Horoscope Today: వారి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది.. 12 రాశుల వారికి బుధవారం రాశిఫలాలు

| Edited By: Janardhan Veluru

Feb 28, 2024 | 5:01 AM

దిన ఫలాలు (ఫిబ్రవరి 28, 2024): మేష రాశి వారికి ఆర్థిక విషయాల్లో సమయం బాగా అనుకూలంగా ఉంది. వృషభ రాశి వారికి వ్యయ స్థానంలో ఉన్న గురువు వల్ల అప్పుడప్పుడూ కొద్దిగా ఆరోగ్య సమస్యలు ఉంటాయి. మిథున రాశి వారు ఈ రోజు ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలమవుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: వారి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది.. 12 రాశుల వారికి బుధవారం రాశిఫలాలు
Horoscope Today 28th February 2024
Follow us on

దిన ఫలాలు (ఫిబ్రవరి 28, 2024): మేష రాశి వారికి ఆర్థిక విషయాల్లో సమయం బాగా అనుకూలంగా ఉంది. వృషభ రాశి వారికి వ్యయ స్థానంలో ఉన్న గురువు వల్ల అప్పుడప్పుడూ కొద్దిగా ఆరోగ్య సమస్యలు ఉంటాయి. మిథున రాశి వారు ఈ రోజు ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలమవుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఈ రాశిలో సంచారం చేస్తున్న గురువు కారణంగా ఈ రాశివారికి మధ్య మధ్య ఏదో విధంగా ఆదాయం కలిసి వస్తూ ఉంటుంది. ఆర్థిక విషయాల్లో సమయం బాగా అనుకూలంగా ఉంది. ఇతరులకు మేలు చేసే పనులు చేపడతారు. వృత్తి, ఉద్యోగాలలో కూడా సహోద్యోగులకు బాగా సహాయపడడం జరుగుతుంది. వ్యాపారాలు సానుకూలంగా కొనసాగుతాయి. నిరుద్యోగులు మంచి ఆఫర్ అందుకుంటారు. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వ్యయ స్థానంలో ఉన్న గురువు వల్ల అప్పుడప్పుడూ కొద్దిగా ఆరోగ్య సమస్యలు ఉంటాయి. వృథా ఖర్చులు బాగా పెరుగుతాయి. మిగిలిన గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయం నిలకడగా ఉంటుంది. కెరీర్ పరంగా అభివృద్ధి ఉంటుంది. తలపెట్టిన పనులు పూర్త వుతాయి. ఉద్యోగంలో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అందివస్తాయి. ఇంటా బయటా శ్రమాధిక్యత ఉంటుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

లాభ స్థానంలో ఉన్న గురువు, నవమ స్థానంలో ఉన్న శని, బుధ, రవుల కారణంగా సమయం అన్ని విధాలుగానూ అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలమవుతుంది. వ్యక్తి గత వ్యవహారాల్ని సకాలంలో సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. అయితే, సహోద్యోగులతో మాట పట్టింపులు ఏర్పడే అవకాశ ముంది. వ్యాపారాలు లాభాలపరంగా సానుకూలంగా సాగిపోతాయి. ఆశించిన శుభవార్తలు వింటారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

సప్తమ స్థానంలో ఉన్న కుజ, శుక్రుల వల్ల అనేక సమస్యల నుంచి ఒత్తిళ్ల నుంచి బయటపడే అవకాశం ఉంది. విజయాలు ఎక్కువగా సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. సోదరులతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాలకు సంబంధించి శుభవార్తలు అందుకుంటారు. వ్యాపారపరంగా కూడా ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది. ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

నవమంలో గురువు, సప్తమ స్థానంలో రవి, బుధుల కారణంగా వృత్తి, ఉద్యోగాలపరంగా అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. లాభాలపరంగా వ్యాపారాలు నిల కడగా ముందుకు సాగుతాయి. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరు ద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. బాగా దగ్గర బంధువులకు ఆర్థికంగా అండగా నిలబడతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం విషయంలో తగినంత శ్రద్ధ తీసుకోవడం మంచిది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

పంచమ స్థానంలో ఉన్న కుజ, శుక్రులు, ఆరవ స్థానంలో ఉన్న శని, రవుల ఆర్థిక, అనారోగ్య సమ స్యల నుంచి చాలావరకు బయటపడతారు. ఆర్థిక పరిస్థితి అంచనాలకు మించి మెరుగు పడు తుంది. ఆస్తి లేదా డబ్బు కలిసి వస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సంపాదన పెరుగు తుంది. ఉద్యోగంలో మీ పని తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. పిల్లల చదువుల పట్ల శ్రద్ధ తీసుకోవాల్సి ఉంది. దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

సప్తమ స్థానంలో సంచారం చేస్తున్న గురువు కారణంగా ఈ రాశివారికి అధికార యోగం పట్టే అవ కాశం ఉంది. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో ముఖ్యమైన బాధ్యతలు అప్పగిం చడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీ అయిపోతాయి. వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులు తీసుకు వస్తారు. ఆదాయం పెరగడానికి చేసే ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. కుటుంబ వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసు కుంటారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

రాశ్యధిపతి కుజుడు ఉచ్ఛ స్థితిలో ఉన్న కారణంగా, రోజంతా సానుకూలంగా గడిచిపోతుంది. స్థితి గతులు మెరుగుపడతాయి. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. వ్యాపా రాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, వృథా ఖర్చులు పెరుగుతాయి. శుభవార్తలు వింటారు. వ్యాపారపరంగా లక్ష్యాలలో మార్పు చేస్తారు. లాభాలకు లోటుండదు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

తృతీయంలో శనీశ్వరుడు, పంచమ స్థానంలో ఉన్న గురువు కారణంగా ఆర్థిక సంబంధమైన వ్యవ హారాలు సానుకూలంగా ముందుకు సాగుతాయి. కొన్ని కీలక సమస్యల నుంచి కాస్తంత బయట పడతారు. ముఖ్యమైన పనుల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగంలో సొంత బాధ్యతలను పూర్తి చేస్తారు. తోటి ఉద్యోగులకు సహాయపడతారు. వృత్తి, వ్యాపారాలు ఆశా జనకంగా సాగిపోతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష‌్ట 1,2)

శుభ గ్రహాలు బాగా అనుకూలంగా అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికారులు ఎక్కువగా ఆధారపడతారు. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. బంధువుల రాకపోకలుంటాయి. వ్యాపార భాగస్వాములతో వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీలైతే ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఈ రాశిలో రవి, బుధుల కలయిక వల్ల మీ మాట చెలామణీ అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం పెరుగుతుంది. ఉద్యోగులకు ఆశించిన స్థాయిలో ప్రోత్సాహకాలు అందుతాయి. తోబుట్టు వులతో ఉన్న స్థిరాస్తి వివాదాలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. వ్యక్తిగత, కుటుంబ సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. కొందరు శత్రువులు మిత్రులుగా మారే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

కుజ, శుక్రులు లాభ స్థానంలో ఉన్నందువల్ల ఏలిన్నాటి శని ప్రభావం బాగా తగ్గుతుంది. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో కొద్దిపాటి ఇబ్బందులున్నప్పటికీ సకాలంలో బాధ్యతలను పూర్తి చేస్తారు. మిత్రుల వల్ల డబ్బు నష్టపోయే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాలు సాధారణంగా సాగిపోతాయి. ఆశించిన పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం జాగ్రత్త.