Rashi Phalalu: వారికి వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి..12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today (November 21, 2025): మేష రాశి వారికి ఈ రోజంతా సానుకూలంగా, ఆరోగ్యకరంగా సాగిపోతుంది. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. వృషభ రాశి వారికి జీవిత భాగస్వామితో అనుకూలతలు పెరుగుతాయి. మిథున రాశి వారు ఒత్తిళ్లు, సమస్యల నుంచి చాలావరకు ఉపశమనం పొందుతారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Rashi Phalalu: వారికి వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి..12 రాశుల వారికి రాశిఫలాలు
Rashi Phalalu 21 November 2025

Edited By:

Updated on: Nov 21, 2025 | 5:31 AM

దిన ఫలాలు (నవంబర్ 21, 2025): మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఈ రోజు శుభ గ్రహాల అనుగ్రహం కలుగుతుంది. రోజంతా సానుకూలంగా, ఆరోగ్యకరంగా సాగి పోతుంది. కుటుంబంలో సుఖ శాంతులు నెలకొంటాయి. ఇష్టమైన మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. చేపట్టిన పనుల్లో విజయాలు పొందుతారు. రావలసిన డబ్బు చేతికందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగుతాయి. వ్యాపారాల్లో లాభాలు పెరుగు తాయి. ఆర్థిక పరిస్థితికి ఢోకా ఉండదు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆశించిన శుభవార్తలు వింటారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ప్రేమ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. జీవిత భాగస్వామితో అనుకూలతలు పెరుగుతాయి. అపార్థాలు, విభేదాలు విషయంలో బంధువులతో ముఖాముఖీ తేల్చుకోవడం మంచిది. వ్యాపారాల్లోనూ, ఆర్థిక విషయాల్లోనూ మిమ్మల్ని మించినవారుండరు. ఉద్యోగంలో భారీ లక్ష్యాలు, గడువుల వల్ల కొద్దిగా ఒత్తిడికి గురవుతారు. ఆర్థికంగా మరింత మెరుగైన స్థితి ఏర్పడుతుంది. వృత్తి జీవితం బాగా బిజీగా సాగిపోతుంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. కొందరు మిత్రులకు సాయం చేస్తారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఒత్తిళ్లు, సమస్యల నుంచి చాలావరకు ఉపశమనం పొందుతారు. కుటుంబ సభ్యులతోనూ, మిత్రులతోనూ సరదాగా గడుపుతారు. ఉద్యోగంలో పనిభారం ఎక్కువగానే ఉంటుంది. ఆదాయాన్ని వృద్ధి చేసుకోవడానికి కొందరు మిత్రులతో చేతులు కలుపుతారు. మీలోని నైపుణ్యాలకు పదును పెట్టడం మంచిది. ఆర్థిక లక్ష్యాల మీద మరింతగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఉద్యోగంలోనే కాక, కుటుంబపరంగా కూడా బాగా ఒత్తిడికి గురవుతారు. పని భారంతో పాటు, పెండింగ్ పనుల వల్ల కూడా ఇబ్బందులు కలుగుతాయి. కొద్దిగా ఓర్పు, సహనాలతో వ్యవహరించడం మంచిది. అదనపు ఆదాయ ప్రయత్నాల మీద దృష్టి పెట్టడం మంచిది. ఆర్థిక సంబంధ మైన కలలను సాకారం చేసుకోవడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు కలుగుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఇంటా బయటా బాధ్యతల భారం బాగా పెరుగుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలకు అవకాశం ఉండకపోవచ్చు. కుటుంబపరంగా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. ఉద్యోగంలో అధికారులు, సహోద్యోగులతో ఉన్న సమస్యలు సర్దుకుంటాయి. ఉద్యోగ జీవితం సాఫీగా, సానుకూలంగా సాగిపోతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఆదాయానికి ఇబ్బందేమీఉండదు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): కుటుంబంలో వాగ్వాదాలు ఎక్కువగా ఉంటాయి. తొందరపాటు మాటల వల్ల ఇబ్బంది పడతారు. ఆర్థిక వ్యవహరాల నిర్వహణలో మీకున్న సామర్థ్యం వల్ల ఆర్థిక లక్ష్యాలను చేరుకుంటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశాభంగాలు కలిగితే నిరుత్సాహపడవద్దు. ఉద్యోగంలో కొన్ని ఆశ్చర్యకర పరిణామాలు చోటు చేసుకుంటాయి. కొద్ది కాలంగా మీ పనితీరును గమనిస్తున్న అధికారులు మీకు పదోన్నతిని కల్పించే అవకాశం ఉంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఆర్థికంగా, ఉద్యోగపరంగా, సామాజికంగా పురోగతి చెందుతారు. ఉద్యోగంలో పదోన్నతి సాధించాలన్న మీ కోరిక నెరవేరుతుంది. మీ ప్రయత్నాల వల్ల కుటుంబ పరిస్థితులు బాగా చక్కబడతాయి. బంధుమిత్రులతో కలిసి విందు కార్యక్రమంలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాల్లో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గిపోతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ముఖ్యమైన వ్యవహారాలు, పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. ఆదాయ ప్రయత్నాలు కూడా ఆశించిన స్థాయిలో ముందుకు సాగకపోవచ్చు. కుటుంబ ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి. తల్లి తండ్రులు, బంధువులతో ఉన్న సమస్యల్ని, వివాదాల్ని చాలావరకు పరిష్కరించుకుంటారు. ఏ విషయంలోనైనా ఆచితూచి మాట్లాడడం, వ్యవహరించడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు ఉండవచ్చు. సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): మానసిక ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఎదురవుతుంది. సన్నిహితుల సహాయం తీసుకోవడం మంచిది. చిన్నచిన్న సమస్యల గురించి ఎక్కువగా ఆలోచించకపోవడం మంచిది. ఉద్యోగంలో ఏకాగ్రత తగ్గే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): సాధక బాధకాలను జీవిత భాగస్వామితో పంచుకోవడం మంచిది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం లేదు. ఉద్యోగానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఒకటి రెండు ఆకర్షణీయ ఆఫర్లు అందుతాయి. కొత్త ఆదాయ అవకాశాలు ఈ రోజు మీ ముందుకు వస్తాయి. అనుకున్న పనులు, వ్యవహారాలు అనుకున్నట్టు పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమాధిక్యత ఎక్కువగా ఉన్నా ప్రతిఫలం ఉంటుంది. ఆర్థిక పరిస్థితికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): రోజంతా ఆనందంగా, అదృష్టవంతంగా సాగిపోతుంది. కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు బాగా బిజీగా సాగి పోతాయి. ఉద్యోగపరంగా, ఆర్థికంగా మంచి అవకాశాలు లభిస్తాయి. ఆదాయ వృద్ధికి గట్టి ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. కొత్త పెట్టుబడి అవకాశాల మీద దృష్టి పెట్టడం మంచిది. కొద్ది శ్రమ, తెలివితేటలతో అనుకున్నవి సాధిస్తారు. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. మీ తెలివితేటలు, నైపుణ్యాలు ఉద్యోగంలో పురోగతికి బాగా ఉపయోగపడతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతంగా పూర్తి అవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఎంతో ఆత్మ విశ్వాసంతో వ్యవహరిస్తారు. ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీల్లో లక్ష్యాలను సాధిస్తారు. మీరు దూరదృష్టితో పెట్టిన పెట్టుబడులు బాగా కలిసి వస్తాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది.

Follow Us