జూన్ 6 రాశిఫలాలు: ఆర్థిక విషయాల్లో వారు జాగ్రత్త.. 12 రాశుల వారికి ఇలా..

Horoscope Today: జూన్ 6, 2026 దిన ఫలాల ప్రకారం మేష రాశి వారికి శుభవార్తలు అందే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఆదాయ వృద్ధి, ఆర్థిక ఒత్తిడుల నుంచి ఉపశమనం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. మిథున రాశి వారు ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. మేషం నుంచి మీనం వరకు మొత్తం 12 రాశుల వారికి శనివారానికి సంబంధించిన రాశిఫలాలు వివిధ రకాలుగా అనుకూల–ప్రతికూల ఫలితాలను సూచిస్తున్నాయి.

జూన్ 6 రాశిఫలాలు: ఆర్థిక విషయాల్లో వారు జాగ్రత్త.. 12 రాశుల వారికి ఇలా..
Horoscope Today 06 June 2026

Edited By:

Updated on: Jun 06, 2026 | 6:00 AM

దిన ఫలాలు (జూన్ 6, 2026): మేష రాశి వారు ఈ రోజు శుభవార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది. ఆర్థికంగా అదృష్ట యోగం పడుతుంది. వృషభ రాశి వారికి ఆదాయ వృద్ధికి బాగా అవకాశం ఉంది. ఆర్థిక ఒత్తిళ్ల నుంచి చాలావరకు బయటపడతారు. మిథున రాశి వారు ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

శుభ వార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది. ఆర్థికంగా అదృష్ట యోగం పడుతుంది. వృత్తి, ఉద్యోగంలో అనుకోకుండా కొన్ని సానుకూల మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాల్లో లాభాలు క్రమంగా వృద్ధి చెందడం ప్రారంభిస్తాయి. పిల్లలు విద్య, ఉద్యోగాల్లో తమ ప్రతిభను నిరూపించుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సొంత ఇంటి విలువ, ఆస్తి విలువ బాగా పెరుగుతాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లావాదేవీలు ఫలిస్తాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో అధికారులకు మీ మీద నమ్మకం పెరుగుతుంది. వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి. ఆదాయ వృద్ధికి బాగా అవకాశం ఉంది. ఆర్థిక ఒత్తిళ్ల నుంచి చాలావరకు బయటపడతారు. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. ఇంటా బయటా అనుకూలతలు బాగా పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. సామాజికంగా హోదా పెరుగుతుంది. కుటుంబ పరిస్థితులు చాలావరకు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలు బాగా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఆటంకాలు, అవరోధాలు ఉన్నప్పటికీ ముఖ్యమైన వ్యవహారాల్ని పూర్తి చేస్తారు. కొందరు బంధుమిత్రుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. ఇంటా బయటా పరిస్థితులు కొద్దిగా ఒత్తిడిని కలిగిస్తాయి ప్రయాణాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఆర్థిక సంబంధమై ఒడిదుడుకులు, సమస్యలు చాలావరకు తగ్గుతాయి. ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. బంధువుల నుంచి శుభ కార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో విందులో పాల్గొంటారు. వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. అనుకోకుండా మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగ, వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. కుటుంబ వ్యవహారాలను చక్కబెడతారు. పెండింగ్ పనుల్ని సంతృప్తికరంగా పూర్తి చేస్తారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాలు సీదా సాదాగా సాగిపోతాయి. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. ఆర్థిక పరి స్థితి అనుకూలంగా ఉంటుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. బంధుమిత్రులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఒకటి రెండు వ్యక్తి గత సమస్యల నుంచి అనుకోకుండా విముక్తి లభిస్తుంది. పెట్టుబడులు పెట్టడానికి ఇది సమయం కాదు. ఇతరుల వ్యక్తిగత విషయాల్లో తలదూర్చవద్దు. నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు అందుతాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఆదాయంలో కొద్దిపాటి పెరుగుదల ఉంటుంది. అనవసర ఖర్చుల్ని అదుపు చేయడం మంచిది. ఆరోగ్యం సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాలు సాదా సీదాగా పురోగమిస్తాయి. బంధు మిత్రులతో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగంలో సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభ వార్తలు వినే అవకాశముంది. ఆర్థిక లావాదేవీలు సత్ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగ, వ్యాపారాల మీద మరింతగా శ్రద్ధ పెరుగుతుంది. కొత్త పెట్టుబడులు పెడతారు. ఆదాయానికి లోటుండదు. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. కుటుంబసమేతంగా దైవ కార్యాల్లో పాల్గొంటారు. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి మంచి గుర్తింపు లభించి, రాబడి పెరుగుతుంది. కుటుంబ జీవితం చాలావరకు ఉత్సాహంగా సాగిపోతుంది. విదేశాల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

కుటుంబ జీవితం ప్రశాంతంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. కుటుంబసమేతంగా శుభకార్యాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు నిలకడగా కొనసాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు వేగంగా పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో బంధువుల నుంచి శుభవార్త అందుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో నిరుద్యోగులకు ఆశించిన స్పందన లభిస్తుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాలు బాగా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాల్లో పెట్టుబడులు పెంచే సూచనలున్నాయి. అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. ఒకరిద్దరు బంధుమిత్రులకు ఆర్థికంగా బాగా సహాయ పడతారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా అనుకూల తలు పెరుగుతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి సైతం ఆఫర్లు అందుతాయి. జీవిత భాగస్వామికి సమయం కలిసి వస్తుంది. చదువుల్లో పిల్లలు ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగంలో అధికారులు ప్రత్యేక బాధ్యతలు, ప్రత్యేక లక్ష్యాలు అప్పగిస్తారు. మానసిక ఒత్తిడి ఉన్నా విజయాలు సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. కుటుంబ సభ్యులతో ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. ముఖ్యమైన పనులు చురుకుగా పూర్తవుతాయి. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. ముఖ్య మైన ప్రయత్నాలు, వ్యవహారాలు సఫలం అవుతాయి. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను శ్రమ, తిప్పట ఉన్నా పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాల్లో కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. మీ నుంచి సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు కొద్ది ప్రయత్నంతో వసూలై, ముఖ్యమైన అవసరాలు తీరుతాయి. ప్రస్తుతానికి ఎవరికీ హామీలు ఉండవద్దు, వాగ్దానాలు చేయవద్దు. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో కొత్త కార్యక్రమాలు, ప్రాజెక్టులు చేపడతారు. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. గృహ, వాహన ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థిక విషయాల్లో కొద్దిగా ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఇష్టమైన బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబంలో సానుకూల వాతావరణం ఉంటుంది. ఆరోగ్యానికి ఏమాత్రం లోటుండదు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష్యం శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us