Horoscope Today: ప్రయాణాల్లో ఆటంకాలు.. మొహమాటంతో ఇబ్బందులు.. నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: చాలా మంది ఉదయం లేవగానే తమ రాశి ఫలాలు(Rasi Phalalu) ఎలా ఉన్నాయో చూసుకుంటారు.

Horoscope Today: ప్రయాణాల్లో ఆటంకాలు.. మొహమాటంతో ఇబ్బందులు.. నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope Today
Follow us

|

Updated on: Apr 19, 2022 | 5:49 AM

Horoscope Today: చాలా మంది ఉదయం లేవగానే తమ రాశి ఫలాలు(Rasi Phalalu) ఎలా ఉన్నాయో చూసుకుంటారు. వాటి ఆధారంగానే నిర్ణయాలు కూడా తీసుకుంటుంటారు. ఏ పనులు చేపడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి.. ఎలా ముందుకు సాగాలి అనే విషయాలపై ప్రత్యేక దృష్టి సారించి ముందుకు సాగుతారు. మరి మంగళవారం (ఏప్రిల్‌ 19) రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి.

మేషం

అనుమానాలు, సందేహాలతో సమయాన్ని వృథా చేయకండి. కుటుంబ సభ్యులు, బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురుకావొచ్చు. శివుడిని ఆరాధిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి.

వృషభం

ప్రారంభించిన పనులను అనుకున్న సమయానికి ప్రణాళికాబద్ధంగా పూర్తిచేస్తారు. మనసుకు నచ్చిన వారితో సమయాన్ని గడుపుతారు. ఆర్థిక పరిపుష్టి ఉంటుంది. నారాయణ మంత్రాన్ని పఠించడం వల్ల శుభం కలుగుతుంది.

మిథునం

ఈరాశివారికి ఈరోజు అనుకూల ఫలితాలు ఉన్నాయి. ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కొన్నాళ్లుగా పరిష్కారం కాని ఒక సమస్య పరిష్కారం అవుతుంది. శ్రీనివాసుడిని పూజిస్తే మేలు చేకూరుతుంది.

కర్కాటకం

గిట్టనివారు మీపై బురద చల్లడానికి రెడీగా ఉంటారు. అయినా పట్టుదల కోల్పోకండి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండడం మంచిది. ఇష్టదేవతలను ఆరాధిస్తే సమస్యల నుంచి బయటపడతారు.

సింహం

గ్రహబలం అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు, బాధ్యతలను సమర్థంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులు, బంధువుల సలహాలతో అనుకున్న పనుల్లో విజయాలు సాధిస్తారు. సాయిబాబాను పూజిస్తే మంచి కలుగుతుంది.

కన్య

కొన్ని విషయాల్లో శ్రమ తప్పదు. స్నేహితుల సహకారం అందుతుంది. మనసు పెట్టి పనిచేస్తే మంచి ఫలితాలు అందుకుంటారు . ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. ఇష్ట దైవారాధనతో అనుకూల ఫలితాలు అందుకుంటారు.

తుల

ఆత్మవిశ్వాసాన్ని, మనో ధైర్యాన్ని కోల్పోకూడదు. శారీరక శ్రమ పెరుగుతుంది. అనవసర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ వాతావరణం కూడా అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. శని దేవుడిని పూజిస్తే శుభం కలుగుతుంది.

వృశ్చికం

బుద్ధిబలంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. సమయానుకూలంగా కీలక నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి జరుగుతుంది. కుటుంబీకులు, బంధువులతో సంతోషంగా గడుపుతారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే మరింత మంచిది.

ధనుస్సు

ఈరాశివారు అనుకూల ఫలితాలు అందుకుంటారు. అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి మంచి ఫలితాలు సాధిస్తారు. కుటుంబ సభ్యులు, బంధువుల సహకారం ఉంటుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవారాధన మంచి చేకూరుస్తుంది.

