Horoscope Today: ఈరాశివారు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.. శుభవార్త వింటారు.. నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

|

Apr 26, 2022 | 6:29 AM

Horoscope Today (26.04.2022): రోజులో ఏ పని మొదలు పెట్టాలన్నా వృత్తి , ఉద్యోగ, వ్యాపార ఇలా ఏ రంగంలో ఉన్నవారైనా సరే తమకు ఈరోజు ఎలా ఉంటుంది అని ఆలోచిస్తారు.

Horoscope Today: ఈరాశివారు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.. శుభవార్త వింటారు.. నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
Follow us on

Horoscope Today (26.04.2022): రోజులో ఏ పని మొదలు పెట్టాలన్నా వృత్తి , ఉద్యోగ, వ్యాపార ఇలా ఏ రంగంలో ఉన్నవారైనా సరే తమకు ఈరోజు ఎలా ఉంటుంది అని ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాల(Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఉగాది పర్వదినాన (ఏప్రిల్‌26వ తేదీ ) మంగళవారం రాశి ఫలాలు(Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేషం

ఈ రాశివారికి శుభకాలం నడుస్తోంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. విలువైన సమయాన్ని మంచి పనులకు కేటాయించడం వల్ల సానుకూల ఫలితాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. ఇష్టదేవతలను పూజిస్తే శుభం కలుగుతుంది.

వృషభం

కీలక నిర్ణయాల్లో కుటుంబీకుల, సన్నిహితుల సహకారం ఉంటుంది. ఉద్యోగ వ్యవహారాల్లో ప్రముఖుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబీకులు, బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తే మంచి ఫలితాలు అందుకుంటారు.

మిథునం

శ్రమాధిక్యం పెరుగుతుంది. పట్టుదలతో ముందుకెళ్లాలి. ఉద్యోగంలో ఉన్నతాధికారులతో సఖ్యతగా వ్యవహరించాలి. కొందరు మీపై బురద చల్లేందుకు రెడీగా ఉంటారు. అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. దైవధ్యానం వల్ల మేలు చేకూరుతుంది.

కర్కాటకం

ఉన్నతాధికారుల సహాయంతో కీలక పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితుల సహకారం ఉంటుంది. మనోధైర్యం కోల్పోకుండా చూసుకోవాలి. ఇష్టదేవతలను ప్రార్థిస్తే మంచిది.

సింహం

చేపట్టిన పనుల్లో సానుకూల ఫలితాలు అందుకుంటారు. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ఒక శుభవార్త కుటుంబంలో సంతోషాన్ని నింపుతుంది. ఈశ్వరుడిని ఆరాధించడం వల్ల సత్ఫలితాలు అందుకుంటారు.

కన్య

విందులు, వినోదాలతో సరదాగా గడుపుతారు. చేపట్టిన పనులు సరైన ప్రణాళికతో పూర్తిచేస్తారు. కీలక వ్యవహారాల్లో పైచేయి సాధిస్తారు. ఇష్టదైవ ఆలయాలను సందర్శించుకోవడం మేలు చేకూరుతుంది.

తుల

ఈరాశివారికి గ్రహబలం తక్కువగా ఉంది. మనోధైర్యంతో ముందుకెళ్లాలి. మీరంటే గిట్టనివారితో తక్కువగా మాట్లాడడం మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆంజనేయస్వామి ఆరాధస్తే శుభం కలుగుతుంది.

వృశ్చికం

మనోధైర్యంతో ముందుకు సాగుతున్నారు. చేపట్టిన పనుల్లో అనుకున్న ఫలితాలు అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాల్లో సమస్యలు తొలగిపోతాయి. ఒక సంఘటన ఆవేదన కలిగిస్తుంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మాటలను గౌరవించడం వల్ల మంచి ఫలితాలు అందుకుంటారు. దుర్గాదేవిని పూజిస్తే శుభం కలుగుతుంది.

ధనుస్సు

చేపట్టిన పనుల్లో విజయం సాధించగలుగుతారు. ఆర్థికంగా మంచికాలం నడుస్తోంది. బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇష్టదేవతలను ఆరాధించడం వల్ల మేలు చేకూరుతుంది.

మకరం

చేపట్టిన పనుల్లో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటారు. మనోధైర్యం, పట్టుదలతో ముందుకెళ్లాలి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మాటలకు విలువనివ్వడం మంచిది. మనోధైర్యం కోల్పోకుండా చూసుకోవాలి. దుర్గాదేవిని పూజించడం వల్ల శుభం కలుగుతుంది.

కుంభం

ఒక శుభవార్త కుటుంబంలో సంతోషాన్ని నింపుతుంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థిస్తే మంచి జరుగుతుంది.

మీనం

చేపట్టిన రంగాల్లో ఆశించిన ఫలితాలు అందుకోవడానికి బాగా శ్రమించాల్సివస్తుంది. క్షమాగుణంతో బంధాలు బలపడతాయన్న విషయం గుర్తుంచుకోవాలి. నవగ్రహ ఆలయాలను దర్శించుకోవడం వల్ల సానుకూల ఫలితాలు అందుకుంటారు.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

Also Read:

Srinidhi Shetty: అందాలతో కవ్విస్తున్న కేజీయఫ్‌ భామ.. వైరల్ అవుతున్న శ్రీనిధి శెట్టి లేటెస్ట్ ఫోటోస్

Keerthy Suresh : ”అందుకే స్కిన్ షో చేయను”.. అసలు విషయం చెప్పిన అందాల కీర్తి

Chanakya Niti: పెళ్ళికి జీవిత భాగస్వామిని ఎంచుకునే సమయంలో ఈ విషయాలను గుర్తుంచుకోండి, మీరు ఎప్పటికీ చింతించరు