Horoscope Today: వీరికి వృత్తి , వ్యాపారాల్లో ఇబ్బందులు తగ్గుతాయి.. బుధవారం రాశిఫలాలు..

స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తలు అవసరం. క్రీడాకారులకు.. రాజకీయ రంగాల్లోనివారికి మానసిక ఆందోళన తప్పదు. నూతన కార్యాలు వాయిదా వేసుకోవడం మంచిది.

Horoscope Today: వీరికి వృత్తి , వ్యాపారాల్లో ఇబ్బందులు తగ్గుతాయి.. బుధవారం రాశిఫలాలు..
Horoscope Today

Updated on: Oct 12, 2022 | 7:11 AM

మేషరాశి.

ఈరోజు వీరికి వృత్తి, ఉద్యోగ రంగాల్లో స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులలో మార్పులు ఉంటాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం ఉంటుంది. దూర ప్రయాణాలు చేసే సమయంలో జాగ్రత్తలు అవసరం. అనవసరమైన భయాందోళనలు తగ్గిపోతాయి.

వృషభరాశి..

ఈరోజు వీరు చేపట్టిన పనులను పూర్తిచేస్తారు. కుటుంబంలో సుఖ, సంతోషాలు ఉంటాయి. కుటుంబంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి. ప్రయాణాలు చేస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. విధ్యార్థులు విజయాన్ని సాధిస్తారు.

మిథున రాశి..

ఈరోజు వీరికి కుటుంబంలో మానసిక ప్రశాంతత లభిస్తుంది. నూతన వస్తు, వస్త్ర, వాహన, ఆభరణ లాభాలను పొందుతారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు చేస్తారు.

ఇవి కూడా చదవండి

కర్కాటక రాశి..

ఈరోజు వీరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంలో సుఖసంతోషాలను అనుభవిస్తారు. నూతన వస్తు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ప్రయత్న కార్యాలన్నింటినలో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ధైర్యసాహసాలు ప్రదర్శిస్తారు. ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది.

సింహ రాశి..

ఈరోజు వీరు నూతన గృహనిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. రుణబాధాలు తొలగిపోతాయి. కుటుంబసౌఖ్యం ఉంటుంది. బంధుమిత్రులను కలుసుకుంటారు. దీర్ఘకాలిక సమస్యలు తగ్గిపోతాయి. ఆరోగ్యంగా ఉంటారు.

కన్యరాశి..

ఈరోజు వీరు బంధుమిత్రులను కలుసుకుంటారు. రుణ బాధలు తగ్గుతాయి. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో గౌరవమర్యాదలు లభిస్తాయి. కొత్తవారిని కలుసుకుంటారు.

తల రాశి..

వృత్తిరీత్యా ఇబ్బందులను అధిగమిస్తారు. మానసిక ఆందోళనతో కాలం గడుపుతారు. స్త్రీల చేసే వ్యవహారాల్లో సమస్యలు ఎదురవుతాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పేడే అవకాశం ఉంటుంది. రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది.

వృశ్చిక రాశి..

ఈరోజు వీరికి ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంటుంది. స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తలు అవసరం. క్రీడాకారులకు.. రాజకీయ రంగాల్లోనివారికి మానసిక ఆందోళన తప్పదు. నూతన కార్యాలు వాయిదా వేసుకోవడం మంచిది.

ధనుస్సు..

ఈరోజు వీరు గృహంలో మార్పును కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆకస్మిక ధనవ్యయం అయ్యే అవకాశం ఉంటుంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. రుణ ప్రయత్నాలు చేస్తారు. అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉంటాయి.

మకర రాశి..

ఈరోజు వీరికి ఆకస్మిక ధనవ్యయం అయ్యే అవకాశం ఉంది. రుణ ప్రయత్నాలు చేస్తారు. గృహంలో మార్పులు కోరుకుంటారు. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. అనుకూల స్థానచలనం ఉంటుంది.

కుంభరాశి..

ఈరోజు వీరికి ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. భయం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది.

మీన రాశి..

ఈరోజు వీరికి ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు. పేరు, ప్రతిష్టలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. బంధుమిత్రులను కలుస్తారు.