Kamada Ekadashi 2025: పెండింగ్ పనులు పూర్తి కావాలంటే.. కామద ఏకాదశి రోజున రాశి ప్రకారం ఏ వస్తువులు దానం చేయాలంటే..

హిందూమతంలో పండగలు పర్వదినాలు జరుపుకోవడం వెనుక శాస్త్రీయ కోణంతో పాటు జీవిత పరమార్ధం దాగుతుంది. మనిషికి మనిషి తోడు.. అనే నీతిని తెలియజేస్తూ ప్రత్యేక సందర్భాల్లో శక్తి కొలదీ దానం చేయడం పుణ్యం, శుభప్రదం అనే నియమాన్ని పెద్దలు పెట్టారు. ఇలా పండగలు ప్రత్యేక సందర్భాల్లో దానం చేయడం వలన పేదలు, అపన్నులు అవసరాలు తీరతాయి. అదే విధంగా హిందువులు జరుపుకునే తిధుల్లో కామద ఏకాదశి తిధి చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున విష్ణువును పూజించడం శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజున ఉపవాసం ఉండి పూజలు చేయడం, దానధర్మాలు చేయడం వలన ఒక వ్యక్తి పెండింగ్‌లో ఉన్న పని పూర్తవుతుందని నమ్ముతారు.

Kamada Ekadashi 2025: పెండింగ్ పనులు పూర్తి కావాలంటే.. కామద ఏకాదశి రోజున రాశి ప్రకారం ఏ వస్తువులు దానం చేయాలంటే..
Kamada Ekadashi

Updated on: Apr 03, 2025 | 3:29 PM

ప్రతి నెల శుక్ల , కృష్ణ పక్ష ఏకాదశి తిధులకు విశిష్ట స్థానం ఉంది. ఈ రోజున ఉపవాసం ఉంటారు. అదే సమయంలో చైత్ర మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి రోజున కామద ఏకాదశి ఉపవాసం పాటిస్తారు. ఈ రోజున లోక రక్షకుడైన విష్ణువును నిర్మలమైన హృదయంతో పూజించడం వలన ఒక వ్యక్తి అన్ని రకాల బాధల నుంచి ఉపశమనం పొందుతాడని నమ్మకం. అంతేకాదు ఈ ఉపవాసం ప్రభావంతో తెలిసి తెలియక చేసిన పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. ఈ రోజున విష్ణువు , లక్ష్మీ దేవిని పూజించడం మాత్రమే కాదు.. వ్యక్తులు తమ రాశి ప్రకారం దానం చేయడం కూడా శుభప్రదం.. ఎప్పటి నుంచో ఆగిపోయి ఇబ్బంది పెడుతున్న పనులు పూర్తి అయ్యే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.

కామద ఏకాదశి 2025 ఎప్పుడు?

హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్ర మాసం కృష్ణ పక్ష ఏకాదశి తిధి ఏప్రిల్ 7న రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిధి మరుసటి రోజు రాత్రి 9:12 గంటలకు ముగుస్తుంది. ఉదయం తిధి ప్రకారం కామద ఏకాదశి ఉపవాసం ఏప్రిల్ 8వ తేదీ మంగళవారం రోజున పాటించబడుతుంది.

కామద ఏకాదశి రోజున వేటిని దానం చేయాలంటే

  1. మేష రాశి- కామద ఏకాదశి రోజున ఎరుపు రంగు స్వీట్లు, ఎరుపు రంగు సీజనల్ పండ్లు, కాయధాన్యాలు దానం చేయండి.
  2. వృషభ రాశి- బియ్యం, గోధుమలు, చక్కెర, పాలు మొదలైన వాటిని దానం చేయండి.
  3. ఇవి కూడా చదవండి
  4. మిథున రాశి- ఆవుకు ఆహారం అందించండి. ఆపన్నులకు ఆహారాన్ని అందించండి. అలాగే అవసరమైన వారికి ఆకుపచ్చ కూరగాయలను దానం చేయండి.
  5. కర్కాటక రాశి- వెన్న, చక్కెర మిఠాయి, లస్సీ, మజ్జిగ మొదలైన వాటిని దానం చేయండి.
  6. సింహ రాశి- కామద ఏకాదశి రోజున విష్ణువును పూజించిన తర్వాత, దారిన వెళ్ళేవారికి ఎర్రటి పండ్లు , షర్బత్ పంచండి.
  7. కన్య రాశి- వివాహిత మహిళలకు ఆకుపచ్చ రంగు గాజులను అందించండి.
  8. తుల రాశి- విష్ణువును పూజించిన తరువాత అవసరమైన వారికి తెల్లని బట్టలు దానం చేయండి.
  9. వృశ్చిక రాశి- కంది పప్పు, ఎర్ర మిరపకాయలు, ఎరుపు రంగు పండ్లు మొదలైనవి దానం చేయండి.
  10. ధనుస్సు- దారిన వెళ్ళేవారికి కుంకుమపువ్వు కలిపిన పాలు పంచండి. అంతేకాదు పసుపు రంగు పండ్లు, ఇతర తినుబండారాలను కూడా దానం చేయవచ్చు.
  11. మకర రాశి- విష్ణువును పూజించండి. పేదలకు ధనాన్ని దానం చేయండి.
  12. కుంభ రాశి – కామద ఏకాదశి నాడు తోలు బూట్లు, చెప్పులు, గొడుగు, నల్లని బట్టలు దానం చేయండి.
  13. మీన రాశి: అరటిపండు, శనగపప్పు, శనగ పిండి, పసుపు రంగు బట్టలు దానం చేయండి.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు