Money Astrology: గురు, శుక్రుల కటాక్షం.. వారికి భాగ్యలక్ష్మీ యోగం, కుబేర యోగం..!

జ్యోతిషశాస్త్రంలో గురు, శుక్ర గ్రహాలకు విశేషమైన ప్రాధాన్యం ఉంది. ఒకరు దేవతల గురువుగా, మరొకరు రాక్షస గురువుగా పరిగణించబడతారు. ఈ రెండు గ్రహాలను శుభ గ్రహాలుగా భావిస్తారు. జూన్ 9 నుంచి జూలై 4 వరకు ఈ రెండు శుభగ్రహాలు కర్కాటక రాశిలో కలిసి సంచారం చేయనున్నాయి. కర్కాటక రాశిలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువుతో శుక్రుడి కలయిక వల్ల భాగ్య లక్ష్మీ యోగం, కుబేర యోగం ఏర్పడుతున్నాయని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. దీని ప్రభావంతో సుమారు 25 రోజుల పాటు మేషం, మిథునం, కర్కాటకం, కన్య, తుల, మకర రాశుల వారికి మంచి అవకాశాలు, అభివృద్ధి, సౌభాగ్యం కలుగుతుందని విశ్వాసం ఉంది.

Money Astrology: గురు, శుక్రుల కటాక్షం.. వారికి భాగ్యలక్ష్మీ యోగం, కుబేర యోగం..!
Money Astrology 2026

Edited By:

Updated on: Jun 04, 2026 | 4:36 PM

గురు, శుక్రుల్లో ఒకరు దేవతల గురువు కాగా, మరొకరు రాక్షస గురువు. ఈ రెండు గ్రహాలను జ్యోతిషశాస్త్రం శుభ గ్రహాలుగా పరిగణిస్తుంది. జూన్ 9 నుంచి జూలై 4 వరకు ఈ రెండు శుభగ్రహాలు కర్కాటక రాశిలో కలిసి సంచారం చేయడం జరుగుతోంది. కర్కాటక రాశిలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువుతో శుక్రుడి కలయిక వల్ల భాగ్య లక్ష్మీ యోగం, కుబేర యోగం ఏర్పడుతున్నాయి. ఫలితంగా సుమారు 25 రోజుల పాటు మేషం, మిథునం, కర్కాటకం, కన్య, తుల, మకర రాశుల వారి జీవితాలు నిత్య కల్యాణం పచ్చ తోరణంలా సాగిపోవడం జరుగుతుంది.

  1. మేషం: ఈ రాశికి చతుర్థ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువుతో శుక్రుడు కలవడం వల్ల ఈ రాశివారికి విశేషమైన ధన యోగాలు కలిగే అవకాశం ఉంది. ఊహించని స్థాయిలో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలోనే కాక, వృత్తి, వ్యాపారాల్లో కూడా ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. సుమారు 25 రోజుల పాటు జీవితం నిత్య కల్యాణం పచ్చ తోరణంలా సాగిపోతుంది. మంచి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి అంచనాలకు మించి లాభిస్తాయి.
  2. మిథునం: ఈ రాశికి ధన స్థానంలో శుక్ర, గురువులు యుతి చెందడం, ఇందులో గురువు ఉచ్ఛ స్థితిలో ఉండడం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. షేర్లు, ఆర్థిక లావాదేవీలు దాదాపు కనక వర్షం కురిపిస్తాయి. ఉన్నత వర్గాలతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాలు సక్సెస్ అవుతాయి. ప్రభుత్వ మూలక ధన లాభానికి అవకాశం ఉంది. అనుకోకుండా ఆస్తి కలిసి వస్తుంది.
  3. కర్కాటకం: ఈ రాశిలో గురువు ఉచ్ఛ స్థితిలో ఉండడం, పైగా శుక్రుడితో కలిసి ఉండడం వల్ల ఈ రాశివారు ఏ రంగంలో ఉన్న కలలో కూడా ఊహించని పురోగతి కలిగే అవకాశం ఉంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి కావడం జరుగుతుంది. రావలసిన సొమ్ము కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతాయి. ఆదా యం దినదినాభివృద్ధి చెందుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి.
  4. కన్య: ఈ రాశికి లాభ స్థానంలో ఉచ్ఛ గురువుతో శుక్రుడు కలవడం ఆదాయ వృద్ధికి బాగా తోడ్పడుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. అనుకూలమైన కాలం. విలాసవంతమైన జీవితం అలవడుతుంది. జీవితం నల్లేరు కాయల మీద బండిలా సాగిపోతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. సంపన్న వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం అంచనాలను మించుతుంది.
  5. తుల: ఈ రాశికి దశమ స్థానంలో యోగదాయకంగా ఉన్న గురువుతో శుక్రుడు కలవడం మహా భాగ్య యోగానికి దోహదం చేస్తుంది. ఈ శుభ గ్రహాల కలయిక వల్ల అపర కుబేరులయ్యే అవకాశం ఉంటుంది. పట్టిందల్లా బంగారం కావడంతో పాటు ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు ఇబ్బడిముబ్బడిగా లాభాల వర్షం కురిపిస్తాయి. వృత్తి, వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగంలో అదృష్టం పండుతుంది. లాటరీ వచ్చే అవకాశం ఉంది.
  6. మకరం: ఈ రాశికి సప్తమ స్థానంలో శుక్ర గురువులు కలవడం వల్ల విశేష ధనలాభం కలుగుతుంది. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. వారసత్వ సంపద లభిస్తుంది. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి కుదరడం జరుగుతుంది. జీవిత భాగస్వామి తరఫు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. గృహ, వాహన ప్రయత్నాలు ఫలిస్తాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో ధనవృద్ధికి అవకాశం ఉంది.
Follow Us