
దిన ఫలాలు (ఫిబ్రవరి 1, 2026): మేష రాశి వారికి రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోయే అవకాశముంది. వృషభ రాశి వారికి ఆదాయ పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. మిథన రాశి వారికి ఉద్యోగంలో కొత్త లక్ష్యాలు, బాధ్యతలు పూర్తి చేయాల్సి రావొచ్చు. మేష రాశి మొదలు మీన రాశి వరకు ఆదివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల ఆదాయం వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు, సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలలో సానుకూల స్పందన లభిస్తుంది. డాక్టర్లు, లాయర్లు తదితర రంగాలవారికి ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల వల్ల శ్రమ, ఒత్తిడి పెరిగే సూచనలున్నాయి. వ్యాపారాల మీద శ్రద్ధ పెంచడం జరుగుతుంది. ఆదాయం పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాలకు చెందినవారికి సమయం కాస్తంత అనుకూలంగా ఉంది. పిల్లలు చదువుల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఎవరికీ హామీలు ఉండవద్దు.
ఉద్యోగంలో కొత్త లక్ష్యాలు, బాధ్యతలు పూర్తి చేయాల్సి వస్తుంది. ఆదాయానికి లోటుండదు. అదనపు ఆదాయ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. రావలసిన డబ్బు డబ్బు చేతికి అందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఇష్టమైన బంధువులతో కలిసి శుభ కార్యాల్లో పాల్గొంటారు. ఒకటి రెండు ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి.
ఉద్యోగంలో అధికారులతో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగానే ఉంటుంది కానీ ఖర్చులు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది. చేపట్టిన వ్యవహారాలను పూర్తి చేయడంలో ఆలస్యం జరిగే అవకాశం ఉంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. పిల్లల నుంచి శుభవార్త వింటారు.
అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వినడం జరుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఉద్యోగంలో జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. వ్యవహార జయానికి, కార్యసిద్ధికి అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ప్రతిఫలం పొందుతారు. ఉద్యోగంలో మీ మాటకు, చేతకు బాగా విలువ పెరుగుతుంది.
వృత్తి, ఉద్యోగాలలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాల్లో పెట్టుబడులకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. సర్వత్రా మీ మాట చెల్లుబాటవుతుంది. సామాజికంగా పలుకుబడి పెరుగుతుంది. చాలా జాగ్రత్తగా ఆర్థిక, వ్యక్తిగత సమస్యల్ని పరిష్కరించుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు చక్కబడతాయి. జీవిత భాగస్వామి నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ కార్యాలు నిర్వహిస్తారు. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు.
వృత్తి, ఉద్యోగాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి. అధికారుల నుంచి ప్రత్యేక ఆదరణ లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఇంటా బయటా అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. సోదరులతో సఖ్యత పెరుగుతుంది. ఇతరుల నుంచి రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి, కొత్త ఆఫర్లు అందివస్తాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు పూర్తి స్థాయిలో ఫలిస్తాయి.
వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలను సకాలంలో పూర్తి చేస్తారు. ఆదాయం, ఆరోగ్య పరిస్థితులు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. సొంత పనులు పూర్తి చేసుకుంటారు. మీకు రావలసిన డబ్బు అందుతుంది. ఆర్థిక సర్దుబాట్లు పూర్తవుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా సాగిపోతుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. కొత్త వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. నిరుద్యోగులకు చిన్న ప్రయత్నంతో మంచి ఆఫర్లు అందివస్తాయి.
ఉద్యోగంలో ప్రోత్సాహం, ఆదరణ లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి. ముఖ్యంగా వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. ఒక ముఖ్యమైన వ్యక్తిగత సమస్య అనుకో కుండా పరిష్కారం అవుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కొద్దిపాటి ఉపశమనం లభిస్తుంది. మిత్రుల సాయంతో ముఖ్యమైన పనుల్ని పూర్తి చేస్తారు. కొన్ని కీలక వ్యవహారాలు వ్యయ ప్రయాసలతో పూర్తి అవుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ప్రయాణాలు లాభిస్తాయి.
వ్యాపారాభివృద్ధి మీద ప్రత్యేక శ్రద్ధ పెడతారు వృత్తి, ఉద్యోగాల్లో క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల సహకారంతో కొన్ని ముఖ్యమైన ఆర్థిక, ఆస్తి వ్యవహారాలు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఒకటి రెండు అవకాశాలు కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
వృత్తి, ఉద్యోగాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. వ్యక్తిగత సమస్యలు నిదానంగా సర్దు కుంటాయి. చేపట్టిన ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. చిన్ననాటి మిత్రులతో విందులో పాల్గొంటారు. సోదరులతో సఖ్యత పెరుగుతుంది. కొందరు మిత్రుల వల్ల డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ, అనుకోని ఖర్చులు మీద పడతాయి.
ఉద్యోగులకు పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ఉత్సాహంగా పనిచేసి శుభ ఫలితాలను పొందడం జరుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారికి ఆర్థిక ప్రయోజనాలు అందుతాయి. శుభ కార్యానికి ప్లాన్ చేస్తారు. బంధువుల్ని కలుసుకుంటారు. కుటుంబంలో సామరస్య వాతావరణం నెలకొంటుంది. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది.