Horoscope Today: వీరికి ఊహించిన దానికంటే అధిక ధన లాభం.. సోమవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే

Horoscope Today (01-08-2022): పొద్దున లేవగానే చాలామందికి రాశిఫలాలు చూడడం అలవాటు. ఈరోజు మనకు ఎలా ఉంది? మంచి ముహూర్తాలు ఎప్పుడు ఉన్నాయి? అశుభ సంకేతాలేమైనా ఉన్నాయా? అని ఆరా తీస్తారు. ఆరోజు రాశిఫలాలు

Horoscope Today: వీరికి ఊహించిన దానికంటే అధిక ధన లాభం.. సోమవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే
Horoscope
Follow us
Basha Shek

|

Updated on: Aug 01, 2022 | 7:11 AM

Horoscope Today (01-08-2022): పొద్దున లేవగానే చాలామందికి రాశిఫలాలు చూడడం అలవాటు. ఈరోజు మనకు ఎలా ఉంది? మంచి ముహూర్తాలు ఎప్పుడు ఉన్నాయి? అశుభ సంకేతాలేమైనా ఉన్నాయా? అని ఆరా తీస్తారు. ఆరోజు రాశిఫలాలు (Rasi Phalalu)ను అనుసరించి ఆరోజు ఎలా ముందుకు ఎలా సాగాలి అనే విషయాలపై దృష్టి సారిస్తారు. మరి ఆగస్టు 1న (సోమవారం) రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం రండి.

మేషం

ఆత్మవిశ్వాసం, మనోధైర్యంతో ముందుకు అడుగేస్తారు. అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. కలహసూచనలు ఉన్నాయి. కోపంలో నిర్ణయాలు తీసుకోవద్దు. దుర్గా దేవిని ఆరాధిస్తే మంచిది.

ఇవి కూడా చదవండి

వృషభం

వృత్తి ఉద్యోగ తదితర వ్యాపారాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగ వ్యవహారాల్లో మీ పనితీరును మెచ్చుకుంటారు. మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. ఇష్టదైవారాధన మానవద్దు

మిథునం

చేపట్టిన రంగాల్లో సానుకూలు పొందుతారు. ఊహించిన దానికంటే అధిక ధనలాభాం ఆర్తిస్తారు. కీలక పనులు, వ్యవహారాల్లో ముందడుగు పడుతుంది. విరోధుల మీద విజయం సాధిస్తారు. ఈశ్వరుడిని ఆరాధిస్తే మేలు జరుగుతుంది.

కర్కాటకం

కీలక వ్యవహారాల్లో ధైర్యంతో ముందడుగు వేస్తారు. పలువురి ప్రశంసలు అందుకుంటారు. ముఖ్యమైన పనుల్లో తోటివారి సహకారం ఉంటుంది. సూర్య భగవానుడిని పూజిస్తే శుభం కలుగుతుంది.

సింహం

బుద్ధిబలంతో అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. ఎన్నో రోజుల నుంచి వేధిస్తున్న సమస్యలు పరిష్కారమవుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. విష్ణు నామస్మరణ ఉత్తమ ఫలాలను ఇస్తుంది.

కన్య

ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలున్నాయి. బంధుమిత్రులు, సన్నిహితులను కలుపుకొనిపోవాలి. అప్పుడే అడ్డంకులను అధిగమిస్తారు. చిన్న చిన్న సమస్యలకు కుంగిపోకూడదు. అనవసర ఆందోళనలు తగ్గించుకోవాలి. ప్రశాంతత కోసం దుర్గ స్తోత్రం పఠించడం మేలు.

తుల

విందులు, వినోదాలు, శుభ కార్యాల్లో పాల్గొంటారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి అనుకున్న పనులు పూర్తి చేస్తారు. శత్రువులపై పైచేయి సాధిస్తారు. సుబ్రహ్మణ్యస్వామిని పూజిస్తే మంచి జరుగుతుంది.

వృశ్చికం

సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. ఆయా రంగాల్లో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. కీలక విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. శివుడిని జపిస్తే శుభం కలుగుతుంది.

ధనస్సు

ఈరాశి వారికి మిశ్రమ ఫలితాలున్నాయి. అనవసర వివాదాల జోలికి వెళ్లకూడదు. గో సేవతో మనసుకు ప్రశాంతత కలుగుతుంది. శని శ్లోకం పఠిస్తే మేలు చేకూరుతుంది.

మకరం

వీరికి అనవసర ఖర్చులు తప్పవు. కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదరువుతాయి. విశ్వాసపాత్రులెవరో, నమ్మకద్రోహులెవరో తెలుసుకోవాలి. సూర్య నమస్కారాలతో మనసుకు ప్రశాంతత చేకూరుతుంది.

కుంభం

అనుకున్న పనులు నెరవేరుతాయి. కీలక వ్యవహారాల్లో కుటుంబీకుల సహకారం లాభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో ఆటంకాలను అధిగమిస్తారు. ఇష్టదేవతలను పూజించడం మంచిది.

మీనం

వీరికి శుభఘడియలు నడుస్తున్నాయి. అనుకున్న పనుల నెరవేరుతాయి. కీలక విషయాల్లో ముందుడుగు వేస్తారు. ఇష్టదైవారాధన మాత్రం మానవద్దు.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు