AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఆ రాశుల వారికి అనుకూల పరిస్థితులు.. సోమవారం రాశిఫలాలు..

Today Horoscope: ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో చాలాసార్లు ఇబ్బందుల్లో పడుతుంటాం. అందుకే కొత్త పనులను

Horoscope Today: ఆ రాశుల వారికి అనుకూల పరిస్థితులు.. సోమవారం రాశిఫలాలు..
Horoscope Today
Shaik Madar Saheb
|

Updated on: Nov 22, 2021 | 6:28 AM

Share

Today Horoscope: ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో చాలాసార్లు ఇబ్బందుల్లో పడుతుంటాం. అందుకే కొత్త పనులను మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు నిర్వహించాలన్నా.. జాతకాలు, రాశిఫలాలను అనుసరించేవారు చాలామంది ఉన్నారు. కావున సోమవారం (నవంబర్ 22న ) రాశి ఫలాలు ఎలా ఉన్నాయో.. ఓసారి తెలుసుకుందాం..

మేషం: ఈ రాశి వారికి ఈ రోజు శుభకాలం. ఒక శుభవార్త మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. కీలక వ్యవహారంలో అనుసరించిన పనితీరును పలువురు మెచ్చుకుంటారు. బంధువులు, సన్నిహితుల నుంచి సహకారం లభిస్తుంది.

వృషభం: ఈ రాశి వారు కీలక సమస్యలను అధిగమిస్తారు. భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగాలి. పనుల్లో తోటి వారిని ప్రాధాన్యం ఇస్తే త్వరగా పూర్తవుతాయి. ఖర్చులు కూడా పెరుగుతాయి.

మిథునం: ఈ రాశి వారు చేపట్టిన పనుల్లో పురోగతి కనిపిస్తుంది. కుటుంబసభ్యులు, బంధుమిత్రులను ఆదరిస్తారు. ఒక ముఖ్యమైన పనిని ఆచరణలో పెడతారు. ఆర్థిక మార్గాలు పెరుగుతాయి.

కర్కాటకం: ఈ రాశి వారికి మిశ్రమకాలం. చేపట్టిన పనుల్లో ఒత్తిడి పెరగకుండా ముందుకు సాగితే ఫలితం ఉంటుంది. కీలక వ్యవహారాల్లో ఆశించిన ఆర్థిక సహాయం అందుతుంది. మాట పట్టింపులకు దూరంగా ఉండాలి.

సింహం: ఈ రాశి వారికి అనుకూల కాలం. ఒక శుభవార్త మనోవిశ్వాసాన్ని పెంచుతుంది. అవసరానికి తగిన సాయం అందుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి.

కన్య: ఈ రోజు మంచి ఆలోచనలతో ముందుకు సాగితే ఫలితం ఉంటుంది. ఒక కీలక సమస్యకు పరిష్కారం లభిస్తుంది. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు తలెత్తుతాయి. కుటుంబసభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

తుల: ఒక కీలక పనిని ఈ రోజు ఎట్టకేలకు పూర్తిచేస్తారు. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరిచినప్పటికీ.. మనోధైర్యంతో ముందుకు సాగాలి. బంధుమిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

వృశ్చికం: ఈ రాశి వారు చేపట్టిన పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఆశించిన ఫలితాలు కనిపించకపోయినా.. మానసిక ప్రశాంతత ఉంటుంది. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులతో విషయాలను పంచుకుంటే మంచిది.

ధనుస్సు: ఈ రాశి వారు శుభవార్త వింటారు. పనితీరుకు అందరి నుంచి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబసభ్యులు, సన్నిహితుల నుంచి సహకారం లభిస్తుంది. ఆరోగ్య, ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.

మకరం: ఈ రాశి వారికి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ధైర్యంతో ముందడుగు వేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. బంధుమిత్రులు, సన్నిహితులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.

కుంభం: ఈ రాశి వారు చేపట్టిన పనుల్లో శ్రమ పెరిగినప్పటికీ.. ఆశించిన ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సహకారంతో ముందుకు సాగితే పనులు సకాలంలో పూర్తవుతాయి. బంధుమిత్రులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి.

మీనం: ఈ రాశి వారికి అనుకూల పరిస్థితులున్నాయి. భవిష్యత్తు ప్రణాళికలపై దృష్టిసారిస్తారు. అవసరానికి ధనం చేతికి అందుతుంది. కుటుంబసభ్యులు సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు.

Also Read:

Viral Video: స్వచ్ఛమైన ప్రేమంటే ఇదే.. తల్లి కోతిని ముద్దాడిన పిల్ల కోతి.. ఎందుకో తెలుసా..?

Mortuary Freezer: చనిపోయాడనుకొని మార్చురీ ఫ్రీజర్‌లో పెట్టారు.. 7 గంటల తర్వాత చూస్తే సీన్‌ రివర్స్‌..

తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త
శివుడు దిగొచ్చేది అప్పుడే... కోటి ప్రభల కోటప్పకొండ రహస్యం తెలుసా.
శివుడు దిగొచ్చేది అప్పుడే... కోటి ప్రభల కోటప్పకొండ రహస్యం తెలుసా.
ధోనీకి రూ.70,000 పెన్షన్.. బీసీసీఐ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవే
ధోనీకి రూ.70,000 పెన్షన్.. బీసీసీఐ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవే
సప్తగిరి క్లోజ్ ఫ్రెండే.. అందుకే అతడు నా సినిమాల్లో కనిపించడు
సప్తగిరి క్లోజ్ ఫ్రెండే.. అందుకే అతడు నా సినిమాల్లో కనిపించడు
తొక్కే కదా అని ఈజీగా తీసిపారేయకండి.. అది చేసే అద్భుతాలు తెలిస్తే
తొక్కే కదా అని ఈజీగా తీసిపారేయకండి.. అది చేసే అద్భుతాలు తెలిస్తే
ఆ తప్పుకు ఎయిర్ ఇండియాకు రూ.1 కోటి జరిమానా! ఒకటి, రెండు కాదు..8
ఆ తప్పుకు ఎయిర్ ఇండియాకు రూ.1 కోటి జరిమానా! ఒకటి, రెండు కాదు..8
ఆయన మాట వినడం వల్లే హీరోయిన్ అవకాశాలు తగ్గిపోయాయి..
ఆయన మాట వినడం వల్లే హీరోయిన్ అవకాశాలు తగ్గిపోయాయి..
కొలంబోలో కలకలం.. పాక్ టీమ్ కూర్చునే చోటే పాము ప్రత్యక్షం
కొలంబోలో కలకలం.. పాక్ టీమ్ కూర్చునే చోటే పాము ప్రత్యక్షం
మీ ప్రియమైన వారికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు ఇలా విష్ చేయండి
మీ ప్రియమైన వారికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు ఇలా విష్ చేయండి
శివరాత్రి: ఆకస్మిక ధనలాభం, విజయం… ఈ 5 రాశుల వారికి శివకృపతో లక్..
శివరాత్రి: ఆకస్మిక ధనలాభం, విజయం… ఈ 5 రాశుల వారికి శివకృపతో లక్..