
దిన ఫలాలు (జనవరి 13, 2026): మేష రాశి వారికి ఈ రోజు ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభించే అవకాశముంది. వృషభ రాశికి చెందిన నిరుద్యోగులకు ఆశించిన విధంగా కొన్ని ఉద్యోగావకాశాలు కలిసి వస్తాయి. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిపాటి మార్పులు చోటుచేసుకునే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తి జీవితం లాభసాటిగా సాగిపోతుంది. వ్యాపారాల్లో మార్పులు చేపట్టి లబ్ధి పొందుతారు. అనుకున్న సమయానికి పనులన్నీ పూర్తవుతాయి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. కుటుంబ జీవితం ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిచిపోతుంది. జీవిత భాగస్వామి తన ఉద్యోగంలో శుభవార్తలు వింటారు. పిల్లలు విజయాలు సాధిస్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి.
వృత్తి, వ్యాపారాల్లో ఒకటి రెండు ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. కొన్ని శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంది. నిరుద్యోగులకు ఆశించిన విధంగా కొన్ని ఉద్యోగావకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. బంధువుల నుంచి ఆశించిన శుభవార్త వింటారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలు సందర్శిస్తారు. రుణ సమస్యల ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఇతరుల విషయాల్లో తలదూర్చకపోవడం మంచిది. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.
వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిపాటి మార్పులు చోటు చేసుకుంటాయి. బాధ్యతలు మారే అవకాశం ఉంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు కూడా లాభిస్తాయి. వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. కానీ, వృథా ఖర్చులు ఇబ్బంది పెడతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. బంధువుల సహాయం లభిస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
ఉద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆస్తి కొనుగోలు వ్యవహారాలు సఫలం అవుతాయి. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. జీవిత భాగస్వామి నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు.
ఉద్యోగంలో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితం అందుతుంది. కొన్ని పెండింగు పనులు, వ్యవహారాలను పూర్తి చేస్తారు. ప్రయాణాలు లాభసాటిగా సాగిపోతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. పిల్లల నుంచి ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. స్నేహితుల వల్ల వృథా ఖర్చులు పెరుగుతాయి. ఆశించిన శుభవార్త వింటారు.
వృత్తి, ఉద్యోగాలు చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరుగుతాయి. ఆర్థిక, ఆస్తి వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సమస్యల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆహార, విహారాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించడం అవసరం.
వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలు పెరుగుతాయి. పని ఒత్తిడి బాగా తగ్గే అవకాశం ఉంది. ఆదాయం బాగా వృద్ది చెందుతుంది. అవనసర ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యాపారాలు నిదానంగా సాగిపోతాయి. ప్రతి పనిలోనూ వ్యయ ప్రయాసలుంటాయి. ప్రయాణాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. అవసర సమయాల్లో మిత్రులకు ఆర్థిక సహాయం అందిస్తారు.
ఉద్యోగంలో అధికారులు ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో పోటీ ఉన్నా లాభాలకు లోటుండదు. మిత్రుల సహాయంతో పనులన్నీ పూర్తవుతాయి. ఇంటా బయటా బాధ్య తలు పెరుగుతాయి. కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది. కొద్దిపాటి ప్రయత్నంతో వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. కొందరు బంధువులతో అపార్థాలు తలెత్తవచ్చు. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. మీ సలహాలు, సూచనల వల్ల అధికారులు లబ్ధి పొందుతారు. వ్యాపారాల్లో లాభాలకు లోటేమీ ఉండదు. ముఖ్యమైన పనులన్నీ సంతృప్తికరంగా పూర్తవుతాయి. కొందరు బంధుమిత్రులకు అండగా నిలబడతారు. ప్రముఖులతో లాభదాయక పరి చయాలు పెరుగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించడం అవ సరం. ఆదాయానికి లోటుండదు కానీ, కుటుంబ సభ్యుల ఖర్చులు పెరగడానికి అవకాశం ఉంది.
ఉద్యోగంలో కొద్దిపాటి పని ఒత్తిడి ఉంటుంది. అధికారులతో అనుకూలతలు పెరుగుతాయి. వృత్తి జీవితం బిజీగా సాగిపోతుంది. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. వృథా ఖర్చులతో ఇబ్బంది పడతారు. బంధుమిత్రుల నుంచి ఒకటి రెండు శుభవార్తలు అందుతాయి. విదేశాల నుంచి ఉద్యోగపరంగా ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండకపోవచ్చు. వ్యక్తిగత సమస్యలు తొలగిపోతాయి
ఉద్యోగంలో జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి. ఆస్తి వివాదం నుంచి బయటపడతారు. బంధువులకు చెందిన శుభ కార్యంలో పాల్గొంటారు. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా సాగు తాయి. ఆదాయానికి లోటుండదు. ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. పెద్దలతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆరోగ్యం మెరుగ్గాఉంటుంది.
కుటుంబ వ్యవహారాల్లో కొద్దిగా ఆచితూచి వ్యవహరించడం మంచిది. అపార్థాలు, వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని పురోగతి ఉంటుంది. వ్యాపారాల్లో ఆశించిన రీతిలో లాభాలు గడిస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఏ ప్రయత్నం చేపట్టినా కలిసి వస్తుంది. బంధువుల నుంచి సమస్యలుంటాయి. పిల్లల చదువుల మీద శ్రద్ద పెట్టడం మంచిది. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది.