Horoscope Today: ఆర్థిక ఒత్తిళ్ల నుంచి వారు బయటపడుతారు.. 12 రాశుల వారికి శుక్రవారం రాశిఫలాలు

| Edited By: Janardhan Veluru

Apr 19, 2024 | 5:01 AM

దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఆర్థిక లావాదేవీలు అంచనాలకు మించి లాభిస్తాయి. వృషభ రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. మిథున రాశి వారికి ఉద్యోగంలో కష్టానికి తగ్గ ప్రతిఫలం కనిపిస్తుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: ఆర్థిక ఒత్తిళ్ల నుంచి వారు బయటపడుతారు.. 12 రాశుల వారికి శుక్రవారం రాశిఫలాలు
Horoscope Today 19th April 2024
Follow us on

దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఆర్థిక లావాదేవీలు అంచనాలకు మించి లాభిస్తాయి. వృషభ రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. మిథున రాశి వారికి ఉద్యోగంలో కష్టానికి తగ్గ ప్రతిఫలం కనిపిస్తుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, ఉద్యోగాల్లో కొత్తగా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. జీవిత భాగస్వామికి ఆర్థికంగా అదృష్టం పడుతుంది. ఆర్థిక లావాదేవీలు అంచనాలకు మించి లాభిస్తాయి. నిరుద్యోగులకు ఊహించని ఆఫర్లు అందుతాయి. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కా రమవుతుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపో తాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనుల్ని సకాలం పూర్తి చేస్తారు. దూర ప్రాంత బంధువులతో సఖ్యత పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలకు, శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎవరికీ ఎటువంటి వాగ్దానాలు చేయకపోవడం ఉత్తమం. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఏ ప్రయత్నం తలపెట్టినా విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో కష్టానికి తగ్గ ప్రతిఫలం కనిపిస్తుంది. వృత్తి, వ్యాపారాలు నిదానంగా పురోభివృద్ధి చెందుతాయి. వ్యాపారంలో సొంత నిర్ణయాలు ఆశించిన ప్రయోజనలు కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. ప్రయాణాల వల్ల ఆర్థిక లాభం కలుగుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా, సాఫీగా సాగిపోతాయి.

కర్కాటకం (పునర్వసు 4, పు‌ష్యమి, ఆశ్లేష)

వృత్తి, వ్యాపారాల్లో లాభాలు మరింతగా పెరుగుతాయి. ఉద్యోగ జీవితం అనుకూలంగా సాగిపో తుంది. అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన పనులు కూడా కొద్దిగా ఆలస్యం అవు తాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. విద్యార్థులు శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా అపార్థాలు తలెత్తవచ్చు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక వాతావరణం బాగా అనుకూలంగా ఉంటుంది. ఇంటా బయటా కొన్ని సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. ఆర్థిక సమస్యల నుంచి, ఒత్తిళ్ల నుంచి చాలావరకు బయటపడతారు. సోదరులతో ఆస్తి వివాదాన్ని రాజీ మార్గంలో పరిష్క రించుకుంటారు. ఉద్యోగంలో సానుకూల పరిస్థితులుంటాయి. వృత్తి జీవితం ఉత్సాహంగా సాగిపో తుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఆరోగ్యం విషయంలోనూ, ప్రయాణాల విషయంలోనూ కొద్దిగా ఇబ్బందులుంటాయి. కాస్తంత జాగ్ర త్తగా ఉండడం మంచిది. మిత్రులతో కష్టసుఖాలను పంచుకుంటారు. ఇల్లు కొనాలనే ఆలోచన చేస్తారు. కొందరు ఇష్టమైన బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. ఒక ప్రణాళిక ప్రకారం పనులు, వ్యవహారాలు పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాలు సవ్యంగా సాగిపోతాయి. విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

బంధువుల జోక్యంతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగు తుంది. వృత్తి జీవితంలో బిజీ అయిపోతారు. వ్యాపారాల్లో లాభాలకు కొరత ఉండదు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

సన్నిహితుల నుంచి అనేక విధాలుగా సహాయ సహకారాలు అందుతాయి. ప్రయాణాల్లో డబ్బు నష్టం గానీ, విలువైన వస్తువులో కోల్పోవడం గానీ జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. ప్రస్తుతానికి హామీలు ఉండడం, వాగ్దానాలు చేయడం చేయవద్దు. ఆరో గ్యం నిలకడగా ఉంటుంది. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ముఖ్యమైన ప్రయత్నాలు నిరాటంకంగా పూర్తవుతాయి. చేపట్టిన పనుల్ని కూడా నిదానంగా ముగిస్తారు. బంధుమిత్రులతో వివాదాలు పరిష్కారమవుతాయి. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. ఆరోగ్యం విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ జీవితంలో సానుకూలతలు పెరు గుతాయి. వృత్తి జీవితంలో రాబడి బాగా పెరుగుతుంది. వ్యాపారాలు బాగా పుంజుకుంటాయి. విద్యార్థులు కొద్ది శ్రమతో ఆశించిన ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపో తాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొన్ని రుణ సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశముంది. చాలా కాలంగా వేధిస్తున్న వ్యక్తిగత సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. ఒకటి రెండు శుభ వార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగాలు అనుకూలంగా గడిచిపోతాయి. వ్యాపారాలు నిలకడగా ఉంటాయి. విద్యార్థులు కొద్దిగా శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

దూరమైపోయిన బంధువులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి మరింత అనుకూ లంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల విష యంలో తొందరపాటుతో వ్యవహరించకపోవడం మంచిది. ఉద్యోగ జీవితంలో ప్రాభవం పెరుగు తుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు కలిసి వస్తాయి. పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకోవడం అవసరం. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు నిదానంగా ముందుకు సాగుతాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

జీవిత భాగస్వామి సహాయంతో ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. వృత్తి, వ్యాపారాల్లో విశేష లాభాలు అందుకుంటారు. ఉద్యోగంలో జీతభత్యాలకు సంబంధించి శుభవార్త వింటారు. ప్రతి పనినీ, ప్రతి వ్యవహారాన్నీ పట్టుదలగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగా వకాశాలు అందివస్తాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. విలాసాల మీద ఖర్చు పెరు గుతుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.