Job Astrology 2025: శనీశ్వరుడి కటాక్షం.. ఆ రాశుల వారికి ఉద్యోగావకాశాలు

| Edited By: Janardhan Veluru

Jan 08, 2025 | 7:49 PM

శనీశ్వరుడు ఉద్యోగ కారకుడు. ఈ ఏడాది శనీశ్వరుడు మీన రాశిలోకి మారడం, ఉద్యోగ స్థానాధిపతి అనుకూలంగా ఉండడం వంటి కారణాల వల్ల కొన్ని రాశుల వారికి ఈ ఏడాది ఆశించిన ఉద్యోగావకాశాలు లభించే అవకాశం ఉంది. వీరిలో కొన్ని రాశులకు ఈ ఏడాది ప్రథమార్థంలోనూ, మరికొన్ని రాశులకు ద్వితీయార్థంలోనూ తప్పకుండా ఉద్యోగాలు లభిస్తాయి.

Job Astrology 2025: శనీశ్వరుడి కటాక్షం.. ఆ రాశుల వారికి ఉద్యోగావకాశాలు
Job Astrology 2025
Follow us on

ఉద్యోగ కారకుడైన శనీశ్వరుడు మీన రాశిలోకి మారడం, ఉద్యోగ స్థానాధిపతి అనుకూలంగా ఉండడం వంటి కారణాల వల్ల కొన్ని రాశుల వారికి ఈ ఏడాది ఆశించిన ఉద్యోగావకాశాలు లభించే అవకాశం ఉంది. కొన్ని రాశులకు ఈ ఏడాది ప్రథమార్థంలోనూ, మరికొన్ని రాశులకు ద్వితీయార్థంలోనూ తప్పకుండా ఉద్యోగాలు లభిస్తాయి. ఉద్యోగాలు సంపాదించే రాశుల్లో మేషం, వృషభం, మిథునం, సింహం, తుల, మకర రాశులున్నాయి.

  1. మేషం: ఈ రాశివారికి కొద్ది ప్రయత్నంతో విదేశాల్లో ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఫిబ్రవరి నుంచి వీరికి ఉద్యోగ ప్రయత్నాలకు బాగా అనుకూలంగా ఉంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో ఘన విజయాలు సాధించడం జరుగుతుంది. సాధారణంగా ఏప్రిల్-మే నెలల్లో వీరికి ఉద్యోగపరంగా స్థాన చలనం కలగడానికి అవకాశాలున్నాయి. ఉద్యోగం మారాలనుకుంటున్నవారికి కూడా ఫిబ్ర వరి తర్వాత నుంచి సమయం బాగా అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది.
  2. వృషభం: ఈ రాశివారికి ఏప్రిల్ మొదటి వారం నుంచి ఇబ్బడిముబ్బడిగా ఉద్యోగ ఆఫర్లు అందే అవకాశం ఉంది. ఉద్యోగం కోసం ప్రస్తుతం చేస్తున్న ప్రయత్నాలను ముమ్మరం చేయడం మంచిది. సాధా రణంగా సొంత ఊర్లో ఆశించిన సంస్థలో కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతి కలిగే సూచనలున్నాయి. ఉద్యోగం మారడానికి, బదిలీ అవడా నికి కూడా బాగా అవకాశం ఉంది. ఏప్రిల్ తర్వాత ఉద్యోగపరంగా స్థిరపడడం జరుగుతుంది.
  3. మిథునం: ఈ రాశివారికి ఫిబ్రవరి నెల తర్వాత ఏప్రిల్ లోపు తప్పకుండా విదేశాల నుంచి ఆఫర్లు వచ్చే సూచనలున్నాయి. ఈ రాశివారు ఎక్కువగా దూర ప్రాంతాల్లోనూ, విదేశాల్లోనూ ఉద్యోగాల కోసం ప్రయత్నించడం మంచిది. ఉద్యోగులు కూడా విదేశీ ప్రయత్నాలు చేయడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది. మే నెల తర్వాత ఈ రాశివారికి ఉద్యోగపరంగా శుభ పరిణామాలు చోటు చేసుకోవడం, శుభవార్తలు వినడం జరుగుతుంది. ఉద్యోగంలో బదిలీ అయ్యే అవకాశం కూడా ఉంది.
  4. సింహం: ఈ రాశివారికి జూన్ తర్వాత సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో చిన్నపాటి ఉద్యోగం లభించడానికి అవకాశం ఉన్నప్పటికీ, జూన్ నెలలో ఆ ఉద్యోగం నుంచి మారడం జరుగు తుంది. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగంలో శీఘ్ర పురోగతి ఉంటుంది. జీతభత్యాలు సంతృ ప్తినిస్తాయి. ఉద్యోగరీత్యా ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. ఫిబ్రవరిలో ప్రయత్నాలు తలపెట్టడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది.
  5. తుల: ఈ రాశికి ఈ ఏడాది ద్వితీయార్థంలో విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విదేశాల్లోనే స్థిరపడే అవకాశం కూడా ఉంది. ఫిబ్రవరి చివర్లో ప్రయత్నాలు చేపట్టడం వల్ల ఆశించిన ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగంలో శీఘ్ర పురోగతికి అవకాశం ఉంది. ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్నవారు తప్ప కుండా ఉన్నత పదవులు పొందుతారు. ఉద్యోగ జీవితంలో కీలకమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి కూడా సమయం అనుకూలంగా ఉంది.
  6. మకరం: ఈ రాశికి చెందిన నిరుద్యోగులకు ఏప్రిల్ నుంచి ఉద్యోగానికి సంబంధించి అనేక ఆఫర్లు అందడం ప్రారంభమవుతుంది. గతంలో చేసిన ప్రయత్నాలకు కూడా ఇప్పుడు సానుకూల స్పందనలు లభించే అవకాశం ఉంది. సాధారణంగా దూర ప్రాంతంలో గానీ, విదేశాల్లో గానీ ఉద్యోగాలు లభించే సూచనలున్నాయి. ఉద్యోగులు పదోన్నతులు పొందుతారు. ఫిబ్రవరి తర్వాత మరింత మంచి ఉద్యో గంలోకి మారడానికి కూడా అవకాశం ఉంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు చేపట్టడం జరుగుతుంది.