Horoscope Today: ఈరాశుల వారికి ఉద్యోగాల్లో సమస్యలు.. ఖర్చులు అధికం.. ఈరోజు రాశిఫలాలు..

|

Sep 02, 2021 | 7:01 AM

ఇప్పటికీ తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవాలని చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. రోజులో తమ జీవితంలో ఏం జరుగబోతుందో ముందుగానే

Horoscope Today: ఈరాశుల వారికి ఉద్యోగాల్లో సమస్యలు.. ఖర్చులు అధికం.. ఈరోజు రాశిఫలాలు..
Horoscope Today
Follow us on

ఇప్పటికీ తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవాలని చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. రోజులో తమ జీవితంలో ఏం జరుగబోతుందో ముందుగానే తెలుసుకోవాలనుకుంటారు. ఈ క్రమంలోనే రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. దాదాపు రాశి ఫలాలను విశ్వసించేవారి సంఖ్య అధికంగానే ఉంటుంది. ఈరోజు చంద్రుడు మిథున రాశిలో ఉండనున్నాడు. మరీ ఈరోజు ఏఏ రాశుల వారికి అనుకూలంగా ఉందో తెలుసుకుందామా.

మేషరాశి..
ఈరోజు వీరు నూతన కార్యక్రమాలు చేపడతారు. రుణాలు అందుతాయి. అలాగే వ్యాపారాలు, ఉద్యోగాల్లో ఒత్తిడి తగ్గుతుంది.
వృషభ రాశి..
ఈరోజు వీరికి అధిక ఖర్చులు ఉంటాయి. అనుకోని ప్రయాణాలు చేస్తారు. మానసికంగా ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం.
మిథున రాశి..
ఈరోజు వీరికి ఆర్థికాభివృధ్ధి ఉంటుంది. అలాగే కుటుంబసభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. సరైన నిర్ణయాలు తీసుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.
కర్కాటక రాశి..
ఈరోజు వీరు అనుకోని ప్రయాణాలు చేస్తుంటారు. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాల్లో మానసిక ఒత్తిడి ఉంటుంది.
సింహ రాశి..
ఈరోజు వీరికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. అలాగే బంధువుల నుంచి శుభవార్తలు ఉంటారు. ఆర్థిక వ్యవహారాలు మెరుగుపడతాయి.
కన్య రాశి..
ఈరోజు వీరికి నూతన పరిచయాలు పెరుగుతాయి. బంధువులను కలుసుకుంటారు. అదనపు ఆదాయం పెరుగుతుంది. వ్యాపారంలో సమస్యలు తొలగుతాయి.
తుల రాశి..
ఈరోజు వీరికి కుటుంబంలో, సమాజంలో సమస్యలు ఎదురవుతాయి. బంధువులతో విరోధాలు ఏర్పడతాయి. చేపట్టిన పనులు జరగవు. ఆర్థికంగా సమస్యలు ఉంటాయి.
వృశ్చిక రాశి..
ఈరోజు వీరికి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు కలుగుతాయి. వ్యాపారంలో చిక్కులు ఉంటాయి.
ధనుస్సు రాశి..
ఈరోజు వీరికి కొత్తగా ఉద్యోగాలు పొందుతారు. ఆర్థిక విషయాల్లో అనుకూలత ఉంటుంది. చేపట్టిన పనులు సక్రమంగా జరుగుతాయి.
మకర రాశి..
ఈరోజు వీరికి ఆర్థిక విషయాలు మెరుగుపడతాయి. పనులు సమయానికి పూర్తి అవుతాయి. ఉద్యోగం, వ్యాపార సమస్యలు తగ్గుతాయి.
కుంభ రాశి..
ఈరోజు వీరికి చేపట్టిన పనులు జరగవు. ప్రయాణాల్లో మార్పులు జరగుతాయి.. ఆనారోగ్య సమస్యలు వస్తాయి.
మీన రాశి..
ఈరోజు వీరికి అనుకోకుండా రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో సమస్యలు కలుగుతాయి.

Also Read:  Andhra Pradesh: పిలవని పేరంటానికి వస్తారు.. వేలకు వేలు డిమాండ్ చేస్తారు.. ఇస్తే ఓకే.. లేదంటే సీన్ మామూలుగా ఉండదు..

Anantapur: రెచ్చిపోయిన అనంతపురం హోటల్ ఎస్ఆర్ గ్రాండ్‌ హోటల్ సిబ్బంది.. ఫోటోగ్రాఫర్ మీద దాడి : వాచ్ వీడియో