Horoscope Today: తొందరపాటు నిర్ణయాలతో వారికి ఇబ్బందులు.. 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (జూన్ 19, 2024): మేష రాశికి చెందిన నిరుద్యోగులు ఈ రోజు ఉద్యోగానికి సంబంధించి ఆశించిన శుభవార్త వింటారు. వృషభ రాశి వారికి కొన్ని కీలకమైన ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. మిథున రాశి వారికి ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: తొందరపాటు నిర్ణయాలతో వారికి ఇబ్బందులు.. 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు
Horoscope Today 19th June 2024

Edited By:

Updated on: Jun 19, 2024 | 5:01 AM

దిన ఫలాలు (జూన్ 19, 2024): మేష రాశికి చెందిన నిరుద్యోగులు ఈ రోజు ఉద్యోగానికి సంబంధించి ఆశించిన శుభవార్త వింటారు. వృషభ రాశి వారికి కొన్ని కీలకమైన ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. మిథున రాశి వారికి ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

రోజంతా బాగా అనుకూలంగా గడిచిపోతుంది. నిరుద్యోగులు ఉద్యోగానికి సంబంధించి ఆశించిన శుభవార్త వింటారు. ఉద్యోగంలో జీతభత్యాలు బాగా పెరిగే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు సానుకూల ఫలితాలనిస్తాయి. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం నెలకొని ఉంది. ఆర్థిక పరిస్థితి అంచనాలకు మించి చక్కబడుతుంది. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. వృత్తి జీవితంలో రాబడి పెరుగుతుంది. తొందరపాటు నిర్ణయాలతో ఇబ్బంది పడతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటుంది. కొన్ని కీలకమైన ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో హోదా పెరిగే అవకాశం ఉంది. చిన్ననాటి మిత్రులతో విహార యాత్రకు ప్లాన్ చేస్తారు. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. ఇంటా బయటా కాస్తంత ఒత్తిడి ఉంటుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కార మయ్యే అవకాశం ఉంది. కుటుంబ జీవితం సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదనిపి స్తుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, వ్యాపారాలు రాబడిపరంగా దూసుకుపోతాయి. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. వివాహ, ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన శుభ ఫలితాలుంటాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. మానసికంగా ఒత్తిడి తగ్గుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవ కాశం ఉంది. ఉద్యోగులకు సామరస్య వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనుల్లో విజయవంతం అవుతాయి. జీవిత భాగస్వామితో వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. కొన్ని ప్రత్యేక బాధ్యతలు తప్పకపో వచ్చు. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలువుతాయి. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా, ఆశాజనకంగా సాగిపోతాయి. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. బంధు వుల సహకారంతో వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ముఖ్యమైన పనులు సకా లంలో పూర్తవుతాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపో తుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. ఆశించిన స్థాయి లాభాలు అందకపోవచ్చు. ఆర్థిక విష యాల్లో కొద్దిగా ముందుచూపుతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. తలపెట్టిన పనుల్ని సకాలంలో పూర్తి చేస్తారు. ఇంట్లో శుభ కార్యం తలపెడతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అంది వస్తాయి. ప్రయాణాలు, ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటిం చాల్సి ఉంటుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. బంధువుల వల్ల సమస్యలు ఎదురవుతాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

కుటుంబసమేతంగా ఆలయాలను సందర్శిస్తారు. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. మిత్రుల నుంచి రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాల నిస్తాయి. ఉద్యోగాల్లో అధికారులతో సాన్నిహిత్యం వృద్ధి చెందుతుంది. ఇంటా బయటా మాటకు విలువ పెరుగుతుంది. వీలైనంతగా ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. ఆరోగ్యం పరవాలేదు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగ జీవితంలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. అనేక విధాలుగా అనుకూలతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు బిజీ అయిపోతాయి. ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ముఖ్య మైన పనుల్లో వ్యవహార జయం ఉంటుంది. ఒకటి రెండు ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు పరి ష్కారం అయి ఊరట చెందుతారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తి వివాదం విషయంలో శుభవార్త వింటారు. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట )

వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి సమస్యలు, ఆటంకాలు ఉండే అవకాశం ఉంది. ఆదాయం బాగానే ఉంటుంది కానీ, ఖర్చుల మీద అదుపు ఉండదు. ఉద్యోగం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. ఇంటా బయటా గౌరవ మర్యాదలకు లోటుండదు. కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలు వెల్లి విరు స్తాయి. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. బంధువుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ముఖ్యమైన పనులన్నీ పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాలు సత్ఫలితాలనిస్తాయి. కుటుంబ జీవితం సానుకూలంగా ఉంటుంది. కుటుంబ సమేతంగా దైవ కార్యాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. వృత్తి జీవి తంలో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. బంధు మిత్రుల నుంచి ఆర్థికంగా ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక లావాదేవీల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)

వృత్తి, ఉద్యోగాలు సాదా సీదాగా సాగిపోతాయి. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా వ్యవహరించడం మంచిది. వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ప్రభుత్వమూలక ధన లాభం ఉంటుంది. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. బంధు మిత్రుల రాకపోకలుంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పిల్లల విషయంలో శుభ వార్తలు వింటారు. ముఖ్యమైన వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో అధికారుల నుంచి వేధింపులుంటాయి. పనిభారం పెరిగి ఇబ్బంది పడతారు. వృత్తి, వ్యాపారాలు నిలకడగా, నిదానంగా సాగిపోతాయి. ప్రయాణాలు లాభసాటిగా సాగిపోతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. ఆర్థిక సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. ఒకటి రెండు ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు తొలగిపోతాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోక పోవడం శ్రేయస్కరం. కొందరు మిత్రులకు అండగా నిలబడతారు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

తల్లితండ్రుల జోక్యంతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమవుతుంది. బంధువుల నుంచి ఇబ్బందు లుంటాయి. ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. డబ్బుకు లోటుండదు. సొంత ఆలోచనల ఆశించిన ఫలితాలనిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలంగా మారతాయి. వ్యాపా రాల్లో పైచేయి సాధిస్తారు. జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు.