
దిన ఫలాలు (ఏప్రిల్ 18, 2026): మేష రాశి వారికి ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఆర్థిక, ఆస్తి వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. వృషభ రాశి వారిపై అధికారులకు నమ్మకం బాగా పెరుగుతుంది. కొన్ని కీలక బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
కొద్ది ప్రయత్నంతో ముఖ్యమైన వ్యవహారాలన్నీ సకాలంలో, సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఆర్థిక, ఆస్తి వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తుల వారికి రాబడి బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో హోదా లభిస్తుంది. వ్యాపారాల్లో బాగా పురోగమిస్తారు. పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. శుభవార్తలు ఎక్కువగా వింటారు.
అధికారులకు మీ మీద నమ్మకం బాగా పెరుగుతుంది. కొన్ని కీలక బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. బంధువుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. వృథా ఖర్చుల్ని తగ్గించుకోవలసిన అవసరం ఉంది. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. విద్యార్థులకు శ్రమ తప్పదు. కోపతాపాలను తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఇతరుల విమర్శల్ని పట్టించుకోవద్దు.
ఉద్యోగంలో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. కొద్దిగా ఆలస్యం అయినప్పటికీ ముఖ్య మైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. పిల్లల చదువుల విషయంలో శుభవార్తలు వింటారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. వృత్తి, వ్యాపా రాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆరోగ్యం బాగా కుదుటపడుతుంది. విద్యార్థులకు బాగుంటుంది.
నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల్లో అను కూల సమాచారం అందుతుంది. సోదరులతో సఖ్యత పెరుగుతుంది. కుటుంబ నమస్యలు పరిష్కారమవుతాయి. బంధుమిత్రులతో విందులో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు ప్రవేశపెడతారు. ఉద్యోగంలో సానుకూలతలు పెరుగుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో విజయాలు సాధిస్తారు. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది.
వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని ప్రోత్సాహకాలు అందుకుంటారు. వ్యాపారాలు ఆశాజనకంగా పురోగమిస్తాయి. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. అనుకోకుండా కొన్ని వివాదాలు, సమస్యలు పరిష్కారం అవుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. అధికారులు, కుటుంబ సభ్యులు మీ సలహాలు, సూచనల ద్వారా లబ్ధి పొందుతారు. బంధుమిత్రుల రాకపోకలుంటాయి. రావలసిన డబ్బు చేతికి అంది, ముఖ్యమైన అవసరాలు తీరుతాయి. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది.
వృత్తి, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మీద భారీగా ఖర్చు చేస్తారు. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. విదేశాలలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు సానుకూల సమాచారం అందుతుంది. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి సైతం ఊరట లభిస్తుంది.
అన్ని విధాలా సమయం అనుకూలంగా ఉంది. ఇంటా బయటా మీ మాట చెలామణీ అవుతుంది. ఉద్యోగంలో మీ సలహాలు, సూచనల వల్ల అధికారులు లబ్ది పొందుతారు. వృత్తి జీవితం బాగా బిజీగా సాగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. గౌరవమర్యాదలకు లోటుండదు. ఉన్నత వర్గాలతో పరిచయాలు విస్తరిస్తాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. విద్యార్థులు పురోగతి చెందుతారు. ప్రేమల్లో ముందడుగు వేస్తారు.
అనుకున్నపనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. కొందరు సన్నిహితులతో అపార్థాలు తలెత్తే సూచనలున్నాయి. ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. బంధువుల నుంచి విమర్శలు వచ్చే అవకాశం ఉంది. పరిచయస్థుల్లో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి ఆశించినంతగా సంపాదన పెరుగుతుంది. కీలక వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలను తీసుకోవడం చాలా మంచిది.
ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలు నిర్వర్తించడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలకు సంబంధించిన వ్యవహారాల్లో సొంత ఆలోచనలు మంచివి. అనుకోకుండా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. వ్యక్తిగత సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి. కుటుంబ సభ్యుల మీద కోపతాపాలు ప్రదర్శించక పోవడం ఉత్తమం. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు.
కుటుంబ సమస్యల్లో ముఖ్యమైనవి పరిష్కారం అవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో మరింత శ్రద్ధ పెట్టడం మంచిది. కొత్త నిర్ణయాలకు, కొత్త వ్యూహాలకు సమయం అనుకూలంగా ఉంది. ముఖ్య మైన పనుల్లో ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. ఆరోగ్యం బాగా అనుకూలిస్తుంది.
కొందరు పాత మిత్రుల్ని కలుసుకుంటారు. రోజంతా హ్యాపీగా సాగిపోతుంది. ప్రముఖులతో కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సామాజికంగా ఊహించని గుర్తింపు లభిస్తుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి దైవ కార్యాలకు హాజరవుతారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా, అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది.
ఉద్యోగంలో సహోద్యోగులతో విభేదాలు, అపార్థాలను పరిష్కరించుకుంటారు. ఎవరితోనూ వివాదాలకు వెళ్లకపోవడం మంచిది. కుటుంబ సభ్యుల ద్వారా ఆస్తి వ్యవహారాలు చక్కబడతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృథా ఖర్చులు బాగా తగ్గుతాయి. ముఖ్యమైన వ్యవహారాలను స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో కీలకమైన మార్పులు చేపడతారు. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ పనికిరాదు. అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు.