Astro Remedies For Moon: జ్యోతిషశాస్త్రంలో చంద్రుని ప్రాముఖ్యత ఏమిటి? జాతకాన్ని ఎలా ప్రభావితం చేస్తాడంటే..

|

Nov 20, 2022 | 3:12 PM

వేద జ్యోతిషశాస్త్రంలో ఒక వ్యక్తి చంద్ర స్థితిని ఆధారంగా జాతకాన్ని గణిస్తారు. వేద జ్యోతిషశాస్త్రంలో చంద్రుడిని శుభ గ్రహంగా పరిగణిస్తారు. జ్యోతిష్య శాస్త్రంలో.. సూర్యుడు తండ్రి , చంద్రుడు స్త్రీ గ్రహంగా పరిగణిస్తారు.

Astro Remedies For Moon: జ్యోతిషశాస్త్రంలో చంద్రుని ప్రాముఖ్యత ఏమిటి? జాతకాన్ని ఎలా ప్రభావితం చేస్తాడంటే..
Astro Remedies For Moon
Follow us on

వేద జ్యోతిషశాస్త్రంలో చంద్రుడికి ప్రత్యేక ప్రాముఖ్యత, విశిష్ట స్థానం ఉంది. జ్యోతిష్యశాస్త్రంలో ఒక వ్యక్తి చంద్ర రాశిని తెలుసుకోవడానికి జాతకంలో చంద్రుని స్థానాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. ఒక వ్యక్తి పుట్టిన సమయంలో చంద్రుడు ఉన్న రాశి.. చంద్రుని చిహ్నంగా పిలువబడుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుని ప్రాముఖ్యత ఏమిటి, జ్యోతిష్య గణనలు ఎలా జరుగుతాయో వివరంగా తెలుసుకుందాం..

అన్ని గ్రహాల కంటే చంద్రుని వేగం ఎక్కువ
మొత్తం 9 గ్రహాలలో చంద్రుడు అత్యంత వేగాన్ని కలిగి ఉంటాడు. చంద్రుడు రాశిచక్రంలో అతి తక్కువ కాలం మాత్రమే సంచరిస్తాడు. చంద్రుడు దాదాపు రెండున్నర రోజుల్లో ఒక రాశి నుండి మరో రాశికి తన ప్రయాణాన్ని పూర్తి చేస్తాడు. వేద జ్యోతిషశాస్త్రంలో ఒక వ్యక్తి చంద్ర స్థితిని ఆధారంగా జాతకాన్ని గణిస్తారు. వేద జ్యోతిషశాస్త్రంలో చంద్రుడిని శుభ గ్రహంగా పరిగణిస్తారు. జ్యోతిష్య శాస్త్రంలో.. సూర్యుడు తండ్రి , చంద్రుడు స్త్రీ గ్రహంగా పరిగణిస్తారు. చంద్రుడు రోహిణి, హస్త , శ్రవణ నక్షత్రాలతో పాటు కర్కాటక రాశికి అధిపతి.

చంద్రుడు వివాహంలో ఎటువంటి ఫలాన్ని ఇస్తాడంటే?
ఒక వ్యక్తి లగ్నంలో చంద్రుడు ఉంటే.. ఆ వ్యక్తి చూడటానికి చాలా అందంగా, ఊహాజనిత, భావోద్వేగ, సున్నితమైన మనస్కుడు  ధైర్యంగా ఉంటాడు. జాతకంలో చంద్రుడు బలమైన స్థితిలో ఉన్నప్పుడు..  వ్యక్తి మానసికంగా బలంగా, సంతోషంగా ఉంటాడు. అలాంటి వ్యక్తి తన తల్లికి దగ్గరగా ఉంటాడు. మరోవైపు, జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉంటే, మానసికంగా బలహీనంగా, మతిమరుపుగా ఉంటారు. వ్యక్తి  జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉన్నప్పుడు కష్ట సమయాల్లో ఆత్మహత్యకు ప్రయత్నిస్తాడు. ఒక వ్యక్తి జాతకంలో చంద్రుడు నీచ స్థితిలో ఉంతె ఆ వ్యక్తి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

చేపట్టాల్సిన చర్యలు ఏమిటంటే..
చంద్రుడు శ్వేత వర్ణం కలవాడు. ముత్యాలను ధరిస్తాడు. చంద్ర బలం కోసం సోమవారం ఉపవాసం ఉండాలి. చిటికెన వేలుకు వెండి ఉంగరంలో ముత్యం ధరించడం మంచిది. అంతే కాకుండా చంద్రునికి సంబంధించిన మంత్రాలను జపించాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..  చంద్ర మహాదశ 10 సంవత్సరాలు.   శివుడు చంద్రునికి అధిపతి. చంద్రుడు అత్రి మహర్షి, అనుసూయల సంతానం. చంద్రుడు పదహారు కళలతో రూపొందించబడ్డాడు. అతను వాయువ్య దిశకి అధిపతి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)