Horoscope Today: వారికి కీలక వ్యవహారాల్లో విజయం పక్కా.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (జనవరి 5, 2026): మేష రాశి వారికి ఈ రోజు ఆదాయానికి లోటుండదు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమై కొద్దిగా ఊరట చెందుతారు. వృషభ రాశి వారికి ఉద్యోగంలో అనుకూలత ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Horoscope Today: వారికి కీలక వ్యవహారాల్లో విజయం పక్కా.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Rashi Phalalu 05 January 2026

Edited By:

Updated on: Jan 05, 2026 | 5:31 AM

Today Horoscope (January 5, 2026): మేష రాశి వారికి ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమై కొద్దిగా ఊరట లభించే అవకాశముంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో అనుకూలత ఏర్పడే అవకాశముంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహం లభించే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి. ముఖ్యమైన పనుల్లో కార్యసిద్ధికి అవకాశం ఉంది. ఆదాయానికి లోటుండదు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమై కొద్దిగా ఊరట చెందుతారు. వాహనం కొనుగోలు చేసే సూచనలున్నాయి. తోబుట్టువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగ జీవితం అనుకూలంగా సాగిపోతుంది. ఆర్థిక ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగంలో అనుకూలత ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా కాలక్షేపం చేస్తారు. సామాజికంగా ప్రాధాన్యం పెరుగుతుంది. ఒకటి రెండు ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ, ఆదాయానికి లోటు ఉండదు. నిరుద్యోగులకు ఒకటి రెండు మంచి ఆఫర్లు అందుతాయి. కొందరు బంధువులతో అనుకోకుండా విభేదాలు తలెత్తే సూచనలున్నాయి. ముఖ్యమైన వ్యవహారాలు నెమ్మదిగా పూర్తవుతాయి. కొద్దిపాటి అనారోగ్యానికి అవకాశం ఉంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. వృత్తి జీవితంలో కార్యకలాపాలు, లావాదేవీలు బాగా వృద్ది చెందుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశించిన స్థాయిలో పురోగమిస్తాయి. కుటుంబ జీవితం చాలావరకు ప్రశాంతంగా సాగిపోతుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. దగ్గర బంధువుల వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఎవరికీ హామీలు ఉండవద్దు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతికి అవకాశం ఉంది. ఉద్యోగపరంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఆదాయం కొద్దిగా వృద్ధి చెందుతుంది. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెంపొందుతాయి. పిల్లల విషయంలో శుభవార్త అందుతుంది. మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఒక కీలక రుణ సమస్య నుంచి బయటపడతారు. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులు చేపట్టి లబ్ధి పొందుతారు. ఉద్యోగ జీవితంలో ప్రాభవం పెరు గుతుంది. ఇంటా బయటా మీ సలహాలు, సూచనలకు విలువ ఉంటుంది. ప్రయాణాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండాలి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కాస్తంత ఉపశమనం లభిస్తుంది. ఒకటి రెండు ప్రధానమైన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం శ్రేయస్కరం. బంధుమిత్రులతో ఎంజాయ్ చేస్తారు. దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో హోదా పెరగడానికి అవకాశం ఉంది. వ్యాపారాల్లో కూడా ఆర్థికంగా పురోగతి చెందుతారు. ఆస్తి వివాదం నుంచి బయటపడతారు. ఆర్థిక ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. కొన్ని ఆలోచనలు, నిర్ణయాలు కార్యరూపం దాలుస్తాయి. సమయం అనుకూలంగా ఉంది. మధ్య మధ్య కుటుంబ పెద్దల సలహాలు, సూచనలు తీసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది. నిరుద్యోగులకు ఒకటి రెండు అవకాశాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ కార్యాల్లో పాల్గొంటారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

రోజంతా సానుకూలంగా, ఉత్సాహంగా గడిచిపోతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఉద్యోగానికి సంబంధించి నిరుద్యోగులు శుభవార్త వింటారు. ఈ రాశికి చెందిన అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం నెలకొని ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గుతాయి. ఉద్యోగరీత్యా ప్రయాణాలకు అవకాశం ఉంది. వృత్తి జీవితం కూడా సాఫీగా సాగిపోతుంది. తొందరపాటు వ్యవహారాల వల్ల కొద్దిగా ఇబ్బందిపడతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట )

వృత్తి, ఉద్యోగాల్లో ఒక మెట్టు పైకి ఎక్కడానికి అవకాశం ఉంది. అధికారుల నుంచి మంచి ప్రోత్సాహకాలు కూడా లభిస్తాయి. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు సఫలమవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కుటుంబ సమస్యలు చక్కబడతాయి. ఆర్థిక ప్రయత్నాలు సఫలమవుతాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగులు సకాలంలో బాధ్యతల్ని పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి కొద్దిగా పెరుగుతుంది. అదనపు ఆదాయ మార్గాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చాలా కాలంగా వేధిస్తున్న వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. జీవిత భాగస్వామితో కలిసి ఒక శుభ కార్యంలో పాల్గొంటారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)

ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా వృద్ది చెందుతుంది. అనుకోకుండా మొండి బాకీలు వసూలువుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. దూరపు బంధువుల నుంచి ఇబ్బందికర వార్తలు వింటారు. కొన్ని ముఖ్యమైన పనులు, వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. పిల్లల నుంచి శుభవార్త వింటారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, వ్యాపారాల్లో ఆదాయం నిలడగా సాగిపోతుంది. ఉద్యోగంలో బాధ్యతల భారం కాస్తంత ఎక్కువగా ఉంటుంది. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలను తేలికగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు అందుతాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. పెళ్లి సంబంధం కుదురుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగాలలో అధికారులతో అనుకూలతలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు సంతృప్తిక రంగా సాగిపోతాయి. బంధువులతో అపార్థాలు తొలగి ఊరట చెందుతారు. ఇష్టమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యమైన పనులన్నీ సవ్యంగా పూర్తవుతాయి. రావలసిన డబ్బు అందడంతో పాటు, బాకీల్ని వసూలు చేసుకుంటాయి. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.