Today Rasi Phalalu: దైనందన జీవితంలో కొన్ని సందర్భాల్లో మనం ముందువెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో జీవితం ప్రమాదంలో పడుతుంది. కావున తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ, చేపట్టే ప్రతీ కార్యంలోనూ ఆచితూచి, సమయానుకూలంగా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే తమ భవిష్యత్తు గురించి తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. తమ జీవితంలో ఏం జరుగబోతుందో ముందుగానే తెలుసుకునేందుకు రాశి ఫలాలను అనుసరిస్తారు. అయితే.. ఆదివారం ముఖ్యంగా కొన్ని రాశుల వారికి పరిస్థితులు అనుకూలంగా ఉంటే.. మరికొన్ని రాశుల వారికి అనుకూలంగా లేవు. ఆదివారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం..
మేషరాశి: ఈ రాశివారు ఈ రోజు ప్రారంభించిన పనులు సక్రమంగా జరుగుతాయి. చేపట్టిన పనులు ఓ కొలిక్కి వచ్చి.. విజయాన్ని అందుకుంటారు. వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి.
వృషభ రాశి: ఈ రాశి వారు చేపట్టే పనుల్లో సమయానుకూలంగా ముందుకు సాగాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ధన లాభం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి.
మిథున రాశి: ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. కీలక వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. పెద్దల సూచనలు, సలహాలు తీసుకోవాలి. కలహాలకు దూరంగా ఉండాలి.
కర్కాటక రాశి: ఈ రాశివారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఈ రోజు ఉత్సాహంగా పాల్గొంటారు. బంధు, మిత్రులను కలుస్తారు. ఓ విషయం మిమ్మల్ని ఆనందాన్ని కలిగిస్తుంది.
సింహరాశి: ఈ రాశి వారి పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాల్లో పెద్దల సలహాలు తీసుకోవాలి. ఎప్పటి నుంచో అనుకుంటున్న ఒక ముఖ్యమైన పనిని ఈ రోజు విజయవంతంగా పూర్తి చేస్తారు.
కన్య రాశి: ఈ రాశివారు చేపట్టిన పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తవుతాయి. కుటుంబసభ్యులు, సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు.
తుల రాశి: ఈ రాశివారికి పనుల్లో ఆటంకాలు, ఇబ్బందులు ఎదురవుతాయి. కష్టాలున్నప్పటికీ.. కీలక విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ సభ్యుల సలహాలు, సూచనలు తీసుకోవాలి.
వృశ్చిక రాశి: ఈ రాశి వారు లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలి. కాలాన్ని వృథా చేయొద్దు. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరిస్తూ ముందడుగు వేయాలి.
ధనుస్సు రాశి: ఈ రాశివారికి ఈ రోజు మంచి ఫలితాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. గొడవలకు దూరంగా ఉండాలి.
మకర రాశి: ఈ రాశి వారు చేపట్టిన పనుల్లో శ్రమ అధికమవుతుంది. కొన్ని సందర్భాల్లో సర్దుకుపోవడం వల్ల మంచి జరిగుతుంది. పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది.
కుంభ రాశి: ఈ రాశివారు.. చేపట్టిన పనులు పూర్తవుతాయి. ప్రశాంతమైన ఆలోచనలతో ముందుకు సాగాలి. విభేదాలకు దూరంగా ఉండటం మంచిది.
మీన రాశి: ఈ రాశివారు చేపట్టే పనులు పూర్తవుతాయి. ఆచితూచి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి.
Also Read: