దిన ఫలాలు (నవంబర్ 17, 2023): మేష రాశి వారు కొద్దిపాటి శ్రమ ఉన్నప్పటికీ, పట్టుదలగా ముఖ్యమైన వ్యవహారాలను, పనులను పూర్తి చేస్తారు. వృషభ రాశి వారు ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడడం జరుగుతుంది.ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. మిథున రాశి వారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంటుంది. రావలసిన బాకీలు, బకాయిలన్నీ వసూలు అవుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
కొద్దిపాటి శ్రమ ఉన్నప్పటికీ, పట్టుదలగా ముఖ్యమైన వ్యవహారాలను, పనులను పూర్తి చేస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన ఎదుగుదల ఉంటుంది. మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో పోటీదార్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అనవసర పరిచయాలు ఏర్పడడం, స్వల్ప అనారోగ్యానికి గురికావడం వంటివి జరిగే అవకాశం ఉంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడడం జరుగుతుంది.ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. అధికారులు, సహోద్యోగుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యక్తి గత, కుటుంబ సమస్యల కారణంగా కొద్దిగా ఒత్తిడికి గురవుతారు. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యంలో పాల్గొంటారు. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు సఫలం కాకపోవచ్చు. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంటుంది. రావలసిన బాకీలు, బకాయిలన్నీ వసూలు అవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వృత్తి, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు ఆశించిన దానికంటే ఎక్కువగా కలిసి వస్తాయి. ముఖ్య మైన వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. పిల్లల చదువుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. మిత్రుల వల్ల కొద్దిగా డబ్బు నష్టపోయే సూచనలు న్నాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. బంధుమిత్రులకు అండగా నిలబ డతారు. సతీమణితో అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగి పోతుంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన విధంగా ఆఫర్ వచ్చేఅవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రస్తుతానికి ఎవరికీ హామీలు ఉండవద్దు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో పని భారం కాస్తంత ఎక్కువగా ఉంటుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఉద్యోగ, వివాహ ప్రయత్నా లలో చికాకులు తప్పకపోవచ్చు. ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. బంధు మిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆధ్యాత్మిక చింతన పెరిగి, దైవ కార్యాల్లో పాల్గొం టారు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలు సాఫీగా సాగిపోతాయి. వ్యాపారాల్లో సంపాదన నిలకడగా ఉంటుంది. కుటుంబ జీవితం, దాంపత్య జీవితం సామరస్యంగా ముందుకు సాగిపోతాయి. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. ఇతరులకు సహాయం చేస్తారు. సామా జిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పిల్లల నుంచి మంచి కబుర్లు వింటారు. కొందరు సన్నిహి తులు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. సహోద్యోగులతో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగంలో ప్రమోషన్ రావచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఎంత సానుకూల దృక్ప థంతో వ్యవహరిస్తే అంత మంచిది. పెళ్లి ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ముందుకు దూసుకు వెడతారు. సతీమణితో సామరస్యం, అన్యోన్యత పెరుగుతాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. విదేశాల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
కొద్దిగా బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ, సకాలంలో లక్ష్యాలను, బాధ్యతలను పూర్తి చేయడం జరుగుతుంది. తల్లితండ్రులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. కుటుంబపరంగా ఆశించిన అభివృద్ధి ఉంటుంది. కొన్ని వ్యక్తిగత, కుటుంబ సమస్యలు పరిష్కారం అయి, మనశ్శాంతి ఏర్పడుతుంది. ఆరోగ్యంలో మెరుగుదల కనిపిస్తుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యమైన వ్యవహా రాలు ఆశించిన విధంగా నెరవేరుతాయి. కొందరు బంధువులు విమర్శలకు పాల్పడే అవకాశం ఉంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఒక ముఖ్యమైన వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది. మిత్రుల సాయంతో ముఖ్యమైన వ్యవహారాలన్నీ సానుకూలంగా పూర్తవుతాయి. సతీమణికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు విస్తరిస్తాయి. అనవసర పరిచయాలకు, వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో భద్రత, స్థిరత్వం లభిస్తాయి. సామాజికంగా ఊహించని గుర్తింపు లభిస్తుంది. పలుకుబడి పెరుగుతుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. వృత్తి, ఉద్యోగాలలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కొందరు సహచరుల వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు. పిల్లలు ఆశించిన స్థాయిలో వృద్ధిలోకి వస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మనసులోని కోరిక ఒకటి నెరవేరుతుంది. కుటుంబపరంగా శుభ వార్తలు వింటారు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
మంచి పరిచయాలు ఏర్పడతాయి. గౌరవ మర్యాదలకు లోటుండదు. ఉద్యోగంలో మార్పు కోరు కుంటున్నవారికి అనుకూల సమయం నడుస్తోంది. తల్లితండ్రుల నుంచి ఆశించిన సహాయ సహ కారాలు లభిస్తాయి. విదేశాలలో వృత్తి, ఉద్యోగాలలో ఉన్న పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి. మిత్రుల సహాయంతో కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. హామీలు ఉండవద్దు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
కొద్ది ప్రయత్నంతో ఒకటి రెండు ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, అనవసర వ్యవహారాల మీద డబ్బు ఎక్కువగా ఖర్చవు తుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. వివాహ ప్రయత్నాలలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. తల్లితండ్రుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..