
దిన ఫలాలు (సెప్టెంబర్ 16, 2025): మేష రాశి వారికి ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశముంది. వృషభ రాశి వారు శుభవార్తలు ఎక్కువగా వినే అవకాశముంది. మిథున రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
శుభ ఫలితాలు ఎక్కువగా అనుభవానికి వస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి అవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు పనులు సానుకూలపడతాయి. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. ఉద్యోగంలో పదోన్నతి లభించవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్థాయి. పెళ్లి ప్రయత్నాలకు అనుకూలమైన కాలం. వృత్తి, వ్యాపా రాల్లో దూసుకుపోతారు. ఆశించిన శుభ వార్తలు అందుతాయి. విద్యార్థులు పురోగతి సాధిస్తారు.
శుభవార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఆర్థిక ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. నిరుద్యోగులకు ఆశించిన శుభ సమాచారం అందుతుంది. ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. ఒకటి రెండు వ్యక్తిగత, కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యంలో మెరుగుదల కనిపిస్తుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కొన్ని ముఖ్య మైన వ్యవహారాలు ఆశించిన విధంగానే నెరవేరుతాయి. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది.
వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నత స్థితికి వెళ్లే అవకాశం ఉంటుంది. చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది. ఇతరులకు ఆర్థిక సహాయం అందించగల స్థితిలో ఉంటారు. కుటుంబపరంగా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యాపారాల్లో స్థిరత్వం లభిస్తుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది.
వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబపరంగా శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు. సంతాన యోగం కలిగే అవకాశం ఉంది. కొందరు బంధువులతో మాట పట్టింపులు కలుగుతాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. మనసులోని ఒకటి రెండు ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి. విద్యార్థులకు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు.
ఉద్యోగంలో అదనపు బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆదాయానికి లోటుండకపోవచ్చు. ఆరోగ్యం మీద శ్రద్ద పెట్టడం మంచిది. కొన్ని ముఖ్య మైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. విదేశాల్లో వృత్తి, ఉద్యోగాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా సఫలమవుతాయి. ఆర్థిక విషయాల్లో ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. విద్యార్థులకు శ్రమ తప్పదు.
ముఖ్యమైన వ్యక్తిగత, కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల విషయంలో శుభ వార్తలు వినే అవకాశముంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం అవసరం. కుటుంబ విషయాల్లో తల్లితండ్రుల సహకారం లభిస్తుంది. ఆర్థికంగా ఊహించని అదృష్టం పడుతుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు.
ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. సంపాదన బాగా పెరిగే సూచనలున్నాయి. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను పూర్తి చేస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ముఖ్యులైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన ఎదుగుదల ఉంటుంది. కొద్దిగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వినడం జరుగుతుంది.
ఆర్థిక సమస్యలతో కొద్దిగా ఇబ్బంది పడక తప్పదు. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. అధికారుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. బంధుమిత్రులకు సహాయ సహకారాలు అందిస్తారు. వ్యక్తిగత, కుటుంబ సమస్యల వల్ల కొద్దిగా మనశ్శాంతి తగ్గుతుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. ముఖ్యమైన ప్రయ త్నాలు చాలావరకు నెరవేరుతాయి. విద్యార్థులు కొద్ది ప్రయత్నంతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు.
ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. రావలసిన బాకీలు, బకాయీలన్నీ వసూలవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితులుంటాయి. వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. మీ సూచనలు, సలహాల వల్ల అధికారులు లబ్ధి పొందుతారు. ఆర్థిక లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. మిత్రుల వల్ల డబ్బు నష్టపోయే సూచనలున్నాయి. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు.
వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు, చేతకు తిరుగుండదు. వ్యాపారాలు కొద్దిగా కష్టనష్టాల నుంచి బయ టపడతాయి. బంధుమిత్రులకు అండగా నిలబడతారు. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సా హం లభిస్తుంది. ఆదాయ మార్గాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్ అందుతుంది. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది.
ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. నమ్మినవారి వల్ల నష్టపోతారు. కొన్ని విషయాలలో ఆశాభంగం చెందుతారు. శ్రమ, తిప్పట ఎక్కువగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాలలో పని భారం పెరుగుతుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆర్థిక వ్యవహారాల మీద దృష్టి కేంద్రీకరించడం మంచిది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది.
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. జీవితం సాఫీగా, ప్రశాంతంగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో పని భారం బాగా తగ్గిపోతుంది. వ్యాపారాల్లో సంపాదన నిలకడగా ఉంటుంది. కొన్ని వ్యక్తిగత, కుటుంబ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. ఇతరులకు బాగా సహాయం చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి. కొందరు బంధుమిత్రులు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది.