Horoscope Today: వీరికి ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి.. నేడు రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

|

Mar 20, 2022 | 6:46 AM

Horoscope Today (20.03.2022): జీవితంపై రాశి ఫలాల ప్రభావం ఉంటుందని నమ్మేవారు చాలా మంది ఉంటారు. అందుకే ప్రతి రోజూ తమ దిన ఫలాలను (Horoscope) చూసుకుంటారు. అంతేనా ఈ ఫలితాల ఆధారంగానే రోజును ప్లాన్‌ చేసుకునే వారు కూడా చాలా మందే ఉంటారు

Horoscope Today: వీరికి ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి.. నేడు రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope
Follow us on

Horoscope Today (20.03.2022): జీవితంపై రాశి ఫలాల ప్రభావం ఉంటుందని నమ్మేవారు చాలా మంది ఉంటారు. అందుకే ప్రతి రోజూ తమ దిన ఫలాలను (Horoscope) చూసుకుంటారు. అంతేనా ఈ ఫలితాల ఆధారంగానే రోజును ప్లాన్‌ చేసుకునే వారు కూడా చాలా మందే ఉంటారు. మరి మార్చి20వ తేదీ(ఆదివారం) మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేయండి..

మేషం

పట్టుదలతో అనుకున్న పనులు పూర్తిచేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలపై కీలక నిర్ణయం తీసుకుంటారు. ఒక శుభవార్త ఆత్మవిశ్వాసం, మనోధైర్యాన్ని పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను సమయస్ఫూర్తితోఅధిగమించాలి. శ్రీనివాసుడి నామం పఠిస్తే శుభం కలుగుతుంది.

వృషభం

చేపట్టిన రంగాల్లో విజయం సాధించాలంటే ఓర్పు, పట్టుదల చాలా అవసరం. కుటుంబీకులు, స్నేహితులు, బంధువులతో వాదనలకు దిగడం వల్ల ఎలాంటి ఫలితముండదు. పైగా విభేదాలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. అవసరానికి మించిన ఖర్చులు ఉంటాయి. నవగ్రహ ఆలయాలను దర్శించుకుంటే మంచిది.

మిథునం

సమయానుకూలంగా ముందుకు సాగండి. మీ పనితీరుకు ఉన్నతాధికారుల ప్రశంసలు లభిస్తాయి. ఒక ముఖ్య విషయమై అధికారులను కలుస్తారు. సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. ఆదాయానికి తగ్గ ఖర్చులు కూడా ఉంటాయి. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. లక్ష్మీ దర్శనం ఉత్తమం.

కర్కాటకం

ఈరాశివారు ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసం, మనోధైర్యాన్ని కోల్పోకూడదు. ఇష్ట దైవారాధన శుభప్రదం.

సింహం

మీ మీ రంగాల్లో అభివృద్ధికి సంబంధించి ఒక శుభవార్త వింటారు. అదే సమయంలో ఒక సంఘటన మనసుకు బాధ కలిగిస్తుంది. అనారోగ్య సమస్యల గురించి అలక్ష్యం చేయకండి. ఇష్ట దేవతలను ఆరాధిస్తే మంచి కలుగుతుంది.

కన్య

వీరికి శుభకాలం నడుస్తోంది. చిత్తశుద్ధితో అనుకున్న లక్ష్యాలు నెరవేర్చుకుంటారు. అయితే కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తలెత్తకుండా వ్యవహరించాలి. ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురికాకుండా సహనంతో వ్యవహరించాలి. శివుడిని ఆరాధించడం వల్ల మంచి జరుగుతుంది.

తుల

ప్రారంభించిన పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతాయి. అయినప్పటికీ ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు. బుద్ధిబలంతో అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబాభివృద్ధికి సంబంధించి ఒక శుభవార్త సంతోషాన్ని కలిగిస్తుంది. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు.

వృశ్చికం

చేపట్టిన రంగాల్లో ఆశించిన ఫలితాలను అందుకుంటారు. అదృష్టం తోడుగా ఉంటుంది. విందులు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఇష్టదేవతలను ప్రార్థిస్తే మంచి కలుగుతుంది.

ధనుస్సు

మనోధైర్యం కోల్పోకూడదు. ఆపదలెదురైనా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు. ప్రియమైనవారితో సమయం గడుపుతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటే ఉత్తమం.

మకరం

ప్రారంభించబోయే పనుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. కుటుంబీకులు, స్నేహితులు, సన్నిహితుల, బంధువుల సహకారం ఉంటుంది. అయితే జీవితానికి సంబంధించి కీలక వ్యవహారాల్లో ముందుచూపు చాలా అవసరం. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల అనుకూల ఫలితాలు పొందగలుగుతారు.

కుంభం

వీరికి మిశ్రమ కాలం నడుస్తోంది. కీలక వ్యవహారాల్లో ఆచితూచి అడుగేయాలి. అధికారులు మీ తీరుతో సంతృప్తిపడక పోవచ్చు. అస్థిర నిర్ణయాలతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. గొడవలకు దూరంగా ఉండాలి. నవగ్రహ శ్లోకాలు చదివితే మంచి కలుగుతుంది.

మీనం

అనుకున్న రంగాల్లో ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఒక వ్యవహారంలో సన్నిహితులు, స్నేహితుల సహకారం అందుతుంది. ఒక శుభవార్త మీ మనోవిశ్వాసాన్ని పెంచుతుంది. దైవబలం తోడుంటుంది. ఇష్టదేవతలను పూజిస్తే శుభం కలుగుతుంది.
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

Also Read:Anand Mahindra: మంచి పనులు చేయటంలో మీరు తగ్గొద్దు.. సహాయం చేయటంలో మేం తగ్గేదే లే..

Edible Oil: సామాన్యులకు శుభవార్త..! వంట నూనెల ధరలు తగ్గుతాయా..

Beauty Tips: 40 ఏళ్లు దాటిన తర్వాత చర్మంపై ముడతలు రావడం మొదలయ్యాయి, ఈ ఫేస్ ప్యాక్‌లను వదులుకోండి!