Horoscope Today (04-05-2022): వృత్తి , ఉద్యోగ, వ్యాపార ఇలా ఏ రంగంలో ఉన్నవారైనా రోజులో ఏ పని మొదలు పెట్టాలన్నా మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. అంతేకాదు రోజులో తమకు ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి వెంటనే తమ దినఫలాల(Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (మే 4వ తేదీ ) బుధవారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!
మేష రాశి: ఈరోజు ఈ రాశివారు అవసరానికి తగిన సహాయం అందుతుంది. ఇష్టమైన వ్యక్తులతో సమయాన్ని గడుపుతారు. కీలక నిర్ణయాలను తీసుకునే సమయంలో జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. చేపట్టిన పనుల్లో విజయాలు చేకూరతాయి.
వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు శుభవార్త వింటారు. ఉద్యోగంలో శుభఫలితాలను అందుకుంటారు. సమస్యల నుంచి బయటపడతారు. ప్రశాంతంగా ఉండడం వలన సానుకూల ఫలితాలుంటాయి.
మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు వృధా ప్రయాణాలు అధికంగా చేస్తారు. అనవసర వ్యయం చేస్తారు. మానసిక ఆందోళన కలుగుతుంది. బంధుమిత్రులతో వివాదాలు ఏర్పడకుండా ఉండడం మంచిది. విందు, వినోదకార్యక్రమాల్లో పాల్గొంటారు.
కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు చేపట్టిన పనుల్లో విజయాన్ని సొంతం చేసుకుంటారు. స్థిరాస్థులకు సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి. నూతన వస్తు, వస్త్ర ఆభరణాలను పొందుతారు. దైవ దర్శనం చేసుకుంటారు.
సింహ రాశి: ఈరోజు ఈ రాశివారికి ఆకస్మిక ధన నష్టం కలుగుతుంది. క్రీడాకారులకు, రాజకీయ రంగంలో ఉన్నవారికి మానసిక ఆందోళన కలగలుతుంది. కొత్తపనులు వాయిదా వేసుకోవడం ఉత్తమం.
కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు ప్రారంభించిన పనుల్లో శుభఫలితాలు అందుకుంటారు. శుభవార్తలు వింటారు. ఇతరులకు ఉపకరించే పనులు చేపడతారు. శుభకార్య ప్రయత్నాలు నెరవేరుతాయి. గౌరవ మర్యాదలు లభిస్తాయి.
తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. కుటుంబ కలహాలకు దూరంగా ఉండడం మంచిది. అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది.
వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారు ఆత్మీయుల సహకారంతో ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆకస్మిక ధన నష్టం కలుగుతుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఉత్తమం.
ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లో వారు శుభఫలితాలను అందుకుంటారు. పిల్లలవల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. పట్టుదలతో చేపట్టిన పనులను పూర్తి చేస్తారు. అనారోగ్య బాధలు తొలగిపోతాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు లభిస్తాయి.
మకర రాశి: ఈరోజు ఈ రాశివారు ఆకస్మిక భయానికి లోనవుతారు. శారీరకంగా బలహీనంగా ఉంటారు. తొందరపాటు నిర్ణయాలతో ప్రారంభించిన పనులకు ఆటంకాలు ఏర్పడతాయి. వ్యవసాయరంగలోని వారికి లాభదాయకంగా ఉంటుంది.
కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు అనారోగ్య బాధలను అధిగమిస్తారు. స్థిరమైన నిర్ణయాలను తీసుకోలేరు. కొత్త పనులకు ప్రణాళికలు రచిస్తారు. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది.
మీన రాశి: ఈరోజు ఈ రాశివారు స్నేహితులను కలుస్తారు. సంతోషంగా గడుపుతారు. శుభవార్త వింటారు. నూతన వస్తు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాలోని వారు ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ఆర్థిక ఇబ్బందులు ఉండవు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)
Also Read:Gold Silver Price Today: స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధర.. తగ్గిన వెండి..!