
దిన ఫలాలు (జనవరి 27, 2026): మేష రాశి వారికి రోజంతా సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోయే అవకాశముంది. వృషభ రాశి వారికి వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పట్టే సూచనలున్నాయి. మిథున రాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తయ్యే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
శుభ గ్రహాల అనుకూలత బాగా ఉన్నందువల్ల రోజంతా సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. వృథా ఖర్చుల్ని తగ్గించుకుంటారు. చిన్న నాటి మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో అధికారాల నుంచి ఆదరణ లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. కుటుంబ వ్యవహారాల్లో కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ఇతరుల వ్యవహారాల్లో కల్పించుకోకపోవడం చాలా మంచిది.
శుక్ర, బుధ, రవి గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. స్థాన చలనానికి అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా పురోగమిస్తాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది.
గురు, శుక్రుల బలం ఎక్కువగా ఉన్నందు వల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో కృషికి, ప్రతిభకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. అనేక విషయాల్లో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచుకుంటారు. ప్రతి ప్రయత్నమూ విజయవంతం అవుతుంది. బంధువుల నుంచి శుభ వార్త అందుతుంది. జీవిత భాగస్వామికి చిన్నపాటి అదృష్టం పడుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
రవి, శుక్ర, కుజ గ్రహాల అనుకూలత కారణంగా ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. అయితే, వీటి మీద మరింతగా శ్రద్ధ పెట్టడం మంచిది. కుటుంబంలో సుఖసంతోషాలకు లోటుండదు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాలు ఆశించిన ఫలితాలనిచ్చే అవకాశం ఉంది. ఆదాయంలో ఆశించిన స్థాయి పెరుగుదల కనిపిస్తుంది. ఆర్థిక, ఆస్తి వ్యవహారాలు చక్కబడతాయి. దైవకార్యాల్లో పాల్గొంటారు.
లాభ స్థానంలో గురు సంచారం వల్ల కొన్ని ప్రధాన ఆర్థిక సమస్యలు, వివాదాల నుంచి చాలా వరకు ఊరట లభిస్తుంది. ముఖ్యంగా ఆదాయపరంగా, ఉద్యోగపరంగా ఇబ్బందులేవీ ఉండకపో వచ్చు. ఇతరులకు వీలైనంతగా సహాయం చేయడం జరుగుతుంది. ఉద్యోగంలో అధికారులకు అవసరమైన తోడ్పాటునందిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో బాగా బిజీ అవుతారు. ఆర్థిక ప్రయత్నాలు సఫలం అవుతాయి. కుటుంబ వ్యవహారాలపై దృష్టి పెట్టడం మంచిది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.
బుధ, గురు, రాహు, శుక్రుల అనుకూలత వల్ల ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగు పడుతుంది. ఆర్థిక సమస్యలు బాగా తగ్గుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక వ్యవహారాలను జాగ్రత్తగా నిర్వహించుకోవాల్సి ఉంటుంది. మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోతారు. వృత్తి, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాల్లో పోటీదార్ల నుంచి ఒత్తిడి ఉంటుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. పిల్లల నుంచి శుభవార్త వింటారు.
గురు, బుధ, శుక్రులు అనుకూలంగా ఉండడం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. అధికారుల ఆదరణ లభిస్తుంది. వ్యాపారంలో పెట్టుబడులు పెంచుతారు. ఏ పని ప్రారంభించినా, ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయవంతం అవుతాయి. కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి. ఆదాయం పెరుగుతుందే తప్ప తగ్గే అవకాశం ఉండదు. కుటుంబ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి.
రవి, కుజ గ్రహాలు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగంలో ఆశించిన స్థిరత్వం లభిస్తుంది. ఆదాయం బాగా అనుకూలంగా ఉంటుంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాల్లో అనుకూలంగా సాగిపోతాయి. ఆర్థిక వ్యవహారాలు సత్ఫలితాలనిస్తాయి. పెద్దల సహాయంతో కుటుంబ సమస్యల్ని పరిష్కరించుకుంటారు. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది.
గురు, కుజ, రవుల సంచారం అనుకూలంగా ఉన్నందువల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరుగుతాయి. సామాజికంగా మంచి గుర్తింపు లభిస్తుంది. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
ఈ రాశిలో సంచారం చేస్తున్న నాలుగు గ్రహాల వల్ల అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటుంది. సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. సకాలంలో లక్ష్యాలను పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది. అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. జీవిత భాగస్వామికి ఆశించిన గుర్తింపు లభిస్తుంది.
ధన స్థానంలో శని గ్రహ ప్రభావం వల్ల ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. ఆశించిన ప్రతిఫలం ఉన్నప్పటికీ, వృత్తి, ఉద్యో గాల్లో పనిభారం పెరిగి ఇబ్బంది పడతారు. వ్యాపారాలు సాధారణంగా సాగిపోతాయి. కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. వ్యక్తిగత సమస్యలు కొద్దిగా ఒత్తిడికి గురి చేస్తాయి. స్వలాభానికి ఉపయోగించుకునే వారి సంఖ్య పెరుగుతుంది. కుటుంబ జీవితం బాగా అనుకూలంగా ఉంటుంది.
లాభ స్థానంలో నాలుగు గ్రహాల సంచారంతో పాటు, చతుర్థ స్థానంలో రాశ్యధిపతి గురువు స్థితి వల్ల ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. కొందరు బంధుమిత్రులకు సహాయం చేస్తారు. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. జీతభత్యాలకు సంబంధించి శుభ వార్తలు వింటారు. వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు.