దిన ఫలాలు (జూలై 25, 2024): మేష రాశి వారికి ఆర్థిక విషయాల్లో సమయం బాగా అనుకూలంగా ఉంది. వృషభ రాశి వారు తలపెట్టిన పనులు తేలికగా పూర్తవుతాయి. ఉద్యోగంలో అధికారుల ఆదరణ ఉంటుంది. మిథున రాశి వారు కొందరు మిత్రులతో మాట పట్టింపులకు అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
రోజంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. ఆర్థిక విషయాల్లో సమయం బాగా అనుకూలంగా ఉంది. కొత్త ప్రయత్నాలు చేపట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఇతరులకు మేలు జరిగే పనులు చేపడతారు. వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని శుభవార్తలు వింటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. అనుకున్న పనులన్నీ సునాయాసంగా పూర్తవుతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయ త్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులు మంచి ఆఫర్ అందుకుంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. కొద్దిపాటి అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఆదాయం క్రమంగా పెరుగుతుంది. వృత్తి జీవితం ఆశించిన విధంగా సాగిపోతుంది. తలపెట్టిన పనులు తేలికగా పూర్తవుతాయి. ఉద్యోగంలో అధికారుల ఆదరణ ఉంటుంది. ప్రయాణాలు లాభసాటిగా సాగు తాయి. అనవసర ఖర్చుల్ని అదుపు చేయడం మంచిది. వ్యాపారాల్లో పెట్టుబడికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు కొత్త ఆఫర్లు అందుతాయి. పిల్లలు విజయాలు సాధి స్తారు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా మోసపోయే అవకాశం ఉంది. ఆరోగ్యం మీద శ్రద్ద పెంచాల్సి ఉంటుంది. ఇవి రెండూ మినహా రోజంతా అనుకూలంగా సాగిపోతుంది. వ్యక్తిగతంగా సమయం అన్ని విధాలుగానూ అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా సకాలంలో నెరవేరుతుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాట చెల్లు బాటవుతుంది. కొందరు మిత్రులతో మాట పట్టింపులకు అవకాశం ఉంది. వ్యాపారాలు లాభాలనిస్తాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఆర్థిక పరిస్థితి సజావుగా సాగిపోతుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ముఖ్య మైన వ్యవహారాల్లో తప్పకుండా కార్యసిద్ధి ఉంటుంది. ఆస్తి వ్యవహారాల్లో అప్రయత్నంగా విజ యాలు సాధిస్తారు. సోదరులతో సామరస్యం, సాన్నిహిత్యం పెరుగుతాయి. కుటుంబ వ్యవహా రాలు అనుకూలంగా మారతాయి. వృత్తి, ఉద్యోగాలలో జీతభత్యాలు పెరగడానికి అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలు బాగానే వృద్ధి చెందుతాయి. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఆర్థికంగా అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంది. అదనపు ఆదాయ మార్గాల్లో ఆదాయం బాగా పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు. ఆర్థిక సమస్యల నుంచి బయట పడడం ప్రారంభం అవుతుంది. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. ఆరోగ్యం నిలకడగా సాగి పోతుంది. బంధువుల్లో ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉండడంతో కొన్ని కష్టనష్టాల నుంచి బయటపడతారు. ఒత్తిళ్లు తగ్గి కొద్దిపాటి ఊరట లభిస్తుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఆస్తి సమస్య ఒకటి పరి ష్కారమయ్యే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఆశించిన విధంగా సాగిపోతాయి. అను కోకుండా మంచి పెళ్లి సంబందం కుదురుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. పిల్లల చదువులు ఆశాజనకంగా సాగిపోతాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా గడిచిపోతుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో తప్పకుండా అధికార యోగం పట్టే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యాపారాల్లో కార్యకలాపాలు, లావాదేవీలు ఊపందుకుంటాయి. కొత్త ఒప్పందాలు కుదరడానికి అవకాశం ఉంది. ఆదాయం కొద్ది గానైనా పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. పిల్లల చదువుల విషయంలో ఆశించిన శుభవార్తలు వింటారు. కుటుంబ వ్యవహారాలు ప్రశాంతంగా సాగిపోతాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఆర్థికంగా కొద్దిపాటి ఇబ్బందులు తప్పకపోవచ్చు. కష్టార్జితంలో ఎక్కువ భాగం వృథా అవుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలను కష్టపడి పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులు చేపడతారు. వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పిల్లలు చదువులు, పోటీ పరీక్షల్లో ఘన విజయాలు సాధిస్తారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కుటుంబ జీవితం బాగానే సాగిపోతుంది. ఆరోగ్యం పరవా లేదు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
రోజంతా ఉత్సాహంగా, సానుకూలంగా గడిచిపోతుంది. ఆర్థిక వ్యవహారాలను జాగ్రత్తగా పూర్తి చేస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు సానుకూలంగా ముందుకు సాగుతాయి. ఆర్థిక సమ స్యల నుంచి చాలావరకు బయటపడతారు. ముఖ్యమైన పనులన్నీ విజయవంతంగా పూర్తవు తాయి. ఉద్యోగంలో సహోద్యోగులతో బాధ్యతలను పంచుకోవాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభ దాయకంగా సాగిపోతాయి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష‌్ట 1,2)
రావలసిన డబ్బు రానందువల్ల కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలలో అనుకూలతలు తక్కువగా ఉంటాయి. పని భారం బాగా పెరుగుతుంది. వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. ఆదాయంతో ఖర్చులు పోటీపడతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ బాధ్యతల ఒత్తిడి ఉంటుంది. జీవిత భాగస్వామితో దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ధనపరంగా వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం చేయవద్దు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆదరణకు, ప్రోత్సాహానికి లోటుండదు. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. తోబుట్టువులతో చిన్నా చితకా వివాదాలు సద్దుమణుగుతాయి. వ్యక్తిగత సమస్యల నుంచి కొద్దిగా విముక్తి లభిస్తుంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు కొత్త ఆఫర్లు లభిస్తాయి. వ్యాపారాల్లో పోటీదార్ల సమస్యలుంటాయి. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఎవరికీ హామీలు ఉండవద్దు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
రోజంతా సానుకూలంగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఉద్యో గంలో అధికారులు ఎక్కువగా మీ మీద ఆధారపడే అవకాశం ఉంటుంది. కొందరు మిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. కుటుంబంలో శుభ కార్యం జరగడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన విధంగా ఆఫర్లు అందుతాయి.