AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సెప్టెంబర్ 19 రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగ, ఆర్థిక విషయాల్లో ఊరట..

Horoscope Today (September 19, 2026): శనివారం 12 రాశుల వారికి గ్రహాల ప్రభావం ఎలా ఉండబోతోంది? మేష రాశి వారికి ఉద్యోగ జీవితంలో స్థిరత్వం, వృషభ రాశి వారికి ఉద్యోగం, ఆదాయంలో మెరుగుదల కనిపించే సూచనలు ఉన్నాయి. మిథున రాశి వారికి కుటుంబ సభ్యుల సహకారంతో ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. మేషం నుంచి మీనం వరకు అన్ని రాశుల వారికి ఆరోగ్యం, ఉద్యోగం, ఆర్థిక పరిస్థితి, కుటుంబం, వ్యాపారం వంటి అంశాల్లో శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

సెప్టెంబర్ 19 రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగ, ఆర్థిక విషయాల్లో ఊరట..
Rashi Phalalu 19 September 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 19, 2026 | 6:00 AM

Share

దిన ఫలాలు (సెప్టెంబర్ 19, 2026): మేష రాశి వారికి ఉద్యోగ జీవితంలో స్థిరత్వం లభిస్తుంది. తలపెట్టిన పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. వృషభ రాశికి చెందిన నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆదాయం కొద్దిగా పెరిగి ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. మిథున రాశి వారికి ఆర్థిక, వ్యక్తిగత సమస్యల పరిష్కారంలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. కుటుంబ పరిస్థి తులు బాగా అనుకూలంగా ఉంటాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ అనుకున్న పనులన్నీ పూర్తయి లబ్ధి పొందుతారు. ఉద్యోగ జీవితంలో స్థిరత్వం లభిస్తుంది. తలపెట్టిన పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ముఖ్యమైన పనులు సానుకూలపడతాయి. కుటుంబ సభ్యులతో ఆలయాల్ని సందర్శిస్తారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండకపోవచ్చు. తల్లితండ్రుల జోక్యంతో తోబుట్టువుల నుంచి రావాల్సిన డబ్బు అందు తుంది. ఒకరిద్దరు మిత్రుల వల్ల నష్టపోతారు. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

మీ పనితీరుతో అధికారులు సంతృప్తి చెందినప్పటికీ వారితో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి ఒడిదుడుకులంటాయి. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు కొద్ది శ్రమతో పూర్తవుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆదాయం కొద్దిగా పెరిగి ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. సోదరులతో సఖ్యత పెరుగుతుంది. ఆరో గ్యం కొద్దిగా పరవాలేదనిపిస్తుంది. ఉద్యోగం మారే ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఆర్థిక, వ్యక్తిగత సమస్యల పరిష్కారంలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు చాలావరకు పూర్తవుతాయి. ప్రయాణాల్లో ఇబ్బందులుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయం వృద్ధి చెందు తుంది. మిత్రుల వల్ల డబ్బు వృథా అవుతుంది. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందుతుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఇంటా బయటా అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. ఉద్యోగంలో పని భారం, పని ఒత్తిడి బాగా తగ్గిపోతాయి. ఆర్థిక వ్యవహారాలు సరైన విధంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాల్లో చిన్నా చితకా ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవారికి సరికొత్త అవకాశాలు అందివస్తాయి. మిత్రుల సహాయంతో పెండింగ్ పనులు సాను కూలపడతాయి. నిరుద్యోగులకు కలిసి వచ్చే సమయం ఇది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడు తుంది. ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా ఇబ్బందులుంటాయి. ఆశించిన స్థిరత్వం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఆశించిన సంస్థలో ఉద్యోగం లభించే సూచనలున్నాయి. ఆదాయ వృద్ధి ఉంటుంది. ఆరోగ్యానికి లోటుండదు. బంధువులతో అపార్థాలు చోటు చేసుకుంటాయి. జీవిత భాగస్వామికి వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగ బాధ్యతలు మారే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ఎవరి తోనూ ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. మోసపోయే అవకాశం ఉంది. కొద్దిగా ఒత్తిడి, శ్రమ ఉన్నప్పటికీ పెండింగ్ పనుల్ని సకాలంలో పూర్తి చేస్తారు. ప్రముఖు లతో లాభదాయక పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంది. జీవిత భాగస్వామికి ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఆదాయం, ఆరోగ్యం బాగానే ఉంటాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

రోజంతా సానుకూలంగా సాగిపోతుంది. ముఖ్యంగా ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. కొన్ని ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల మీద మరింతగా శ్రద్ధ పెడతారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. రావాల్సిన డబ్బు సకాలంలో అందుతుంది. కుటుంబ పరిస్థితి అన్ని విధాలుగానూ అనుకూలంగాఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. పెళ్లి సంబంధం విషయంలో మిత్రుల నుంచి శుభవార్త అందుతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ముఖ్యమైన పనులు, వ్యవహారాల్లో వ్యయ ప్రయాసలుండే అవకాశం ఉంది. కుటుంబ విషయాల్లో కొద్దిగా సహనంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. అను కున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో బాగా ఒత్తిడి ఉంటుంది. ఇంటా బయటా బాధ్యతల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. బంధువుల రాకపోకలుంటాయి. వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి. ఎవరికీ హామీలు ఉండవద్దు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమై మానసికంగా ఒత్తిడి తగ్గుతుంది. కుటుంబ జీవితం బాగా అనుకూలంగా ఉంటుంది. సుఖ సంతోషాలకు లోటుండదు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల ఆదరణ లభిస్తుంది. ఆరోగ్యం, ఆదాయం నిలకడగా సాగిపోతాయి. వ్యాపారాల్లో రాబడి బాగా పెరు గుతుంది. ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించి విదేశాల నుంచి ఆఫర్లు వస్తాయి. పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్త అందుతుంది. పిల్లలు చదువుల్లో విజయాలు సాధిస్తారు. షేర్లు బాగా లాభిస్తాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా, ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆర్థిక విషయాలకు రోజంతా అను కూలంగా ఉంటుంది. ముఖ్యమైన బాధ్యతల్ని సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆఫర్ అందుతుంది. బంధువుల విష యాల్లో తలదూర్చవద్దు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. మరింత మంచి ఉద్యో గంలోకి మారడానికి ఇది బాగా అనుకూలమైన సమయం. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఇంటా బయటా ఏ పని తలపెట్టినా విజయవంతంగా పూర్తవుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఒకటి రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు కూడా కొద్ది ప్రయత్నంతో చేతికి అందు తుంది. మొండి బాకీలు వసూలవుతాయి. అనారోగ్యం నుంచి కోలుకుంటారు. వృత్తి, ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయ మార్గాలు బాగా కలిసి వస్తాయి. ఒకటి రెండు రుణక సమస్యల నుంచి బయటపడతారు. బంధుమిత్రులకు ఆర్థికంగా సాయం చేస్తారు. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగుతుంది. వృత్తి జీవితం కొత్త పుంతలు తొక్కు తుంది. నిరుద్యోగులకు కార్యసిద్ధి లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి.

Follow Us