Rasi Phalalu 4th March: మనం అవసరం లేని విషయాల్లో చాలాసార్లు తల దూర్చడానికి ప్రయత్నిస్తుంటాం. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంటుంది. ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాల వల్ల జీవితాలు చిన్నాభిన్నం అవుతుంటాయి. కావున ప్రతీ సందర్భంలోనూ ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసర ఉంది. గురువారం ముఖ్యంగా పలు రాశుల వారికి ఈ రోజులు పరిస్థితులు అనుకూలంగా లేవు. ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు కలగనున్నాయో.. ఓ సారి చూసేద్దాం..
మేషం: ఈ రాశి వారు వ్యవహారిక విషయాల్లో కొన్ని ఆటంకాలు, అవరోధాలు ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. సుబ్రహ్మణ్వేశ్వర స్వామి అర్చన, స్వామివారి దర్శనం చేసుకోవడం మేలు చేస్తుంది.
వృషభ రాశి: ఈ రాశి వారు అనుకున్న కార్యక్రమాలు, పనుల్లో శ్రమకు గురైనప్పటికీ.. కూడా ఫలితాలను విజయవంతంగా పొందగలుగుతారు. ఆలోచన విధానాలల్లో మార్పులు అవసరం. గణపతి దర్శనం మేలు చేస్తుంది.
మిథున రాశి: ఈ రాశి వారు శ్రమాధిక్యత ఉంటుంది. వృత్తి్, వ్యాపారాల్లో కొన్ని వాయిదాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తలు అవసరం. అష్టలక్ష్మీస్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.
కర్కాటక రాశి: ఈ రాశి వారు చేపట్టిన పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి ప్రయోజనాలు పొందుతారు. ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. శివారాధన మేలు చేస్తుంది.
సింహ రాశి: ఈ రాశివారు ఈరోజు వేరువేరు రూపాల్లో వ్యక్తిగత అవసరాల కోసం కొన్ని అప్పులు చేయవలసి వస్తుంది. సంఘంలో గౌరవమర్యాదలకు భంగం కలగకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. శ్రీ రామరక్షాస్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.
కన్యా రాశి : ఈ రాశివారికి ఉద్యోగాది విషయాల్లో మంచి పురోభివృద్ధి ప్రారంభమవుతుంది. రాజకీయపరమైన వ్యవహారిక విషయాల్లో అనుకూల, ప్రతికూల సంబంధమైన సందర్భాలు చోటుచేసుకుంటాయి. గణపతి ఆరాధన మేలు చేస్తుంది.
తులా రాశి: ఈ రాశి వారికి పలు ఆకస్మికమైనటువంటి అంశాల్లో ప్రయోజనాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఖర్చుల విషయంలో నియంత్రణ పాటించడం మంచింది. అష్టలక్ష్మీస్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.
వృశ్చిక రాశి: ఈ రాశి వారు ఈ రోజు కొత్త రుణాల కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. దైవచింతన ఉంటుంది. పనుల్లో కొన్ని ఆవాంతరాలు కూడా కనిపిస్తున్నాయి. ఆంజనేయస్వామి వారికి అర్చన నిర్వహించడం మంచిది.
ధనస్సు రాశి: ఈ రాశి వారు చేపట్టిన పనులు నెమ్మదిగా ముందుకు జరుగుతుంటాయి. జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగాది విషయాల్లో మరిన్ని ఇబ్బందులు వచ్చే సూచనులున్నాయి. శ్రీ రాజమాతంగి నమ: అనే నామస్మరణ మేలు చేస్తుంది.
మకర రాశి: ఈ రాశి వారు ఈ రోజు చేపట్టిన పనుల్లో అనుకూలత ఉంటుంది. గౌరవ మర్యాదలను కూడా పొందుతుంటారు. శివపంచాక్షరి జపం మేలు చేస్తుంది.
కుంభ రాశి: ఈ రాశి వారు కుటుంబపరమైనటువంటి చిక్కులు, చికాకులను అధిగమించే ప్రయత్నం చేస్తుండాలి. ఉద్యోగాది విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. దుర్గా అమ్మవారికి కుంకుమార్చన మేలు చేస్తుంది.
మీన రాశి: ఈ రాశి వారికి శ్రమ పెరుగుతుంది. వ్యాపార వ్యవహరిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. శివారాధన మేలు చేస్తుంది.
Also Read: కళ్యాణమస్తు కార్యక్రమానికి ముహూర్తం ఖరారు.. ఈ ఏడాది మూడు విడతల్లో సామూహిక వివాహాలకు టీటీడీ ఏర్పాట్లు
ఇప్పటికీ ఆ ప్రాంతంలో వింత ఆచారం.. యువతికి పెళ్లి కావాలంటే యువకుడిని మెప్పించాల్సిందే..!