ఫలితాలనిస్తాయి. ఉద్యోగంలో రాజ యోగాలు కలుగుతాయి. ఉన్నత స్థానాలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక వ్యవహారాలు సత్ఫలితాలనిస్తాయి.
- సింహం: ఈ రాశికి ధన స్థానంలో సంచారం చేస్తున్న కేతువు అనేక విధాలుగా ఆర్థిక లాభాలను కలిగి స్తాడు. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా వృద్ధి చెందుతుంది. అనేక మార్గాల్లో సంపద కలిసి వస్తుంది. కుటుంబ సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. మాటకు విలువ పెరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. దాంపత్య జీవితం అనుకూలంగా సాగిపోతుంది. ఇంట్లో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు, ప్రేమ వ్యవహారాల్లో ఊహించని విజయాలు సాధిస్తారు.
- కన్య: ఈ రాశిలో సంచారం చేస్తున్న కేతువు శుభుడుగా మారడం వల్ల వ్యక్తిగతంగా ఆశించిన పురోగతి ఉంటుంది. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక సమస్యల నుంచి కూడా గట్టెక్కుతారు. ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. హోదా పెరిగే అవకాశం కూడా ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కష్టనష్టాలు బాగా తగ్గిపోయి ఊరట కలుగుతుంది. అనారోగ్యాల నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో తప్పకుండా శుభవార్తలు వింటారు.
- వృశ్చికం: ఈ రాశికి లాభ స్థానంలో ఉన్న కేతువు వల్ల చాలా కాలంగా ఆగిపోయి ఉన్న శుభ కార్యాలు ఇక చోటు చేసుకుంటాయి. పెండింగ్ పనులు, వ్యవహారాలన్నీ పూర్తయి ఊరట కలుగు తుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. కోర్టు కేసుల్లో విజయాలు సాధిస్తారు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. మనసులోని కోరికలు, ఆశలు చాలావరకు నెరవేరుతాయి. ఆదాయానికి లోటుండదు.
- మీనం: ఈ రాశికి సప్తమంలో సంచారం చేస్తున్న కేతువు వల్ల అనారోగ్యాల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ఆదాయ ప్రయత్నాలన్నీ విజయాలు సాధిస్తాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుం డదు. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధాలు కుదురుతాయి. సంపన్న కుటుం బానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం గానీ, పెళ్లి కుదరడం గానీ తప్పకుండా జరుగుతుంది.