
దిన ఫలాలు (డిసెంబర్ 25, 2025): మేష రాశి వారు ఆదాయ లక్ష్యాలను సాధించడం కోసం గట్టిగా ప్రయత్నాలు సాగించే అవకాశముంది. వృషభ రాశి వారు వృత్తి, ఉద్యోగాల్లో పని భారం బాగా పెరిగి ఇబ్బంది పడే అవకాశముంది. మిథున రాశి వారు ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నించే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
ఆదాయ లక్ష్యాలను సాధించడం కోసం గట్టిగా ప్రయత్నాలు సాగిస్తారు. ఇక ఆలయాలు, కాలయాపనలకు స్వస్తి చెప్పి, పెండింగ్ పనులను పూర్తి చేయడం ప్రారంభిస్తారు. సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. ఎటువంటి ప్రయత్నం చేపట్టినా కుటుంబ సభ్యుల నుంచి, బంధుమిత్రుల నుంచి సహకారం ఉంటుంది. ఆదాయానికి లోటుండకపోవచ్చు. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు మారతాయి. ఆశించిన ఆదరణ లభిస్తుంది. వ్యాపారాల్లో చేపట్టిన మార్పులు సత్ఫలితాలనిస్తాయి.
వృత్తి, ఉద్యోగాల్లో పని భారం బాగా పెరిగి ఇబ్బంది పడతారు. కొద్దిగా ఓర్పు, సహనాలతో వ్యవహరించే పక్షంలో తప్పకుండా ఆశించిన ప్రతిఫలం లభిస్తుంది. మీ ప్రతిభా పాటవాలకు ఆశించిన గుర్తింపు లభించడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది. అదనపు ఆదాయ మార్గాలు పెరిగి, ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది.
ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నించే అవకాశం ఉంది. సాదా సీదా ఉద్యోగంతో విసుగెత్తిపోయి సవాళ్ల కోసం ఎదురు చూస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. మీ వ్యవహార శైలితో అధికారులకు దగ్గరవుతారు. ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలనిస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్లు లాభిస్తాయి. అదనపు ఆదాయ మార్గాలు మీ ముందుకు వస్తాయి. వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. ఆరోగ్యానికి ఢోకాఉండదు.
వృత్తి, ఉద్యోగాలలో సరికొత్త నైపుణ్యాల మీద దృష్టిని కేంద్రీకరిస్తారు. ఉద్యోగంలో ఆశించిన శుభవార్తలు వింటారు. ఉద్యోగ, కుటుంబ బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యక్తిగత సమస్యల నుంచి కొద్దిగా విముక్తి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో మార్పులు, చేర్పులు చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలనిస్తాయి. బంధువుల ద్వారా ఆస్తి వివాదం సమసిపోతుంది.
రోజంతా మీ ప్రతిభా పాటవాలకు, సమర్థతకు పరీక్షా కాలంగా సాగిపోతుంది. అధికారులు మీ మీద ఎక్కువగా దృష్టి పెడతారు. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. వ్యాపారాల్లో శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ముఖ్యమైన పనుల్లో కొద్దిపాటి వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. వ్యక్తిగత సమస్యలు చాలావరకు సంతృప్తికరంగా పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందుతుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మ వద్దు.
ఉద్యోగంలో అవిశ్రాంతంగా పని చేయాల్సి వస్తుంది. శ్రమాధిక్యత ఉన్నప్పటికీ విధులు, బాధ్యతలను సకాలంలో నిర్వర్తిస్తారు. శక్తియుక్తుల్ని కూడగట్టుకుని ఆదాయ వృద్ధి ప్రయత్నాల మీద దృష్టి పెడతారు. పెళ్లి ప్రయత్నాల విషయంలో బంధువుల నుంచి శుభవార్తలందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. కొత్త కార్యక్రమాలు, ప్రాజెక్టులు చేపడ తారు. ఆర్థిక పరిస్థితి చాలావరకు నిలకడగా ఉంటుంది. ఆరోగ్యానికి భంగమేమీ ఉండదు.
ఉద్యోగంలో మీ ప్రతిభా పాటవాలకు మరింతగా పదును పెట్టాల్సి వస్తుంది. అధికారులు భారీ లక్ష్యాలను అప్పగించే అవకాశం ఉంది. మీ లక్ష్యాలు, ఆశయాల నుంచి దృష్టి మళ్లించకపోవడం మంచిది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకోవడం అవసరం. కొన్ని ముఖ్యమైన ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు తొలగిపోతాయి. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభి స్తుంది.
ఆదాయ వృద్ది ప్రయత్నాల్లో కాస్తంత ఓర్పుగా వ్యవహరించడం మంచిది. దీర్ఘకాలంలో వీటి వల్ల లాభాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కొత్త అవకాశాల కోసం ఎదురు చూడడం మంచిది. ఉద్యోగంలో సహోద్యోగులు అవరోధాలు, ఆటంకాలు సృష్టించే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల్ని సమయస్ఫూర్తితో పరిష్కరించుకుంటారు. స్నేహితుల సహకారంతో పెండింగ్ పనుల్ని పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది.
ఉద్యోగంలో పని భారం, పని ఒత్తిడి కారణంగా మానసిక ప్రశాంతత తగ్గుతుంది. కోప తాపాలను కుటుంబ సభ్యుల మీద చూపించకపోవడం మంచిది. ఇతరుల వ్యక్తిగత విషయాల్లో తలదూర్చ వద్దు. సొంత పనుల మీద శ్రద్ద పెట్టడం అవసరం. వృత్తి, వ్యాపారాలు బాగా అనుకూలంగా పురోగమిస్తాయి. తలపెట్టిన పనులన్నీ సవ్యంగా జరిగిపోతాయి. తోబుట్టువులతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం కావచ్చు. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అందుతాయి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు.
ఉద్యోగ జీవితంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. విశ్రాంతి కరువవుతుంది. ఆదాయ వృద్ది కోసం అదనంగా శ్రమపడాల్సి వస్తుంది. కొద్ది శ్రమతో ఆర్థిక, ఆస్తి వ్యవహారాలను పూర్తి చేస్తారు. ముఖ్య మైన వ్యవహారాల్లో కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. అతి కష్టం మీద పెండింగు పనులను పూర్తి చేస్తారు. లాభాలకు, రాబడికి లోటుండదు. వృత్తి, వ్యాపారాల మీద శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. నిరుద్యోగులకు కొత్త ఆపర్లు అందుతాయి. ఆదాయానికి లోటుండకపోవచ్చు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
ఒకటి రెండు వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. జీవితం మళ్లీ పట్టాలెక్కుతుంది. ఇష్టమైన బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని వివాదాలు, సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. ప్రేమ, పెళ్లి జీవితాల్లో సుఖ సంతోషాలు పెరుగుతాయి. ఆదాయం నిల కడగా ఉంటుంది. కుటుంబం మీద ఖర్చులు పెరుగుతాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.
వ్యక్తిగత జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. బంధుమిత్రుల కారణంగా పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. రావలసిన డబ్బు చేతికి అంది అవసరాలు తీరిపోతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు అను కూలిస్తాయి. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరుగుతాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు.