Horoscope Today: ఈరాశివారు పెట్టుబడులు, ఉద్యోగాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి… ఈరోజు రాశిఫలాలు..

|

Apr 02, 2021 | 7:50 AM

Horoscope Today 2nd April 2021: ప్రస్తుతం చాలా మంది రాశిఫలాలను నమ్ముతుంటారు. ఇక ఏదైనా పని మొదలుపెట్టాలన్న.. లేదా ఎక్కడికైనా వెళ్ళాలి

Horoscope Today: ఈరాశివారు పెట్టుబడులు, ఉద్యోగాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి... ఈరోజు రాశిఫలాలు..
Horoscope Today
Follow us on

Horoscope Today 2nd April 2021: ప్రస్తుతం చాలా మంది రాశిఫలాలను నమ్ముతుంటారు. ఇక ఏదైనా పని మొదలుపెట్టాలన్న.. లేదా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నా.. వారి రాశిఫలం ఎలా ఉంది అనేది తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఈరోజు అంటే ఏప్రిల్ 2న శుక్రవారం రోజు చంద్రుడు వృశ్చిక రాశిలో కేతువుతోపాటు ఉండనున్నాడు. అలాగే ఈరోజు మేషరాశి నుంచి మీనం వరకు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ముందుగానే తెలుసుకుందాం.

మేషరాశి..

ఈరోజు వీరు చెపట్టినటువంటి పనులలో పురోభివృద్ధి ప్రారంభమవుతుంది. ఆధ్యాత్మిక, దైవ చింతన కార్యాక్రమాల్లో పాల్గోంటారు. ఈరోజు వీరికి సుబ్రమణ్య స్వామి ఆరాధన మంచి ఫలితాలను ఇస్తుంది.

వృషభ రాశి..

ఈరోజు వీరికి చేపట్టిన పనులలో నిదానంగా వ్యవహరించడం మంచింది. ప్రయోజనాల విషయంలో ఏమాత్రం రాజీ పడకూడదు. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం మేలు చేస్తుంది.

మిధున రాశి..

ఈరోజు వీరికి వాహన యోగాలు ఉన్నాయి. అలాగే రావాల్సిన బాకీలు వసూలు చేసుకుంటారు. ఈరోజు వీరికి అష్టలక్ష్మీ స్త్రోత్ర పారాయణం మేలు చేస్తుంది.

కర్కాటక రాశి..

ఈరోజు వీరు అనుకున్న పనులు చేయడానికి కుటుంబ సభ్యుల సహకారం అవసరమవుతుంది. అనవసరంగా ఇతరులపై చికాకు పడుతుంటారు. జాగ్రత్తలు తీసుకోవాలి. విష్ణు సహస్త్ర నామ స్త్రోత్ర పారాయణం మేలు చేస్తుంది.

సింహరాశి..

ఈరోజు వీరికి వాహనా యోగాలు ఉన్నాయి. ఉద్యోగాల విషయంలో సంతృప్తిగా ఉంటారు. ఈరోజు వీరికి లక్ష్మీ నరసింహవారి దర్శనం మేలు చేస్తుంది.

కన్య రాశి..

ఈరోజు వీరికి చేపట్టినటువంటి పనులలో పురోగభివృద్ది ఉంటుంది. ఉద్యోగాల విషయంలో ఒత్తిడులను అధిగమిస్తారు. శ్రీ రాజమాతంగై నమః అనే నామస్మరణ మేలు చేస్తుంది.

తులరాశి..

ఈరోజు వీరు వ్యక్తిగత అవసరాల కోసం అప్పులు చేస్తుంటారు. ఉద్యోగాల విషయంలో ఊహించని సంఘటనలు జరుగుతాయి. శ్రీరామ రక్షా స్త్రోత్త పారాయణం మేలు చేస్తుంది.

వృశ్చిక రాశి..

ఈరోజు వీరికి ఎంత శ్రమపడినా శుభఫలితాలు ఉంటాయి. తొందర్లోనే సమస్యలు తగ్గిపోతాయి. సంకటనష గణపతి స్త్రోత్ర పారాయణం మేలు చేస్తుంది.

ధనుస్సు రాశి..

ఈరోజు వీరికి రావాల్సిన బాకీలు ఆలస్యం అవుతాయి. ఇతర మార్గాలను అన్వేషిస్తారు. ఉద్యోగాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శివరాధన మేలు చేస్తుంది.

మకర రాశి..

ఈరోజు కుటుంబ పరంగా అభివృధ్ధి ప్రారంభమవుతుంది. వ్యాపార, ఉద్యోగాల విషయంలో మిశ్రమ ఫలితాలుంటాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం మేలు చేస్తుంది.

కుంభరాశి..

ఈరోజు వీరికి ఋణ ప్రయత్నాలు కోనసాగుతుంటాయి. రావల్సిన పేరు ప్రాఖ్యతలు పొందుతుంటారు. దుర్గ సప్తశ్లోకి పారాయణం మేలు చేస్తుంది.

మీన రాశి..

ఈరోజు వీరు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆంజనేయ దర్శనం మేలు చేస్తుంది.

Also Read: ఈరోజు సంకటహర చతుర్ధశి.. ఈరోజున గణపతిని ఎందుకు పూజిస్తారు.. ప్రాముఖ్యత …