AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: వారికి పెళ్లి ప్రయత్నాలు సక్సెస్.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Today Horoscope in Telugu: మార్చి 27, 2026 శుక్రవారానికి సంబంధించిన రాశిఫలాల్లో మేష రాశి వారికి ఆర్థికంగా అనుకూల సమయం ఉండగా, వృషభ రాశి వారికి ఉద్యోగ గుర్తింపు లభిస్తుంది. మిథున రాశి వారికి శుభవార్తలు వినే అవకాశం ఉంది. మొత్తం 12 రాశుల వారికి ఈ రోజు ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Horoscope Today: వారికి పెళ్లి ప్రయత్నాలు సక్సెస్.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Daily Horoscope 27 March 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 27, 2026 | 5:31 AM

Share

దిన ఫలాలు (మార్చి 27, 2026): మేష రాశి వారికి ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. పెళ్లి ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. వృషభ రాశి వారికి ఉద్యోగంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఆస్తి, ఆర్థిక వ్యవహారాలన్నీ పూర్తిగా చక్కబడతాయి. కొన్ని పెండింగ్ పనుల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు చాలావరకు నెరవేరుతాయి. ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. పెళ్లి ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఉద్యోగంలో హోదా, బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలను మించిన రాబడి లభిస్తుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆదాయానికి ఇబ్బంది ఉండదు. మిత్రుల వల్ల ధన నష్టం కలుగుతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

అధికారులు మీ సహాయ సహకారాల్ని బాగా ఉపయోగించుకుంటారు. మీ సమర్థత బాగా వెలుగులోకి వస్తుంది. ఇంటా బయటా మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన శుభ వార్త అందుతుంది. పిల్లల విషయంలో శుభవార్త వింటారు. కుటుంబంతో సరదాగా గడుపుతారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తయి ఊరట కలుగుతుంది. వ్యక్తిగత సమస్యల ఒత్తిడి తగ్గుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. ముఖ్యమైన వ్యవహారాల్లో బంధుమిత్రుల సహకారం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాల్లో పని భారం ఎక్కువగా ఉంటుంది. విధి నిర్వహణలో పొరపాట్లు దొర్లే అవకాశం ఉంది. వ్యాపారాల మీద శ్రద్ధ బాగా పెరుగుతుంది. కొందరు బంధువుల వల్ల ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. ఆదాయం, ఆరోగ్యం బాగానే ఉంటాయి. వృథా ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే సూచనలున్నాయి. వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం వల్ల నష్టపోవడం జరుగుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో పని ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉంటుంది. కొద్ది శ్రమతో బాధ్యతలన్నిటినీ చక్కబెడతారు. ఒకటి రెండు ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు అనుకోకుండా పరిష్కారం అవుతాయి. ముఖ్య మైన వ్యవహారాలు, పనులు నిరాటంకంగా పూర్తవుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలకు ఆశించిన ప్రతిఫలం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక లావాదేవీల వల్ల ఇబ్బంది పడతారు. కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం బాగా మెరుగ్గా, సంతృప్తికరంగా ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

అదనపు ఆదాయ మార్గాలు ప్రోత్సాహకరంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. ఉద్యోగ బాధ్యతల్లో కొద్దిగా మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో విశ్రాంతి లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆదాయం బాగానే ఉంటుంది కానీ జాగ్రత్తగా ఖర్చు చేయడం మంచిది. ఆర్థిక లావాదేవీల్లో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆరోగ్యానికి లోటుండదు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి జీవితంలో ఉన్నవారికి తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. ఆదాయంలో ఆశించిన పెరుగుదల ఉంటుంది. ఆదాయ ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. ఒకరిద్దరు మిత్రులకు ఆర్థికంగా బాగా సహాయం చేస్తారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఒకటి రెండు వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు కొద్ది ప్రయత్నంతో పరిష్కారమవుతాయి. ఇంటా బయటా కాస్తంత ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగంలో కొన్ని అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాలు చాలావరకు లాభసాటిగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. పిల్లలు ఆశించిన పురోగతి సాధిస్తారు. మిత్రుల నుంచి ఆర్థిక సహాయానికి బాగా ఒత్తిడి ఉంటుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా, హుషారుగా సాగుతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఆదాయానికి లోటుండదు. రావలసిన డబ్బు తప్పకుండా అందుతుంది. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. దాదాపు ప్రతి ప్రయత్నమూ సఫలమవుతుంది. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా శ్రమాధిక్యత తప్పకపోవచ్చు. విశ్రాంతి బాగా తగ్గుతుంది. ఆర్థిక సమస్యలను అధిగమించే అవకాశం ఉంది. అదనపు ఆదాయ మార్గాల ఆశించిన ఫలితాలనిస్తాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి ఉంటుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. నిరుద్యోగులు శుభవార్త వింటారు. పెళ్లి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రమ తప్పదు. సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో పని భారం ఎక్కువగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు, పెట్టుబడికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. ఉచిత సహాయాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. వ్యక్తిగత సమస్యల్ని సమయస్ఫూర్తితో పరిష్కరించుకుంటారు. వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన పనులు, వ్యవహారాలు పూర్తవుతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఆదాయ వృద్ధికి సమయం అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. బంధువుల నుంచి ఆస్తి వివాదం విషయంలో శుభ వార్త వింటారు. ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికారులకు మీ మీద నమ్మకం పెరుగుతుంది. మిత్రుల తోడ్పాటుతో వ్యక్తిగత సమస్యల్ని చాలావరకు పరిష్కరించుకుంటారు. పెళ్లి ప్రయత్నాల్లో కొందరు బంధువుల సహకారం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో కీలక మార్పులు చేపట్టి ఆశించిన లాభం పొందుతారు.

Follow Us