రోజు ప్రారంభించే ముందు ఉదయాన్నే తమ తమ రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే వారు చాలా మంది ఉంటారు. అనుకున్న పనులు అవుతాయా లేదా అనే విషయాలను చాలా మంది తెలుసుకుంటారు. భారతీయ సంప్రదాయంలో చాలా మంది జ్యోతిష్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇక నవంబర్ 19 వివిధ వర్గాల వారి రాశి ఫలాలు ఇలా ఉన్నాయి.
మేష రాశి: చేపట్టిన పనులు సులభంగా పూర్తి చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. బంధు, మిత్రులను కలుసుకుంటారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు.
వృషభ రాశి: చేసే పనులలో అలసట లేకుండా చూసుకోవాలి. ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి. మనస్సు ప్రశాంతంగా ఉంచుకునేందుకు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలి.
మిథున రాశి: చేసే పనులలో శ్రమ పెరుగుతుంది. ఆర్థిక అవసరాలు మరింతగా పెరుగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
కర్కాటక రాశి: ప్రారంభించిన పనులలో ఇబ్బందులను అధిగమిస్తారు. ఇతరుల నుంచి ప్రశంసలు పొందుతారు. భవిష్యత్తులో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.