ఆ రాశి వారికి ధనవ్యయం అధికం.. నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఈరోజు (ఫిబ్రవరి 23వ తేదీ ) రాశి ఫలాలు(Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!
ఈరోజు (ఫిబ్రవరి 23వ తేదీ ) రాశి ఫలాలు(Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!
మేషం..
గొప్ప భవిష్యత్తు కోసం మంచి ఆలోచనలు చేస్తారు. కుటుంబ సభ్యులకు శుభకాలం. కీలక సమయాల్లో ధైర్యంగా వ్యవహరిస్తారు. ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు. అనవసర విషయాల పట్ల ఎక్కువగా ఆలోచించవద్దు.
వృషభం..
కుటుంబంలో ఉత్సాహవంతంగా ఉంటుంది. పనులకు ఆటంకాలు కలుగకుండా చూసుకోవాలి. కోపాన్ని దరిచేరనీయకండి. ప్రయాణంలో ఇబ్బందులు కలుగుతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.
మిథునం..
అనుకున్నది సాధించేవరకు పట్టు వదలకండి. శ్రమ ఫలిస్తుంది. అవసరానికి తగిన సాయం లభిస్తుంది. విందువినోదాలు. సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాత పనులను ప్రారంభిస్తే మంచిది.
కర్కాటకం…
ప్రయత్న కార్యసిద్ధి ఉంది. అవసరానికి తగినట్టు ముందుకుసాగడం మేలు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుంది. ముఖ్యమైన పనుల్లో అవరోధాలు. ఆకస్మిక ప్రయాణాలు.
సింహం..
సంతృప్తికర ఫలితాలు ఉన్నాయి. ఇష్టమైనవారితో కాలక్షేపం చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. నిరుద్యోగులకు కొంత నిరాశ. వ్యాపారాలలో ఒత్తిడులు. ఉద్యోగాలలో చికాకులు.
కన్య…
బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబసభ్యుల సలహాలతో విజయం సాధిస్తారు. ప్రముఖుల నుంచి కీలక సందేశం. వస్తులాభాలు. కొన్ని వివాదాల పరిష్కారం. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.
తుల..
ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఆస్తి వివాదాలు. ఆరోగ్యభంగం. ఉద్యోగాలలో చిక్కులు తప్పవు. ఆధ్యాత్మిక చింతన.
వృశ్చికం..
అధికారులు మీకు అనుకూలంగా ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. కొన్ని కీలక పనులను పూర్తి అవుతాయి. చే యగలుగుతారు. ఉమామహేశ్వర స్తోత్రం పఠిస్తే శుభం కలుగుతుంది.
ధనస్సు..
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు.
మకరం:
ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. కీలక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. అనవసర ఖర్చులు జరిగే సూచనలున్నాయి. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి.
కుంభం..
ధనవ్యయం జరిగే సూచనలున్నాయి. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో ఉత్సాహం.
మీనం..
అనుకూల ఫలితాలు. ముఖ్య పనులను మొదలుపెట్టడానికి ఇది సరైన సమయం. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. మిత్రులతో విభేదాలు. వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగాలలో బాధ్యతలు.
Also Read
Gold Silver Price Today: మగువలకు షాకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు..