
దిన ఫలాలు (నవంబర్ 18, 2025): మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ సమర్థత, ప్రతిభ వెలుగులోకి వస్తాయి. వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలను పూర్తి చేయడంలో మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. ఆదాయం బాగా పెరిగి రుణాల నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది. పిల్లల చదువుల మీద శ్రద్ధ పెడతారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. కుటుంబంతో ఆలయాలను సందర్శిస్తారు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఉద్యోగంలో అధికారుల నుంచి శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. అందుకు తగ్గట్టుగా లాభాలు పెరుగుతాయి. రావలసిన బాకీలు, బకాయిలు వసూలవుతాయి. నిరుద్యోగులు తమకు లభించిన ఉద్యోగావకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం శ్రేయస్కరం. ప్రయాణాల వల్ల ఆశించిన లాభాలు కలుగుతాయి. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల పరిస్థితులుంటాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆదాయంలో అంచనాలకు మించిన పెరుగుదల ఉంటుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక సమస్యల్ని చాలావరకు తగ్గించుకుంటారు. దూర ప్రయాణాలు విజయవంతం అవుతాయి. పిల్లలకు సంబంధించి ఆశించిన శుభవార్తలు వింటారు. సోదరులతో స్థిరాస్తి వివాదం పరిష్కారం అవుతుంది. కుటుంబ వ్యవహారాలు ఇబ్బంది పెడతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి.. వ్యాపారాలు సామాన్యంగా నడుస్తాయి. ఇంటా బయటా పనిభారం కాస్తంత ఎక్కువగా ఉంటుంది. ఒకటి రెండు ఆందోళనకర వార్తలు వినడం జరుగుతుంది. ఎక్కడా తొందరపాటుతో వ్యవహరించవద్దు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా, ఆశాజనకంగా ఉంటుంది. అనుకున్న సమయానికి ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. కుటుంబ పెద్దల నుంచి కొద్దిగా సంపద కలిసి వస్తుంది. ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): వృత్తి, ఉద్యోగాల్లో అధికారులను, సహోద్యోగుల్ని మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ఇష్టమైన బంధుమిత్రులను కలుసుకుంటారు. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొని ఎంజాయ్ చేస్తారు. సామాజికంగా పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఆర్థిక ప్రయత్నాలు సఫల మవుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ జీవితం సంతోషంగా సాగిపోతుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఉద్యోగంలో అధికారులు ఎక్కువగా ఆధారపడతారు. వృత్తి, వ్యాపారాలు బిజీ అయిపోతాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. అనారోగ్య సమస్యల నుంచి చాలావరకు ఉపశమనం లభి స్తుంది. ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. బంధుమిత్రుల రాకపోకలుంటాయి. ఇష్టమైన బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు కోరుకున్న ఆఫర్లు అందుతాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాల్ని సంతృప్తికరంగా పూర్తి చేయడం జరుగుతుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఉద్యోగ జీవితం హ్యాపీగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి బయట పడతారు. ఒత్తిడి ఉన్నప్పటికీ ముఖ్యమైన కార్యకలాపాలన్నీ పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు చాలావరకు పరిష్కారం అవుతాయి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం మంచిది. కొందరు మిత్రుల వల్ల బాగా లాభపడతారు. ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): వృత్తి, ఉద్యోగాల్లో పని భారం బాగా పెరుగుతుంది. తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాల్లో కూడా శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. వ్యయ ప్రయాసలు, ఆలస్యాలు, ఒత్తిడి వంటివి తప్పకపోవచ్చు. ఓర్పు, సహనాలతో వ్యవహరించడం మంచిది. జీవిత భాగ స్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో సఖ్యత పెరుగుతుంది. కొందరు సన్నిహితులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆధ్యాత్మిక చింతన బాగా వృద్ది చెందుతుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ, పోత్సాహం లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. కొత్త వ్యాపారాలను ప్రారంభించే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కలిసి భారీగా షాపింగ్ చేస్తారు. అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరిగి ఒకటి రెండు ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ఒకటి రెండు ఆశించిన శుభవార్తలు వింటారు. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): వృత్తి, ఉద్యోగాల్లో శ్రమాధిక్యత ఉన్నా ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఇంటా బయటా పలుకుబడి పెరుగుతుంది. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. ముఖ్యమైన పనులు నిదానం సాగుతాయి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): వృత్తి, ఉద్యోగాల్లో ప్రోత్సాహకర పరిస్థితులుంటాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆర్థిక, ఆస్తి వ్యవహారాలను తేలికగా చక్కబెడతారు. కొన్ని సమస్యలు, ఒత్తిళ్ల నుంచి విముక్తి లభిస్తుంది. ముఖ్యంగా ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగిపోతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నిరుద్యోగులు ఉద్యోగం సంపాదించుకోవడం జరుగుతుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): వృత్తి, ఉద్యోగాలలో మంచి గుర్తింపు లభించడంతో పాటు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండదు. ఒకటి రెండు ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తవుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. అన్యోన్యత పెరుగుతుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మ వద్దు.