Horoscope Today: ఈరాశివారు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

|

Apr 24, 2022 | 7:49 AM

Horoscope Today(24-04-2022): చాలామంది రోజులో ఏ పని మొదలు పెట్టాలన్నా మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. అంతేకాదు వృత్తి , ఉద్యోగ, వ్యాపార ఇలా ఏ రంగంలో ఉన్నవారైనా సరే ఈరోజు తమకు ఎలా ఉందో ..

Horoscope Today: ఈరాశివారు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope Today
Follow us on

Horoscope Today(24-04-2022):  చాలామంది రోజులో ఏ పని మొదలు పెట్టాలన్నా మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. అంతేకాదు వృత్తి , ఉద్యోగ, వ్యాపార ఇలా ఏ రంగంలో ఉన్నవారైనా సరే ఈరోజు తమకు ఎలా ఉందో అంటూ వెంటనే  దినఫలాల(Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (ఏప్రిల్ 24వ తేదీ ) ఆదివారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేష రాశి: ఈరోజు ఈ రాశివారు మానసికంగా ఆందోళకు గురవుతారు. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఋణప్రయత్నాలు ఫలిస్తాయి. స్త్రీలు స్వల్ప అనారోగ్య బాధలతో ఇబ్బందులు ఎదుర్కొంటారు.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు శుభవార్త వింటారు. చేపట్టిన అన్ని పనుల్లో విజయాన్ని సొంతం చేసుకుంటారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగం రంగాల్లో వారు ఆశించిన ఫలితాలను అందుకుంటారు. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు.  ఆకస్మిక ధనలాభం ఉంటుంది.

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు మానసిక వికాసంగా ఉంటారు. కుటుంబానికి సంబంధించిన శుభవార్త వింటారు. స్వల్ప అనారోగ్య బాధలు కలుగుతాయి. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తిచేసుకోగలుగుతారు.

కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు మానసిక ఆందోళనకు గురవుతారు. వృత్తి రీత్యా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.  చేపట్టిన పనులను ఆలస్యంగా పూర్తిచేస్తారు.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు స్థిరాస్థులకు సంబంధించిన సమస్యల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్ధిక పరిస్థితి ఆందోళన కరంగా ఉంటుంది. కొత్త పనులు ప్రారంభించే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాలు అధికంగా చేస్తారు.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు కీర్తి ప్రతిష్టలను అందుకుంటారు. కుటుంబ సభ్యులతో సంతోషముగా గడుపుతారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. కొత్త వస్తు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. చేసిన అప్పులను తీరుస్తారు.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు అనారోగ్య బాధలతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. మానసిక ఆందోళకు గురవుతారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఇంట్లో మార్పులు చోటు చేసుకుంటాయి.

వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారి ఆర్థిక ఇబ్బందులు తీరతాయి. కొత్త వస్తువు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్నేహితులను కలుస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. శుభవార్త వింటారు.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశి వ్యాపారస్తులు ధన నష్టాన్ని ఎదుర్కొంటారు. వృధా ప్రయాణాలు అధికంగా చేస్తారు. స్త్రీలు తగిన విశ్రాంతి తీసుకోవాలి.  తోటివారితో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది.  కుటుంబ విషయాల్లో అనాసక్తితో ఉంటారు.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారు ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. రుణ ప్రయత్నాలు చేస్తారు. బంధు, మిత్రుల సహకారాలు ఆలస్యంగా అందుకుంటారు. కుటుంబ చిన్నిచన్న గొడవలు ఏర్పడే అవకాశం ఉంది. శుభవార్త వింటారు.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు దైవ దర్శనం చేసుకుంటారు. మానసికంగా సంతోషముగా గడుపుతారు. ఆకస్మిక ధన లాభం పొందుతారు. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు నెరవేరతాయి.

మీన రాశి: ఈరోజు ఈ రాశివారు వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాలోని వారు స్దాన చలనం పొందుతారు. కుటుంబ సహకారం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉంటాయి. రుణప్రయత్నాలు చేస్తారు.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

Also Read: CJI NV Ramana: ‘తక్షణ న్యాయం’పై కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ

Warangal: పెళ్లింట్లో విషాదం.. కన్నుల పండువగా కూతురు.. అదే పందిట్లో కుప్పకూలిన వధువు తండ్రి మృతి