Horoscope Today: వీరికి అదృష్టం వెన్నంటే ఉంటుంది.. స్థిరాస్థులు కొనుగోలు చేస్తారు.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

|

Apr 21, 2022 | 5:23 AM

Horoscope Today: చాలా మంది ఉదయం లేవగానే తమ రాశి ఫలాలు(Rasi Phalalu) ఎలా ఉన్నాయో చూసుకుంటారు. వాటి ఆధారంగానే నిర్ణయాలు కూడా తీసుకుంటుంటారు.

Horoscope Today: వీరికి అదృష్టం వెన్నంటే ఉంటుంది.. స్థిరాస్థులు కొనుగోలు చేస్తారు.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope
Follow us on

Horoscope Today: చాలా మంది ఉదయం లేవగానే తమ రాశి ఫలాలు(Rasi Phalalu) ఎలా ఉన్నాయో చూసుకుంటారు. వాటి ఆధారంగానే నిర్ణయాలు కూడా తీసుకుంటుంటారు. ఏ పనులు చేపడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి.. ఎలా ముందుకు సాగాలి అనే విషయాలపై ప్రత్యేక దృష్టి సారించి ముందుకు సాగుతారు. మరి బుధవారం (ఏప్రిల్‌ 120) రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి.

మేషం

ఈ రాశివారికి మిశ్రమకాలం నడుస్తోంది. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారం తీసుకోవడం మంచిది. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. దుర్గాదేవి ఆరాధిస్తే శుభం కలుగుతుంది.

వృషభం

ఆయా రంగాల్లో అనుకూల ఫలితాలు అందుకుంటారు. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తీసుకోవడం తప్పనిసరి. అనవసర విషయాల్లో తల దూర్చి సమయం వృథా చేసుకోకండి. ఇష్టదేవతలను పూజించడం వల్ల మేలు చేకూరుతుంది.

మిథునం

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సానుకూల ఫలితాలు అందుకుంటారు. బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తిచేయగలుగుతారు. కీలక విషయాలకు సంబంధించి మరింత ముందడుగు వేస్తారు.

కర్కాటకం

చిత్తశుద్ధితో చేసే పనుల వల్ల అంతా మంచి జరుగుతుంది. అయితే కొందరి మాటల వల్ల ఇబ్బందిపడతారు. మనోధైర్యాన్ని కోల్పోకూడదు. అనవసర విషయాల్లో తలదూర్చకూడదు. సమయం వృథా చేసుకోకూడదు. నవగ్రహ ధ్యానం వల్ల మంచి ఫలితాలు అందుకుంటారు.

సింహం

ఉత్సాహంగా పనిచేయగలుగుతారు. చేపట్టిన పనుల్లో విజయం సిద్ధిస్తుంది. స్థిరాస్థి కొనుగోలు విషయాల్లో సానుకూల ఫలితాలు అందుకుంటారు. మీ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుందన్న విషయం గుర్తుంచుకుని ముందుకు సాగాలి.

కన్య

వీరికి శుభ ఘడియలు నడుస్తున్నాయి. ఆయా రంగాల్లో ఆశించిన ఫలితాలు అందుకుంటారు. అదృష్టం వెన్నంటే ఉంటుంది. విందులు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతారు.

తుల

కుటుంబీకులు, స్నేహితుల సహకారంతో పనుల్లో అనుకూల ఫలితాలు అందుకుంటారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. కీలక విషయాలకు సంబంధించిన శుభవార్తలు వింటారు. ప్రారంభించిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటారు. శని దేవుడిని పూజిస్తే ఉత్తమ ఫలితాలు అందుకుంటారు.

వృశ్చికం

కీలక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. నిరాశ, నిస్పృహలకు దూరంగా ఉండాలి. మనో ధైర్యాన్ని కోల్పోకూడదు. ఇష్ట దేవతలను ఆరాధిస్తే శుభం కలుగుతుంది.

ధనుస్సు

వీరికి మిశ్రమ కాలం. ముఖ్య పనులను కొన్నాళ్లు వాయిదా వేసుకోవడమే మంచిది. కొన్ని సంఘటనలు తీవ్ర నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగంలో ఆచితూచి, అప్రమత్తంగా వ్యవహరించాలి. దుర్గాదేవి, వెంకటేశ్వర స్వామిని పూజిస్తే సానుకూల ఫలితాలు అందుకుంటారు.

మకరం

చిత్తశుద్ధితో సకాలంలో పనులన్నీ పూర్తి చేస్తారు. సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబీకులు, బంధు,మిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. రామనామాన్ని పఠించడం వల్ల మేలు కలుగుతుంది.

కుంభం

మనసుకు సంతోషాన్నిచ్చే వార్తలు వింటారు. కుటుంబ సభ్యులు, బంధువులతో ప్రేమగా, దయతో వ్యవహరించాలి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం వల్ల మంచి ఫలితాలు అందుకుంటారు.

మీనం

పట్టుదలతో అనకున్న పనుల్లో విజయం సాధిస్తారు. కీలక వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులెదురైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగేయాలి. విందు, వినోదాలతో సంతోషంగా గడుపుతారు. లక్ష్మీదేవిని పూజిస్తే సానుకూల ఫలితాలు అందుకుంటారు.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

Also Read:Fire Accident: బేగంబజార్‌లో పేలిన ట్రాన్స్‌ఫార్మర్.. భారీ ఎత్తున మంటలు.. క్షణాల్లోనే దగ్ధమైన ఇన్నోవా..

Biliti Electric: తెలంగాణలో ఎలక్ట్రిక్‌ త్రీ వీలర్‌ ఫ్యాక్టరీ.. ప్రపంచంలోనే అతిపెద్దది..!

Biliti Electric: తెలంగాణలో ఎలక్ట్రిక్‌ త్రీ వీలర్‌ ఫ్యాక్టరీ.. ప్రపంచంలోనే అతిపెద్దది..!