Horoscope Today: వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి.. 12రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు

| Edited By: Janardhan Veluru

Dec 27, 2024 | 5:01 AM

Today Horoscope (December 27, 2024): మేష రాశి వారు ఉద్యోగంలో ఒకటి రెండు శుభవార్తలు వినడం జరుగుతుంది.. వృషభ రాశి వారికి ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. అయితే కుటుంబ బాధ్యతలు ఒత్తిడి కలిగిస్తాయి.మిథున రాశి వారికి కొందరు దగ్గర బంధువుల వల్ల ఆర్థిక నష్టం జరిగే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి.. 12రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు
Horoscope Today 27th December 2024
Follow us on

దిన ఫలాలు (డిసెంబర్ 27, 2024): మేష రాశి వారికి ఆదాయ వృద్ధికి సమయం బాగా అనుకూలంగా ఉంది. వృషభ రాశి వారికి ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. మిథున రాశి వారికి ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఆదాయ వృద్ధికి సమయం బాగా అనుకూలంగా ఉంది. ఉద్యోగపరంగా రోజంతా సంతృప్తికరంగా సాగిపోతుంది. ఉద్యోగంలో ఒకటి రెండు శుభవార్తలు వినడం జరుగుతుంది. వృత్తి జీవితంలో కార్యకలాపాలు పెరుగుతాయి. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. వ్యక్తిగత సమస్యల ఒత్తిడి బాగా తగ్గుతుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు అందుతాయి. ముఖ్యమైన పనులు, ప్రయత్నాలు సంతృప్తికరంగా నెరవేరుతాయి. ప్రయాణాల వల్ల లాభముంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఆదాయానికి లోటుండదు. ప్రతి ప్రయత్నంలోనూ వ్యయ ప్రయాసలుంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో కూడా శ్రమ, తిప్పట ఉంటాయి. కుటుంబ బాధ్యతలు ఒత్తిడి కలిగిస్తాయి. ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. కుటుంబపరంగా రోజంతా ప్రశాంతంగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాలు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. కొందరు దగ్గర బంధువుల వల్ల ఆర్థిక నష్టం జరిగే అవకాశం ఉంది. తోబుట్టువులతో విభేదాలు కలుగుతాయి. వ్యాపారాలు లాభాలపరంగా బాగా పురోగతి చెందుతాయి. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలకు ఆశించిన స్పందల లభిస్తుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

కొద్ది ప్రయత్నంతో ఆదాయం వృద్ది చెందుతుంది. రావలసిన డబ్బును రాబట్టుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేసే స్థాయిలో ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఉద్యోగంలో చిన్నపాటి అధికార యోగానికి అవకాశం ఉంది. కొందరు బంధుమిత్రు లకు అండగా నిలబడతారు.సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. వ్యాపారాల్లో రాబడి పెరు గుతుంది. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు తదితర వృత్తుల వారికి డిమాండ్ బాగా పెరుగుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ప్రతి పనిలోనూ శ్రమాధిక్యత ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు వ్యయ ప్రయాసలతో గానీ పూర్తి కావు. ఆదాయంతో పాటు ఖర్చులు పెరుగుతాయి. అతి కష్టం మీద ముఖ్యమైన వ్యవహారా లను పూర్తి చేస్తారు. వ్యక్తిగత సమస్యల ఒత్తిడి ఉంటుంది. ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. కుటుంబంలో ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహం కలిగిస్తాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. అదనపు ఆదాయం మీద దృష్టి పెడతారు. ఆస్తి వివా దం రాజీమార్గంలో పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. ఉద్యోగ పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి. పదోన్నతికి మార్గం సుగమం అవుతుంది. వృత్తి జీవితం బాగా కలిసి వస్తుంది. వ్యాపారంలో కార్యకలాపాలు, లావాదేవీలు పెరుగుతాయి. ఉద్యోగులు ఉద్యోగం మారే అవకాశాలున్నాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగంలో శుభవార్తలు వింటారు. బాధ్యతలను మార్చడం జరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు బాగా వృద్ధి చెందుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఇతర ఆర్థిక లావాదేవీల వల్ల లాభాలు గడిస్తారు. కొద్ది ప్రయత్నంతో ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆదా యం బాగా పెరుగుతుంది. కుటుంబం మీద ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం మంచిది కాదు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

వృశ్చికం (విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ)

ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎవరినీ అతిగా నమ్మవద్దు. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడుతుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అదనపు ఆదాయ మార్గాల మీద శ్రద్ధ పెంచుతారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. అవసరానికి తగ్గట్టుగా తల్లితండ్రుల నుంచి ఆశించిన సహాయం లభిస్తుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి తప్పకపోవచ్చు. వృత్తి, వ్యాపారాలు యథావిధిగా సాగిపోతాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. అధికారులు ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయ త్నాలు సఫలం అవుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. పిల్లలు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఆదాయ వృద్ధికి బాగా అవకాశం ఉంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. కొందరు బంధుమి త్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. ఆరోగ్యం పరవాలేదు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)

ఉద్యోగంలో పనిభారం కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. లక్ష్యాలను పూర్తి చేయడంలో శ్రమాధిక్యత కలుగుతుంది. ఇతరత్రా, అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆకస్మిక ధన లాభా నికి అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. ఆర్థిక సమస్యలు కొద్దిగా పరిష్కారమవు తాయి. ముఖ్యమైన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. వృత్తి జీవితంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఉన్నత వర్గాలతో పరిచయాలు ఏర్పడతాయి. సామాజికంగా మంచి గుర్తింపు లభిస్తుంది.

కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

పని భారం కాస్తంత ఎక్కువగా ఉంటుంది. సకారంలో బాధ్యతలు, లక్ష్యాలను పూర్తి చేయడంలో ఒత్తిడికి గురవుతారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి, ఉద్యోగాలలో కొద్దిపాటి పురోగతికి అవకాశం ఉంది. వ్యాపారాలు సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి. కుటుంబ జీవి తంలో సమస్యలు తలెత్తుతాయి. పిల్లల చదువుల మీద శ్రద్ద పెడతారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

కొద్ది ప్రయత్నంతో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గే అవకాశం ఉంది. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఎదురు చూస్తున్న శుభ వార్తలు వినడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాల పెరుగుదలకు సంబంధించిన సమా చారం అందుతుంది. అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. సొంత పనుల మీద కొద్దిగా శ్రద్ధ పెట్టడం మంచిది.