మకరం

ముఖ్యమైన పనులు ప్రారంభిస్తారు. మొహమాటాన్ని దూరం పెట్టడం మంచింది. ఆహారం విషయంలో అలక్ష్యం పనికిరాదు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే అనుకూల ఫలితాలు అందుకుంటారు.

కుంభం

జీవితానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు. స్థిరమైన ఆలోచనలతో ముందకు సాగాలి. కుటుంబ సభ్యులు, బంధువులతో సంతోషంగా గడుపుతారు. దుర్గా అష్టోత్తరం పఠించడం వల్ల శుభం కలుగుతుంది.

మీనం

శారీరక శ్రమ పెరగకుండా చూసుకోవాలి. మొహమాటం వల్ల ఇబ్బందులు పడతారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. వెంటేశ్వర స్వామిని దర్శించుకోవడం వల్ల సానుకూల ఫలితాలు అందుకుంటారు.

Also Read:Rupee: బలహీనపడిన భారత కరెన్సీ.. డాలర్‌తో పోలిస్తే 10 పైసలు తగ్గిన రూపాయి..

Covid 19: ఆ రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు.. ఆ నాలుగు జిల్లాల్లో ఫేస్‌ మాస్క్‌ తప్పనిసరి..!

New Army Chief: ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే.. తొలిసారి ఇంజినీర్‌కు భారత సైన్యం బాధ్యతలు..

నేను శివ స్వరూపాన్ని.. ఆ బాలుడి జోస్యం నిజమైందా.! శివలింగం ఉందని.
నేను శివ స్వరూపాన్ని.. ఆ బాలుడి జోస్యం నిజమైందా.! శివలింగం ఉందని.
వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో.! 30 ఏళ్లుగా ఆ పుట్టలోనే..
వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో.! 30 ఏళ్లుగా ఆ పుట్టలోనే..
మెదక్‌లో యువతిపై ప్రేమోన్మాది దాడి.. ఏం చేశాడంటే..!
మెదక్‌లో యువతిపై ప్రేమోన్మాది దాడి.. ఏం చేశాడంటే..!
కడుపులో బ్లేడ్లు.. బ్యాటరీలు ఆపరేషన్ చేసినా దక్కని బాలుడి ప్రాణం!
కడుపులో బ్లేడ్లు.. బ్యాటరీలు ఆపరేషన్ చేసినా దక్కని బాలుడి ప్రాణం!
బద్దలైన అగ్నిపర్వతం.. ఖాళీ అవుతున్న గ్రామాలు.! వీడియో వైరల్..
బద్దలైన అగ్నిపర్వతం.. ఖాళీ అవుతున్న గ్రామాలు.! వీడియో వైరల్..
హిందూ ఆలయంపై దాడి.! దాడులను ఖండించిన ప్రధాని..
హిందూ ఆలయంపై దాడి.! దాడులను ఖండించిన ప్రధాని..
రైల్లోంచి కాల్వలోకి దూకేసింది.. ఆ తర్వాత 8 గంటలు ఏం జరిగింది.?
రైల్లోంచి కాల్వలోకి దూకేసింది.. ఆ తర్వాత 8 గంటలు ఏం జరిగింది.?
మంటలకు జామ్‌ అయిన కిటికీలు తలుపులు.! మంటలకు పిల్లి కారణమా..
మంటలకు జామ్‌ అయిన కిటికీలు తలుపులు.! మంటలకు పిల్లి కారణమా..
రోజూ ఒక్క స్పూన్ తాగండి మీ లైఫే మారిపోతుంది.! కొబ్బరి నూనెలో పోషక
రోజూ ఒక్క స్పూన్ తాగండి మీ లైఫే మారిపోతుంది.! కొబ్బరి నూనెలో పోషక
AI టెక్నాలజీతో ఎప్పుడు చనిపోతారో తెలిసిపోతుంది.! వీడియో వైరల్..
AI టెక్నాలజీతో ఎప్పుడు చనిపోతారో తెలిసిపోతుంది.! వీడియో వైరల్..