Horoscope Today: విందులు విలాసాల మీద ఖర్చులు జాగ్రత్త.. 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు..

| Edited By: Shaik Madar Saheb

Aug 03, 2023 | 5:59 AM

Daily Horoscope(August 03): జ్యోతిష్య రీత్యా గ్రహాలు, నక్షత్రాలు మీకు అనుకూలంగా ఉన్నాయా? ఆరోగ్యం, ఆర్థికపరంగా ఎలా ఉండబోతుంది..? ఉద్యోగపరంగా మీ రాశికి ఎలా ఉంటుంది? ఆగస్టు 03, 2023న(గురువారం) మేషం, వృషభం, మిథునం, కర్కాటకం తదితర 12 రాశుల వారి రాశిఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి.

Horoscope Today: విందులు విలాసాల మీద ఖర్చులు జాగ్రత్త.. 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు..
Horoscope 03rd August 2023
Follow us on

Daily Horoscope(August 03): జ్యోతిష్య రీత్యా గ్రహాలు, నక్షత్రాలు మీకు అనుకూలంగా ఉన్నాయా? ఆరోగ్యం, ఆర్థికపరంగా ఎలా ఉండబోతుంది..? ఉద్యోగపరంగా మీ రాశికి ఎలా ఉంటుంది? ఆగస్టు 03, 2023న (గురువారం) మేషం, వృషభం, మిథునం, కర్కాటకం తదితర 12 రాశుల వారి రాశిఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి.

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): దాదాపు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతంగా పూర్తవుతుంది. ఆర్థిక ప్రయత్నాలు బాగా లాభిస్తాయి. ఆస్తి సంబంధమైన వ్యవహారాలలో మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి. గృహ, వాహన ప్రయత్నాలలో పురోగతి ఉంటుంది. మిత్రులతో కలిసి సేవా కార్యక్రమాలు నిర్వహించి గౌరవ మర్యాదలు పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో మార్పులు చేసి ప్రయోజనాలు పొందుతారు. ఉద్యోగులకు పదోన్నతికి అవకాశం ఉంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఆర్థిక ఇబ్బందులేవీ ఉండకపోవచ్చు కానీ, కొందరు సన్నిహితుల కారణంగా డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. కుటుంబ వాతావరణం అన్ని విధాలా సామరస్యంగా ఉంటుంది. దీర్ఘకాలిక వివాదాల నుంచి చాలావరకు బయటపడతారు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే
సూచనలున్నాయి. కుటుంబ పెద్దల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు అందే అవకాశం ఉంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): శత్రు, రోగ, రుణ సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. వృత్తి, ఉద్యోగాలలో ఉన్న రహస్య శత్రువుల నుంచి కూడా ప్రమాదం తగ్గుతుంది. ఏ రంగంలో ఉన్నప్పటికీ ఆదాయానికి లోటు ఉండదు. ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కీలక వ్యవహారాల్లో మంచి నిర్ణయాలు తీసు కుని అమలు చేస్తారు. తలపెట్టిన పనులు చాలా కష్టం మీద పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల మీద కోపతాపాలు ప్రదర్శించకపోవడం మంచిది. నిరుద్యోగులకు కలిసి వచ్చే కాలం ఇది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): అధికారుల నుంచే కాకుండా ప్రముఖుల నుంచి కూడా ఆదరణ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని చిన్నా చితకా సమస్యలున్నప్పటికీ, కార్యకలాపాలు ముందుకు వెడతాయి. ఆశించిన స్థాయిలో పురోగతి కూడా ఉంటుంది. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. తలపెట్టిన వ్యక్తిగత పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగంలో అధికారులు, సహచరులతో సామరస్యం పెరుగుతుంది. కుటుంబానికి అవసరమైన వస్తు పరికరాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. శ్రమాధిక్యత ఉన్నప్పటికీ వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు సక్రమంగా, సకాలంలో నిర్వర్తిస్తారు. వ్యాపారంలో కొత్త ఆలోచనలు ప్రవేశపెడతారు. అదనపు ఆదాయ ప్రయత్నాలకు, సంపాదన ప్రయత్నాలకు అవకాశాలు బాగానే ఉంటాయి. కానీ, అనవ సర, అవాంఛనీయ వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. కుటుంబ వ్యవహారాల మీద శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

కన్య (ఉత్తర 2,3,4. హస్త, చిత్త 1,2): వృత్తి, వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. ప్రతి పనిలోనూ శ్రమాధిక్యత కనిపిస్తుంది. కొందరు స్నేహితులతో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. గృహ, వాహన సంబంధమైన ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఉద్యోగంలో ప్రోత్సాహం, ఆదరణ ఆశించిన స్థాయిలో కొనసాగుతాయి. నిరుద్యోగు లకు ఆశించిన సమాచారం అందవచ్చు. ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. జీవిత భాగస్వామి కెరీర్ కి సంబంధించి శుభవార్త వినే అవకాశం
ఉంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ప్రయాణాల్లో, ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇతరత్రా రోజంగా చాలా వరకు సానుకూలంగా సాగిపోతుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొన్ని ముఖ్యమైన ప్రయత్నాల్లో ఆశించిన ఫలితాలు కనిపిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగానే ఉంటుంది కానీ, విందులు విలాసాల మీద బాగా ఖర్చయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం పరవాలేదు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ఒకటి రెండు దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. తోబుట్టువుల నుంచి శుభవార్తలు వింటారు. వృత్తి జీవితంలో బాగా ఒత్తిడి ఉంటుంది. అందుకు తగ్గ ప్రతిఫలం కూడా అందుతుంది. ఉద్యోగ జీవితంలో ప్రత్యేక బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తుంది. నిరుద్యోగులకు ఉత్సాహాన్నిచ్చే సమాచారం అందుతుంది. ఇంటికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. దైవ కార్యాల మీద ఖర్చు చేయడం కూడా జరుగు తుంది. తలపెట్టిన కార్యక్రమాలు, వ్యవహారాలలో కార్యసిద్ధి ఉంటుంది. కుటుంబ వాతావరణం చాలా వరకు ప్రశాంతంగా ఉంటుంది. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యో గంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ప్రస్తుతానికి ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. కొందరు మిత్రులతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన అవకాశాలు అందుతాయి. వ్యాపారాల్లో కొత్త
ఆలోచనలను ఆచర ణలో పెట్టి లాభాలు గడిస్తారు. ఇంటా బయటా యాక్టివిటీ బాగా పెరుగుతుంది. క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. తలపెట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సన్నిహితులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కూడా మంచి కాలక్షేపం చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్త అందవచ్చు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): వృత్తి, వ్యాపారాల్లో పోటీ పెరిగినప్పటికీ, అంచనాలకు తగ్గట్టుగా లాభాలు
గడిస్తారు. ఉద్యోగంలో పనిభారం ఉంటుంది. సహచరుల నుంచి సహాయ సహకారాలు ఉంటాయి. ఉద్యోగంలో బాధ్యతల మార్పులకు కూడా అవకాశం ఉంది. ప్రయాణాల వల్ల మంచి ఫలితం ఉంటుంది. జీవిత భాగస్వామితో వివాదాలు రానివ్వకపోవడం మంచిది. నిరుద్యోగులు చిన్నపాటి ఉద్యోగంతో కొద్ది కాలం సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. పిల్లలకు బాగుంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఆర్థిక పరిస్థితి యథాతథంగా కొనసాగుతుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులు, తోబుట్టువులతో కలిసి విందు కార్యక్రమంలో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాల్లో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వ్యక్తిగత సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం పొందుతారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

Note: ఇక్కడ సమకూర్చిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని గమనించగలరు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి