Horoscope Today
Horoscope Today: చాలా మంది ఉదయం లేవగానే తమతమ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూసుకుంటారు. తమ తమ రోజువారీ రాశి ఫలాలను బట్టి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. రాశి ఫలాల (Rasi Phalalu)ను అనుసరించే వారు చాలా మంది ఉంటారు. ఏ పనులు చేపడితే ఎలాంటి లాభాలు ఉంటాయి. రోజులో ఎలా ముందుకు సాగాలి అనే విషయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తుంటారు. జూలై 16 (శనివారం) రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
- మేష రాశి: వృత్తి, ఉద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. అధికారుల నుంచి సహకారం అందుకుంటారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. వ్యాపారాలలో రాణిస్తారు.
- వృషభ రాశి: వ్యాపారస్తులు అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లాభాలు కలుగుతాయి. బంధుమిత్రుల సహకారం అందుకుంటారు.
- మిథున రాశి: చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఒత్తిడి నుంచి బయటపడతారు. కొంత కాలం నుంచి ఇబ్బంది పడుతున్న ఓ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
- కర్కాటక రాశి: శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు.
- సింహ రాశి: వ్యాపారాలలో మంచి లాభాలు వస్తాయి. ఒత్తిడిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం ఎంతో అవసరం. గిట్టనివారితో దూరంగా ఉండటం మంచిది.
- కన్య రాశి: చేపట్టే పనుల్లో పట్టుదల అవసరం. కుటుంబ సభ్యులతో అభిప్రాయ బేధాలు వచ్చే అవకాశాలున్నాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉండాలి.
- తుల రాశి: వృత్తి, ఉద్యోగ రంగాలలో మంచి ఫలితాలు ఉంటాయి. కొత్త పనులను ప్రారంభిస్తారు. బంధుమిత్రుల ఆదరణ ఉంటుంది. ఆర్థికంగా పుంజుకుంటారు.
- వృశ్చిక రాశి: కీలక విషయాలలో కుటుంబ సభ్యులతో చర్చించడం ఎంతో మంచిది. పెండింగ్‌లో ఉన్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. అధికారుల నుంచి ప్రశంసలు జరుగుతాయి.
- ధనుస్సు రాశి: తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురు కాకుండా ముందు చూపుతో వ్యవహరించాలి. ముఖ్యమైన విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు.
- మకర రాశి: వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మంచి ఫలితాలు ఉంటాయి. ఓ వార్త మిమ్మల్ని ఆనందాన్ని నింపుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
- కుంభ రాశి: ముఖ్యమైన వ్యవహారాలలో కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. చేపట్టే పనులలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి.
- మీన రాశి: వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల నుంచి సహకారం అందుకుంటారు. గిట్టని వారిత దూరంగా ఉండటం మంచిది.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి