Horoscope Today: సొంత నిర్ణయాలు తీసుకుంటే నష్టపోతారు.. 12 రాశుల వారికి బుధవారం రాశిఫలాలు..

| Edited By: Janardhan Veluru

Jan 31, 2024 | 5:01 AM

దిన ఫలాలు (జనవరి 31, 2024): మేష రాశి వారికి ఈ రోజు వృత్తి, ఉద్యోగాలలో కొద్దిగా పనిభారం పెరిగే అవకాశం ఉంది. వృషభ రాశికి చెందిన ఉద్యోగులకు కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. మిథున రాశికి చెందిన వారు వృత్తి, వ్యాపారాల్లో పోటీలను అధిగమించి లాభాలు సంపాదిస్తారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: సొంత నిర్ణయాలు తీసుకుంటే నష్టపోతారు.. 12 రాశుల వారికి బుధవారం రాశిఫలాలు..
Horoscope Today 31st January 2024
Follow us on

దిన ఫలాలు (జనవరి 31, 2024): మేష రాశి వారికి ఈ రోజు వృత్తి, ఉద్యోగాలలో కొద్దిగా పనిభారం పెరిగే అవకాశం ఉంది. వృషభ రాశికి చెందిన ఉద్యోగులకు కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. మిథున రాశికి చెందిన వారు వృత్తి, వ్యాపారాల్లో పోటీలను అధిగమించి లాభాలు సంపాదిస్తారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, ఉద్యోగాలలో కొద్దిగా పనిభారం పెరిగే అవకాశం ఉంది. విశ్రాంతి కూడా ఉండకపోవచ్చు. ఆర్థిక వ్యవహారాలు చాలావరకు అనుకూలంగానే ఉంటాయి కానీ, ఆర్థిక లావాదేవీలకు మాత్రం దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ముఖ్య మైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఇది సమ యం కాదు. ఆరోగ్యం చాలావరకు బాగానే ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగు తుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగులకు కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు ప్రవేశపెడతారు. వృత్తి జీవితానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. రాజకీయంగా కార్యకలాపాలు పెరుగుతాయి. చిన్ననాటి స్నేహితులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు మంచిది కాదు. కొందరు స్నేహితులు లేదా పరిచయస్థులు డబ్బు నష్టపరిచే అవకాశం ఉంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

కుటుంబ వాతావరణం ప్రశాంతంగా, సామరస్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో పోటీలను అధిగమించి లాభాలు సంపాదిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల ఫలితం ఉంటుంది. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు కూడా చేతికి అందుతుంది. మొండి బాకీ వసూలు అవుతుంది.. పిల్లల నుంచి శుభవార్త వింటారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆదాయ మార్గాలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యక్తిగత సమస్యకు పరిష్కారం లభిస్తుంది. కొందరు స్నేహితులతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. బంధుమిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో సంప్రదించి నిర్ణయాలు తీసు కోవడం మంచిది. ఇతరుల విషయాల్లో తలదూర్చకపోవడం శ్రేయస్కరం. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాలలో అధికారులతో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కొందరు బంధుమిత్రులతో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలలో, వివాహ ప్రయత్నాలలో ఆశించిన విజయాలు లభించే అవకాశం ఉంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగ జీవితం సాధారణంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో సంపాదన పెరుగుతుంది. ఆదాయం పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలను జాగ్రత్తగా చక్కబెట్టుకోవడం మంచిది. దూర ప్రయాణ సూచనలున్నాయి. ముఖ్యమైన పనులు నిదానంగా ముందుకు సాగు తాయి. కుటుంబ జీవితం సానుకూలంగా, సామరస్యంగా సాగిపోతుంది. ఆరోగ్యం పరవా లేదు. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో డాక్టర్లను సంప్రదించాల్సి వస్తుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, ఉద్యోగాలలో శ్రమ, ఒత్తిడి ఉన్నప్పటికీ ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. సహోద్యోగుల వ్యవహారాల్లో కల్పించుకోకపోవడం శ్రేయస్కరం. నిరు ద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు లభిస్తాయి. వ్యక్తిగత సమస్యల ఒకటి పరిష్కారం అవుతుంది. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబ జీవితం ప్రశాంతంగా, సామరస్యంగా సాగిపోతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. రాజకీయాలు, రియల్ ఎస్టేట్, వైద్యం, మద్యం తదితర రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు కలిసి వస్తాయి. మిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. తల పెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఒకటి రెండు కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాలలో అధికారుల నుంచి అనుకూలతలు ఏర్పడతాయి. వ్యాపారాల్లో సమస్యలను అధిగమిస్తారు. ఆర్థిక లావాదేవీలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్యంలో మెరుగుదల కనిపి స్తుంది. దైవ కార్యాలలో పాల్గొంటారు. అనవసర పరిచయాలకు, వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, అనుకోని ఖర్చులు పెరుగుతాయి. గృహ, వాహన సౌకర్యాలకు సంబంధించి ఆటంకాలు తొలగుతాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)

వృత్తి, ఉద్యోగాలలో పదోన్నతులకు కూడా అవకాశం ఉంది. ఉద్యోగులకు అధికారుల అండ దండలు లభిస్తాయి. వ్యాపారంలో కొత్తగా లాభాలు అందుతాయి. నిరుద్యోగులకు మంచి అవ కాశాలు అంది వస్తాయి. ఆదాయం పరిస్థితి చాలావరకు మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక ప్రయత్నాలు ఫలిస్తాయి. కొందరు మిత్రులను ఆర్థికంగా ఆదుకోవడం జరుగుతుంది. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో అధికారులతో సామరస్య వాతావరణం నెలకొంటుంది. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు అందకపోవచ్చు. కుటుంబ పరిస్థితులు చాలావరకు చక్కబడతాయి. ఆదాయం బాగానే ఉంటుంది. వృథా ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండడం మంచిది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరిగి, ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. బంధువుల నుంచి ఒకటి రెండు సమస్యలు ఎదురవుతాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాలలో సంపాదనకు లోటు ఉండదు. ఉద్యోగ జీవితంలో సానుకూలత పెరుగుతుంది. కొత్త కార్యక్రమాలు ప్రారంభించడానికి, కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి సమయం అనుకూలంగా ఉంది. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. జీవిత భాగస్వామికి మంచి ఉద్యోగ ఆఫర్లు అందివస్తాయి. తోబుట్టువులతో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. వ్యాపార వ్యవహారాలు నిదానంగా ముందుకు సాగుతాయి. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వినడం జరుగుతుంది.