దిన ఫలాలు (జనవరి 4, 2024): జ్యోతిష్య శాస్త్రాన్ని విశ్వసించే వారు మనలో చాలా మంది ఉంటారు. జ్యోతిష్యంలో ఉన్న అంశాలను తూచాతప్పకుండా పాటిస్తుంటారు. వీటి ఆధారం ముందుకుసాగుతుంటారు. గురువారం కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలని పండితులు చెబుతున్నారు. అలాగే ఓ రాశి వారు ఈరోజు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఇంతకీ గురువారం మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. అనుకోని ఖర్చులు మీద పడే అవకాశం ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. సర్వత్రా మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో మీ సలహాలు, సూచనలు అధికారులకు నచ్చుతాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆహార, విహారాలకు సంబంధించి ముఖ్యమైన జాగ్రత్తలు పాటించడం మంచిది. మిత్రుల వల్ల డబ్బు నష్టపోయే అవకాశం ఉంది.
వృత్తి, ఉద్యోగాలలో బాధ్యతలు మరీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వృథా ఖర్చులతో ఇబ్బంది పడతారు. ముఖ్యమైన వ్యవహారాలను సకాలం పూర్తి చేయడం జరుగుతుంది. కుటుంబ సభ్యు లతో దైవ దర్శనం చేసుకుంటారు. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. ఒకరిద్దరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. కొత్త ఉద్యోగానికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
ఆర్థిక పరిస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ మాట చెల్లుబాటవుతుంది. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మనసులోని కోరికలు ఒకటి రెండు నెరవేరుతాయి. చేపట్టిన వ్యవహారాలు విజయవంతంగా, సంతృప్తికరంగా పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి నిల కడగా ఉంటుంది. పిల్లల పరంగా శుభవార్తలు వింటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నప్పటికీ, ఆశించిన ప్రోత్సాహకాలు అందుకోవడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరిగే అవకాశం ఉంటుంది. కుటుంబ వాతావరణం ఉత్సాహంగా సాగిపో తుంది. అనుకోకుండా కొన్ని శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయ త్నాలు సానుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు కలిసి వస్తాయి. సన్నిహితుల నుంచి శుభ వార్తలు వింటారు. పిల్లలు ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు.
ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా గడిచిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో సన్నిహితుల సలహాలు కూడా తీసుకోవడం మంచిది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు సజావుగా సాగిపోతాయి. కొత్త ప్రయత్నాల్లో తరచూ నిర్ణయాలు మార్చుకోవలసిన అవసరం ఉంటుంది. తోబుట్టువులతో సామరస్యం పెరుగుతుంది. వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. కుటుంబ ఆర్థిక ప్రయత్నాలు సానుకూలపడతాయి. వాహన ప్రమాదాలతో జాగ్రత్తగా ఉండాలి.
వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థి తులు చాలావరకు సంతృప్తికరంగా చక్కబడతాయి. ఆర్థిక లావాదేవీలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యం విష యంలో జాగ్రత్త. ప్రయాణాల్లో ప్రమాదాలకు అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో అన్యోన్యత, సామరస్యం పెరుగుతాయి. తోబుట్టువులతో ఆస్తి సంబంధమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
ఉద్యోగాలలో ఆశించిన పెరుగుదల ఉంటుంది. పదోన్నతులకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు నిదానంగా, నిలకడగా సాగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థిక ప్రయ త్నాలు సానుకూలపడతాయి. అవసరానికి మించి ఇతరులకు సహాయం చేయడం జరుగుతుంది. జీవిత భాగస్వామితో కలిసి పుణ్య కార్యాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి.
ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారపరంగా కొన్ని సమస్యలను అధిగమిస్తారు. డాక్టర్లు, లాయర్లకు డిమాండ్ పెరుగుతుంది. పెళ్లి సంబంధానికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. రాజకీయాలు, ప్రభుత్వం వంటి రంగాలకు చెందిన వారికి సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం పరవాలేదు.
ఉద్యోగ వాతా వరణం ఉత్సాహంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా, సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ప్రయాణాలలో ఇబ్బందులు ఎదురవుతాయి. రావలసిన డబ్బు అందుతుంది. బాకీలు వసూలవుతాయి. ముఖ్య మైన అవసరాలు తీరిపోతాయి. అనుకున్న వ్యవహారాలు, ముఖ్యమైన పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. పెద్దల జోక్యంతో ముఖ్యమైన కుటుంబ సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది.
ఉద్యోగంలో అదనపు బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరు గుతాయి. ఆర్థికంగా ఆశించిన పురోగతి సాధిస్తారు. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి జీవితంలో ఒత్తిడి ఉంటుంది. విశ్రాంతికి అవకాశం ఉండకపోవచ్చు. వ్యాపారాలు అనుకూలంగా, ఆశాజనకంగా ఉంటాయి. సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అంది వస్తాయి.
వృత్తి, ఉద్యోగాల్లో ఇతరుల బాధ్యతలు మీద పడే అవకాశం ఉంది. సొంత పనులకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. ఇంటా బయటా విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ అన్నట్టుగా ఉంటుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు, వ్యక్తిగత పనుల్లో స్నేహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది.
వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన ప్రోత్సాహకాలు అందుతాయి. వ్యాపారులకు లాభాలు పెరిగి పెట్టు బడులు పెంచడం జరుగుతుంది. ఇంటా బయటా అనుకూల పరిస్థితులు ఉంటాయి. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. ఆస్తి సంబంధమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొద్ది ప్రయత్నంతో మొండి బాకీలు, బకాయిలు వసూలు అవుతాయి. ప్రయాణాలలో వీలైనంత జాగ్రత్తగా ఉండాలి.
మరిన్ని ఆస్ట్రాలజీ సంబధిత కథనాల కోసం క్లిక్ చేయండి..