Horoscope Today: ఈ రాశుల వారికి బంధువుల్లో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.. శుక్రవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.

| Edited By: Narender Vaitla

Feb 17, 2023 | 7:01 AM

జ్యోతిష్యం, రాశి ఫలాలను అనుసరించేవారు మనలో చాలామంది ఉంటారు. రాశి ఫలాలను అనుసరించి రోజును ప్రారంభించే వాళ్లు చాలా మంది. మరి శుక్రవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఓ సారి చూసేయండి.. 

Horoscope Today: ఈ రాశుల వారికి బంధువుల్లో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.. శుక్రవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.
Horoscope
Follow us on

జ్యోతిష్యం, రాశి ఫలాలను అనుసరించేవారు మనలో చాలామంది ఉంటారు. రాశి ఫలాలను అనుసరించి రోజును ప్రారంభించే వాళ్లు చాలా మంది. మరి శుక్రవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఓ సారి చూసేయండి..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. మొండి బాకీలు వసూలు అవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఉద్యోగ పరంగా శుభవార్త అందుతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఆర్థిక లావాదేవీలు ప్రయోజనం కలిగించవు. విద్యార్థులకు అన్ని విధాలుగాను బాగుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగంలో అధికారులు అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. ఆదాయంలో మంచి పెరుగుదల కనిపిస్తుంది. గృహ, వాహనాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. కొన్ని పెద్ద కంపెనీల నుంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. బంధు వర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. పిల్లల్లో ఒకరు చదువుల కోసం దూర ప్రాంతానికి వెళ్లే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం పర్వాలేదు.

ఇవి కూడా చదవండి

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

కుటుంబ పరంగా ఏది జరిగినా అంతా మన మంచికే అనుకోండి. అపార్ధాల కారణంగా కొందరు బంధువులు దూరమవుతారు. ఆర్థికంగా స్థిరత్వం లభించే సూచనలు ఉన్నాయి. పొదుపు సూత్రాలు పాటిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల ఆదరణ లభిస్తుంది. వృత్తి వ్యాపారాల వారు చాలావరకు నిలదొక్కుకుంటారు. విద్యార్థులకు సునాయాసంగా విజయాలు లభిస్తాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఐటీ, క్రీడలు, స్వయం ఉపాధి, రియల్ ఎస్టేట్ వంటి రంగాలవారు అద్భుతంగా రాణించే అవకాశం ఉంది. ఇతరులకు వీలైనంతగా సహాయ సహకారాలు అందిస్తారు. విద్యార్థులు ఎంతో శ్రమ మీద విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

అధికార యోగానికి అవకాశం ఉంది. ఉద్యోగ పరంగా ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ముఖ్యమైన విషయాల్లో జీవిత భాగస్వామి సలహాలు కూడా తీసుకోండి. ఆదాయపరంగా స్థిరత్వం లభిస్తుంది. ఆస్తుల విలువ కొద్దిగా పెరిగినట్టు సమాచారం అందుతుంది. విద్యార్థులకు చాలా బాగుంది. ప్రేమ వ్యవహారంలో ముందడుగు వేస్తారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. పట్టుదలగా లక్ష్యాలు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆదాయంలో
కొద్దిపాటి పెరుగుదల ఉంటుంది. విలాసాల మీద ఖర్చు చేయడం తగ్గించండి. కోర్టు కేసు ఒకటి అనుకూలంగా మారుతుంది. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. ఆరోగ్యం పర్వాలేదు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఒక కుటుంబ సమస్య నుంచి అనుకోకుండా బయటపడతారు. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారు బాగా బిజీ అయిపోతారు. మనసులోని కోరిక ఒకటి నెరవేరుతుంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. శరీరానికి విశ్రాంతి అవసరం. ఆర్థిక సమస్యలు కొద్దిగా తగ్గుతాయి. విద్యార్థులు సునాయాసంగా విజయాలు
సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)

వృత్తి వ్యాపారాల వారికి సమయం అనుకూలంగా ఉంది. ఉద్యోగాల్లో ఉన్నవారికి కొద్దిగా శ్రమ పెరుగుతుంది. అధికారులు అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. రుణదాతల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా ఇతరులకు మాత్రం సహాయం చేస్తారు. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

అవసరానికి తగ్గట్టుగా ఆర్థిక సహాయం అందుతుంది. అనారోగ్యం మీద ఖర్చులతో ఇబ్బంది పడతారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. సహచరుల నుంచి సహకారం లభిస్తుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కుటుంబ సభ్యులతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

అనుకోకుండా ఒక చిన్న స్థాయి అదృష్ట యోగం పడుతుంది. ఉద్యోగంలో ఒక మెట్టు పైకి ఎక్కడానికి అవకాశం ఉంది. ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి.
తోబుట్టువులకు వీలైనంతగా సహాయం చేస్తారు. మీ దగ్గర నుంచి సహాయం పొందిన స్నేహితులు ముఖం చాటేస్తారు. విద్యార్థులు ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఆసాజనకంగా ఉంటాయి.

కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో శ్రమ, ఒత్తిడి బాగా పెరుగుతాయి. ఆదాయంలో పెరుగుదల మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. కుటుంబంలోని పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు మందకొడిగా నడుస్తాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

అటు ఉద్యోగ పరంగా, ఇటు కుటుంబ పరంగా బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ అనవసర ఖర్చులతో ఇబ్బంది పడతారు. వ్యాపార భాగస్వాములతో ఆచితూచి వ్యవహరించండి. స్నేహితులతో అపార్ధాలు తలెత్తే అవకాశం ఉంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..